Romance on Bike
ఇటీవల కాలంలో యువతీయువకులు చిన్న వయసు నుంచే ప్రేమల వెంట పుడుతున్నారు. ఆకర్షణను కూడా ప్రేమగా భావిస్తూ ఎంతో మంది చిన్నారులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అయితే ఈ మద్య కాలంలో యువతీ యువకుల మధ్య పుట్టిన ప్రేమ చివరికి సభ్యసమాజాన్ని ఇబ్బందులకు గురి చేస్తోంది.
అదేంటి యువతీ యువకుల మధ్య పుట్టిన ప్రేమకు సభ్య సమాజంలో ఉండే జనాలకు ఏంటి సంబంధం అని అనుకుంటున్నారు కదా. ప్రేమ పుట్టిన తర్వాత ఎంతో హుందాగా నడుచుకుంటే ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ప్రేమలో మునిగి తేలుతున్న యువత నేటి రోజుల్లో పార్కులు పబ్లిక్ ప్లేసులు అనే తేడా లేకుండా రొమాన్స్ లో కూడా మునిగితేలుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
పక్కన ఉన్న వాళ్ళు మనల్ని చూస్తున్నారు అని కాస్తయినా నామోషీగా ఫీల్ కావడం లేదు. ఎవరు చూస్తే మాకేంటి మాకు కావాల్సింది మాకు దొరికితే చాలు అని అనుకుంటున్నారు నేటి రోజుల్లో చాలా మంది యువత. దీంతో పబ్లిక్ పార్క్ లో సైతం వెళ్లి ముద్దుల్లో మునిగి పోతున్నారు. ఇలా ఇటీవల కాలంలో యువత రెచ్చిపోతున్న తీరు సభ్య సమాజంలో ఉన్న జనాలకి ఇబ్బంది కలిగిస్తుంది.
ఇలాంటి ఘటనలు కేవలం సినిమాల్లోనే చూస్తాం. సాధారణంగా ప్రేమికులు పార్క్ లోకి వెళ్లి ముద్దుల్లో మునిగి తేలుతారు అన్న విషయం తెలుసు. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా సినిమాల్లో లాగానే యువకుడు బైక్ నడుపుతూ ఉంటే యువతి ముందు నుంచి అతని హత్తుకుని కూర్చుంటుంది అంతే కాదు
యువకుడికి లిప్లాక్ ఇస్తుంది. ఇలా ఒకరిని ఒకరు గట్టిగా హత్తుకుని రోడ్డుపై రైడ్ చేశారు. ఇక రోడ్డు పై వచ్చే లారీలు బస్సులు తమకేమీ పట్టనట్లుగా రోడ్డుపై దూసుకెళ్లారు. నడిరోడ్డుపై రొమాన్స్ కు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది..
Romance on Bike India Latest News, Viral News Telugu, Trending News Telugu
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.