ఇదే జీవిత పరమార్ధం – మోరల్ స్టోరీస్ – Moral Stories in Telugu
“విస్తరాకును” ఎంతో శుభ్రంగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకుని ‘భోజనానికి‘ కూర్చుంటాము. భోజనము తినేవరకు “విస్తరికి మట్టి” అంటకుండా జాగ్రత్త వహిస్తాము. తిన్న మరుక్షణం విస్తరిని మడిచి ‘దూరంగా’ పడేస్తాం.

“మనిషి జీవితం” కూడా అంతే ఊపిరి పోగానే “ఊరి బయట” పారేసి వస్తాము. ‘విస్తరాకు’ పారేసినప్పుడు సంతోషపడుతుంది. ఎందుకంటే ‘పొయేముందు ఒకరి ఆకలిని’ తీర్చటానికి తను ఉపయోగపడ్డానులే అన్న ‘తృప్తి’ ఆకుకు ఉంటుంది.
‘విస్తరాకుకు’ ఉన్న ఆలోచన భగవంతుడు “మనుషులకు” కూడా ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ.. ‘సేవ’ చేసే అవకాశము వచ్చినపుడు మీరు అందరూ ‘సేవ’ చేయండి. మళ్లీ ఎప్పుడైనా చేయవచ్చులే అనుకొని “వాయిదా” వేయకండి. ఆ అవకాశము మళ్లీ వస్తుందని అనుకుంటే ‘కుండ’ ఎప్పుడైనా పగిలిపోవచ్చు. అప్పుడు ‘విస్తరాకుకు’ ఉన్న ‘తృప్తి’ కూడా మనకి ఉండదు..
ఎంత ‘సంపాదించి’ ఏమి లాభం? ‘ఒక్కపైసా’ కూడా తీసుకుపోగలమా? కనీసం ‘మన ఒంటిమీద బట్ట’ కూడా మిగలనివ్వరు.. అందుకే ‘ఊపిరి’ ఉన్నంత వరకు “నలుగురికి” ఉపయోగపడే విధంగా ‘జీవించండి’..
కళ్ళు తెరిపించే కథ – మీడియా, సోషల్ మీడియా – Reality Stories in Telugu
భగవద్గీత చెప్పే జీవిత పాఠాలు – Life Lessons from Bhagavad Gita – Lord Krishna
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com