Menu Close

గోత్రం వెనుక ఇంత సైన్స్ వుందా, అందుకనే స్వగోత్రీకుల మధ్య వివాహం నిషేధించారు, Gothram Ante Emiti.?

Gothram Ante Emiti ..?

మనం తీసి పడేస్తున్న చాలా నమ్మకాలు, విశ్వాసాల వెనుక తప్పకుండా ఏదో ఒక శాస్త్రీయ కారణం వుందని ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి, అసలు హిందూ సంస్కృతి అంటేనే ఒక జీవన విదానం, మన పూర్వీకులు కొన్ని వేల సంవత్సరాలు అవగాహన చేసుకున్న విషయాలను ఒక పద్ధతిగా మలిచి మనిషికి అలవాటు చేశారు. అలానే ఆ తరువాత తరాలు కూడా వాటిని పాటించే విదంగా ఏర్పాటు చేశారు..

గోత్రం అంటేనే అద్భుతమైన శాస్త్రీయం (సైన్సు), శాస్త్రీయత (సైన్సు) ప్రకారము మన పూర్వీకులు గోత్ర విధానాన్ని ఎలా ఏర్పాటు చేశారో గమనించండి.

మీరు పూజలో కూర్చున్న ప్రతిసారీ, పూజారి మీ గోత్రం గురించి ఎందుకు అడుగుతారో మీకు తెలుసా?

మీకు తెలీదు కాబట్టి అది చాదస్తం అనుకుంటున్నారు?
గోత్రం వెనుక ఉన్న శాస్త్రం మరేమిటో కాదు.

జీన్-మ్యాపింగ్ అని ఈమధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన అధునాతన శాస్త్రమే!

గోత్రం వ్యవస్థ అంటే ఏమిటి ?
మనకు ఈ వ్యవస్థ ఎందుకు ఉంది?
వివాహాలకు ఇది చాలా ముఖ్యమైనదిగా మనము ఎందుకు భావిస్తాము?
కొడుకులకు ఈ గోత్రం ఎందుకు వారసత్వంగా వస్తుంది మరి కుమార్తెలు ఎందుకు రాదు?
వివాహం తర్వాత కుమార్తె గోత్రం ఎలా/ఎందుకు మారాలి?
తర్కం ఏమిటి?

ఇది మనము అనుసరించే అద్భుతమైన జన్యు శాస్త్రం. మన గోత్ర వ్యవస్థ వెనుక జన్యుశాస్త్ర వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూద్దాం!

గోత్రమ్ అనే పదం రెండు సంస్కృత పదాల నుండి ఏర్పడింది. మొదటి పదం ‘గౌ’- అంటే ఆవు, రెండవ పదం ‘త్రాహి’ అంటే కొట్టం. గోత్రం అంటే ‘గోశాల’ అని అర్ధం. జీవశాస్త్రపరంగా, మానవ శరీరంలో 23 జతల క్రోమోజోములు ఉన్నాయి, వీటిల్లో సెక్స్ క్రోమోజోములు (తండ్రి నుండి ఒకటి మరియు తల్లి నుండి ఒకటి) అని పిలువబడే ఒక జత ఉంది.

ఇది వ్యక్తి(ఫలిత కణం) యొక్క లింగాన్ని (gender) నిర్ణయిస్తుంది.

గర్భధారణ సమయంలో ఫలిత కణం XX క్రోమోజోములు అయితే అమ్మాయి అవుతుంది, అదే XY అయితే అబ్బాయి అవుతాడు.
XY లో – X తల్లి నుండి మరియు Y తండ్రి నుండి తీసుకుంటుంది. ఈ Y ప్రత్యేకమైనది మరియు అది X లో కలవదు.

కాబట్టి XY లో, Y X ని అణచివేస్తుంది, అందుకే కొడుకు Y క్రోమోజోమ్‌లను పొందుతాడు.
ఇది మగ వంశం మధ్య మాత్రమే వెళుతుంది. (తండ్రి నుండి కొడుకు మరియు మనవడు, ముని మనవడు, అలా.)

మహిళలు ఎప్పటికీ Y ను పొందరు. అందువల్ల వంశవృక్షాన్ని గుర్తించడంలో జన్యుశాస్త్రంలో Y కీలక పాత్ర పోషిస్తుంది. స్త్రీలు ఎప్పటికీ Y ను పొందరు కాబట్టి స్త్రీ గోత్రం తన భర్తకు చెందినది అవుతుంది. అలా తన కూతురి గోత్రం వివాహం తరువాత మార్పు చెందుతుంది. ఒకే గోత్రీకుల మధ్య వివాహాలు జన్యుపరమైన రుగ్మతలను కలిగించే ప్రమాదాన్ని పెంచుతాయి.

గోత్రం ప్రకారం సంక్రమించిన Y క్రోమోజోమ్‌లు ఒకటిగా ఉండకూడదు ఎందుకంటే అది లోపభూయిష్టమైన ఫలిత కణాలను సక్రియం చేస్తుంది.
ఇదే కొనసాగితే, ఇది పురుషుల సృష్టికి కీలకమైన Y క్రోమోజోమ్ పరమాణం మరియు బలాన్ని తగ్గిస్తుంది. కొన్ని సందర్భాలలో నశింపజేస్తాయి.

ఈ ప్రపంచంలో Y క్రోమోజోమ్ లేనట్లయితే, మగజాతే అంతరించిపోయేలా చేస్తుంది. కాబట్టి గోత్రవ్యవస్థ జన్యుపరమైన లోపాలను నివారించడానికి మరియు Y క్రోమోజోమ్‌ను రక్షించడానికి ప్రయత్నించే ఒక పద్ధతే స్వగోత్రం. అందుకనే స్వగోత్రీకుల మధ్య వివాహం నిషేధించారు.

మన ఋషులు వేలాది సంవత్సరాల క్రితమే ” జీన్ మ్యాప్పింగ్ ” క్రమబద్ధీకరించారు.

అందుకనే ఈసారి ఎవరైనా గోత్రమని అంటే చాదస్తం అని కొట్టి పడేయకండి.

Like and Share
+1
3
+1
0
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks