ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Telugu Short Stories
అడవిలో చెట్లకింద కొందరు స్నేహితులు మందు పార్టీ చేసుకుంటున్నారు. అకాస్మాత్తుగా కుండపోతగా పెద్ద వర్షం కురవడం మొదలైంది. యువకులు ఇద్దరు వర్షంలో 10 ని.లపాటు పరుగెత్తి కారును చేరుకున్నారు. ఒక్క ఉదాటున కారులోకి దూకి స్టార్ట్ చేసి పరిగెత్తించారు, హాయిగా నవ్వుకుంటూ, చేతుల్లోని సీసాల్లోని మందు గుటకలు వేస్తూ. కిటికీ అద్దం మీద ఎవరో చేత్తో తడుతూ కనిపించారు .
“ఇక్కడ చూడు ! ఎవరో ముసలోడు.. దయ్యమేమో..!!” ఇంకా కిటికీ అద్దం మీద తడుతూనే ఉన్నాడు. “తలుపు కొద్దిగా తీసి చూడు!” డ్రైవర్ సీటులో వ్యక్తి అన్నాడు. అద్దాన్ని దించి, “ఏం కావాలి!!” భయపడుతూ అడిగాడు. బయట ఉన్న ముసలాయన, “ఒక సిగరెట్ ఇస్తారా?” “త్వరగా ఇచ్చేయ్…..” చేతులు వణుకుతుంటే పాకెట్ లోని ఒక సిగరెట్ తీసి ఇచ్చి, “పోనీయ్ త్వరగా!” అన్నాడు స్నేహితుడితో..
80 కిమీ. వేగం మీటరు చూపిస్తోంది. “అతనెవరై ఉంటాడు!” ప్రశ్నించాడు ఒక స్నేహితుడు. “నాకేం తెలుసు చాలా వేగంగా వెళ్తున్నాం కదా!!” అంతలో మళ్ళీ ముసలాయన కిటికీ తడుతూ కనిపించాడు. డ్రైవర్ సీటులో వ్యక్తి,” ఏం కావాలో అడుగు!!” విసుగ్గా అన్నాడు. ముసలాయన తెరిచిన కిటికీ దగ్గర చెయ్యి పెట్టి ” అగ్గిపెట్టె !” లైటర్ విసిరేసి, “పోనీ త్వరగా” గట్టిగా భయంతో అరిచాడు.
ఇప్పుడు 100కిమీ. వేగం చూపిస్తోంది కారు మీటరు. మందు సీసాలు ఖాళీ చేస్తున్నారు. మళ్ళీ కిటికీ తడుతూ కనిపించాడు ముసలోడు. దేవుడా! ఈ ముసలోడు వదిలేట్లు లేడు ఇంత వేగంగా పోతున్నా !! కిటికీ దించి చూస్తే, ముసలాయన అడుగుతున్నాడు, ” బురదలో చిక్కుకున్న కారు తీయడానికి సహాయం కావాలా!!”
సేకరణ – V V S Prasad
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి.
Telugu Short Stories