ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
రసాది దోషాలు వలన ఏయే వ్యాధులు కలుగును – Types of Dosha in Human Body
Types of Dosha in Human Body: “దోషం” అనేది శరీరంలో అసమతుల్యతకు సంకేతం: ఈ దోషాలు “వాత”, “పిత్త”, మరియు “కఫ” అని మూడు రకాలు.
వాత దోషం:
- స్థానాలు: కీళ్లు, ఎముకలు, నరాల వ్యవస్థ, చర్మం.
- వ్యాధులు: ఆర్థరైటిస్, నాడీ సంబంధ సమస్యలు, చర్మ రుగ్మతలు, ముసలితనానికి సంబంధించిన లక్షణాలు.
పిత్త దోషం:
- స్థానాలు: జీర్ణ వ్యవస్థ, గుండె, గర్భాశయం, కంట్రోలు.
- వ్యాధులు: జీర్ణ సమస్యలు, మానసిక అసమతుల్యత, చర్మ సంబంధ వ్యాధులు (మంటలు, గీతలు), గుండె సంబంధ సమస్యలు.
కఫ దోషం:
- స్థానాలు: ఊపిరితిత్తులు, లివర్, ఊపిరి వ్యవస్థ, శరీర ద్రావకాలు.
- వ్యాధులు: శరీర బరువు అధికం, ఊపిరితిత్తుల సమస్యలు, శీతలపుట్టలు, మాంద్యం.\
శరీరంలో రసాది దోషాలు వలన ఏయే స్థానాలలో ఏయే వ్యాధులు కలుగునో సంపూర్ణ వివరణ:
రసం దోషం పొందిన కలుగు వ్యాధులు: అన్నం మీద ఇష్టం లేకపోవుట, రుచి తెలియకపోవటం, ఆహారం జీర్ణం కాకపోవడం, శరీరం నొప్పులు, జ్వరం, గుండెపీకుట, వాంతి వచ్చునట్లు ఉండటం, ఆహారం తినకపోయినను తినినట్లు ఉండటం, శరీరం బరువు, హృదయ సంబంధ వ్యాధులు, పాండురోగం, శరీరం కృశించటం, అవయవములు కృశించుట, అకాలంలో శరీరం ముడుతలు పడుట, అకాలం నందు జుట్టు నెరియుట వంటి వ్యాధులు కలుగును.
రక్తం దోషం పొందుట వలన కలుగు వ్యాధులు: కుష్టు, విసర్ప, పిడక,మశక,నీలిక, తిలకాలకా, నశ్చ, వ్యంగ అను చర్మవ్యాధులు, పేనుకొరుకుడు, ప్లీహ సంబంధ సమాస్యలు, విర్రది అను వ్రణం, గుల్మవాతం, శోణిత, క్యాన్సర్, రక్తపిత్తం వంటి వ్యాధులు సంభంవించును.
మాంసం దోషం పొందుట వలన కలుగు వ్యాధులు: ఆసనము, నోరు, నాలిక పుండ్లు పడుట, మాంసం వృద్ధినొందుట, క్యాన్సర్ కణుతులు, మొలలు, కొండనాలుక వాచుట, ఇగుళ్ళు నొప్పులు, గలగండిక (టాన్సిల్స్), పెదవులు పుండ్లు పడుట, గొంతు చుట్టూ కణుతులు వచ్చుట, గొంతు వాచుట మొదలైన వ్యాధులు సంభంవించును.
మేథస్సు అనగా కొవ్వు దోషం పొందుట వలన కలుగు వ్యాధులు: శరీరంపై గ్రంథులు లేచుట, అండవృద్ధి, గొంతు వ్రణాలు, క్యాన్సర్, మధుమేహం, శరీరం లావెక్కుట, అధికమైన చెమట మొదలయిన రోగాలు సంభంవించును.
ఎముకలు దోషం పొందుట వలన కలుగు వ్యాధులు: ఎముకపై ఎముక పెరుగుట, దంతముల పై దంతము పెరుగుట, ఎముకలపై సూదులతో పొడిచినట్లు అగుట, పిప్పిగొళ్ళు మొలుచుట మెదలైనవి ఎముకలలో దోషం పొందుట వలన కలుగు వ్యాధులు .
మజ్జ దోషం పొందుట వలన కలుగు వ్యాధులు: అజ్ఞానము కలుగుట, మూర్చ వచ్చుట, శరీరం తిరిగినట్లు అనిపించటం, జాయింట్లలో వాపులు, బాధ కలుగుట, కళ్ళకలక మొదలైనవి శరీరంలో మజ్జ దోషం పొందుట వలన కలుగు వ్యాధులు.
శుక్రం దోషం పొందుట వలన కలుగు వ్యాధులు: నపుంసకత్వం,సంతోషం లేకపోవటం, రోగంతో ఉన్న నపుంసకునకు అల్ప ఆయుర్దాయం, వికృత రూపం కలిగిన సంతానం కలుగుట, గర్భస్రావం మెదలైనవి శరీరంలో శుక్రం దోషం పొందుట వలన కలుగును.
మలము దొషం పొందట వలన కలుగు వ్యాధులు: మలము వెలువరించుటకు అవరోధం కలుగుట, లేదా అధికంగా వెలువడుట, సకాలంలో విరేచనం అవ్వకపోవుట, కడుపులో వికారాలు, చర్మవ్యాదులు సంభవించుట జరుగును.
పైన చెప్పిన విధముగా ఆయా శరీరంలోని ముఖ్య భాగాలకు దోషాలు సంభవించినప్పుడు అయా వ్యాధులు కలుగును.
కాళహస్తి వెంకటేశ్వరరావు(అనువంశిక ఆయుర్వేదం)
Telugu Health Tips – ఉప్పు ఎక్కువుగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు మరియు నివారణా మార్గాలు
Ayurvedic dosha types
3 ayurvedic doshas
What is dosha in ayurveda
Understanding ayurvedic doshas
Ayurvedic body types
Health Tips in Telugu – సర్వరోగ నివారిణి
Vata dosha characteristics
Pitta dosha personality
Kapha dosha symptoms
How to balance doshas
Ayurvedic quiz for dosha
20 Tips for a Happy and Healthy Life – ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉండడానికి 20 చిట్కాలు
Best diet for vata dosha
Yoga for pitta dosha pacification
Natural remedies for kapha imbalance
How to determine your dosha type
Ayurvedic dosha quiz free
కాఫీ,టీ తాగే ముందు నీళ్లు తాగకపోతే ఎంత ప్రమాదమో చూడండి-Health Tips in Telugu
Ayurvedic medicine and doshas
Dosha and chakras
Significance of doshas in health
Ayurvedic lifestyle for each dosha
Can dosha change over time
ఈ పదార్థాలు తింటే జుట్టు రాలడం ఖాయం – Health Benefits
కాలేయానికి అద్భుత ఔషధం గుమ్మడికాయ – Health Benefits
ఎక్కువుగా ఆవలింతలు రావడానికి గల కారణాలు.