అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
భగవద్గీత చెప్పే జీవిత పాఠాలు – Life Lessons from Bhagavad Gita – Lord Krishna
అద్భుతమైన హిందూ మత గ్రంథం భగవద్గీత. అందులో ఒక మనిషి పుట్టుక నుంచి మరణం వరకు అంతా వివరణాత్మకంగా ఉంటుంది. ఆధునిక కాలంలో భగవద్గీత మనకేమి బోధిస్తుంది? అనుకుంటారు ఎంతోమంది. ఆధునిక కాలంలో వచ్చిన మార్పులు గురించి ఏనాడో రాసిన భగవద్గీతలో ఏముంటుందని కూడా అంటారు. నిజానికి భగవద్గీతలో ఒక మనిషి గురించి, అతని వ్యక్తిత్వం గురించి, ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో వంటి అంశాలన్నీ వివరణాత్మకంగా ఉన్నాయి.
“అందమైన శ్రీ కృష్ణుడి విగ్రహం“

ఈ ప్రాచీన జ్ఞాన గ్రంథం నేటి జీవితానికి చాలా ముఖ్యమైనది. భగవద్గీత బోధనలు మనలో సానుకూలతను పెంచుతాయి. జీవితంపై ఆశను పెంచుతాయి. భగవద్గీత నుండి మనము తెలుసుకోవాల్సిన విషయాలు జీవితాన్ని సరైన మార్గంలో ఉంచడానికి ఉపయోగపడే పాఠాలు.
“అందరూ తప్పక చదవాల్సిన మహాగ్రంధం ఈ భగవద్గీత“
గతాన్ని మరిచిపోండి
భగవద్గీత ప్రకారం ఈ విషయాన్ని గురించి ఆందోళన చెందకండి. ఉన్నంతలో సంతోషంగా ఉండండి. జీవితం మీకు ఏది ఇచ్చిందో దాన్ని స్వీకరించి ప్రశాంతంగా జీవించేందుకు ప్రయత్నించండి. సమస్యలు వస్తే అధిగమించండి. కానీ ఆందోళన చెందకండి. ఉద్యోగం మీరు అనుకున్న ప్రకారం రాకపోయినా, ఆశించిన ప్రకారం ఏ పనీ విజయవంతం కాకపోయినా… నిరాశ చెందకండి. ప్రతిదీ ఒక కారణం ప్రకారమే జరుగుతుందని నమ్మండి.
మీరు గతాన్ని నియంత్రించలేరు. భవిష్యత్తును నియంత్రించలేరు. మీ దగ్గర ఉన్నది వర్తమానం మాత్రమే, కాబట్టి ఈ వర్తమానాన్ని పూర్తిస్థాయిలో జీవించడానికి ప్రయత్నించండి. భవిష్యత్తు గురించి ఆందోళన, ఒత్తిడిని పెంచుతుంది. గతం గురించి ఆలోచిస్తే బాధే మిగులుతుంది. ఆ రెండింటి కోసం నేటి వర్తమానాన్ని కూడా నాశనం చేసుకోకండి.
మార్పుకు సిద్ధం కండి
జీవితంలో స్థిరంగా ఉండే ఏకైక విషయం మార్పు. మార్పుకు అందరు సిద్ధంగా ఉండాలి. నేటి ధనవంతులు రేపటికి పేదవారు కావచ్చు, నేటి పేదవారు రేపు కోటీశ్వరులు కావచ్చు. కీర్తి, అదృష్టం రెండూ కొంతమందికి పోవచ్చు. మరికొందరికి ఊహించని విధంగా విపరీతమైన పేరు ప్రఖ్యాతలు రావచ్చు.
ఋతువులు మారడం ఎంత సహజమో మార్పు కూడా అంతే సహజం. పగలు రాత్రిగా మారినట్టు ప్రతి మనిషి జీవితంలో మార్పు ఏదో రకంగా వస్తూనే ఉంటుంది. ఆ మార్పుకు మీరు సిద్ధంగా ఉండాలి. కొన్ని మార్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అయినా సరే వాటిని సానుకూలంగా తీసుకొని జీవితంలో ముందుకే సాగాలి.
మీ ఆలోచనల రూపమే మీ జీవితం. కాబట్టి మిమ్మల్ని విచ్ఛిన్నం చేసే ఆలోచనలను రానివ్వకండి.
“అందమైన రాధాకృష్ణుల విగ్రహం“
గీతలో శ్రీకృష్ణడు ఉపదేశం – నీకు సమస్య వచ్చినప్పుడు ఈ ముగ్గురు వ్యక్తులను గమనించు
వినాయకుని జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు