అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Telugu Moral Stories
ఒకానొకప్పుడు ఒక ఊళ్ళో ఒక కొత్త వ్యక్తి కనిపించి ఒక్కొక్క కోతికి 10 వేల రూపాయలు ఇచ్చి కొనుక్కుంటానని అన్నాడు ఊళ్ళో, ప్రక్కనే ఉన్న అడవిలో చాలా కోతులు ఉన్నాయి. ఊరి జనం ఎగబడి కోతులను పట్టుకొచ్చి డబ్బులు తీసుకుని పోయారు. అమ్మకానికి వచ్చే కోతుల సంఖ్య తగ్గడంతో కోతులు కొనే వ్యక్తి, కోతికి 20 వేల రూపాయలు పెంచాడు.
గ్రామీణులు కోతుల వెంటపడి పట్టుకొచ్చి సొమ్ము చేసుకున్నారు. కోతుల సంఖ్య ఇంకా పడిపోయింది. ఇప్పుడా వ్యక్తి కోతి ధరను 25 వేలకు పెంచాడు. ఇంకా ఆశ చావక గ్రామీణులు కోతులను పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఇంక కోతులు లేకపోవడంతో కోతులు కొనే వ్యక్తి, కోతి ధర 50 వేలు చేసాడు.
అతనికి ఏదో పని పడి పట్టణానికి వెళ్తూ, అతని సహాయకుడికి పని అప్పగించాడు. ఇంక కోతులు అమ్మకానికి రాకపోయే సరికి సహాయకుడు ఒక సూచన చేసాడు, ” ఇక్కడ చూసారా ఎన్ని కోతులు ఉన్నాయో, వీటిని ఒక్కొక్కటి 35 వేలకు ఇస్తాను, 50 వేలకు మా యజమానికి అమ్ముకోండి.
గ్రామీణులు తాము కూడబెట్టుకున్న డబ్బంతా పోసి కోతులను కొనుక్కున్నారు. కోతులను గ్రామీణులకు అమ్మి, ‘యజమాని వస్తాడు. కోతులను అమ్ముకోండి.’ అని మాయమై పోయాడు. ఎన్నాళ్ళు ఎదురు చూసినా కోతులు కొనే వ్యక్తి రాలేదు, సేవకుడు లేడు. ఎవ్వరూ లేరు. ఊరంతా కోతులే కోతులు.
అమాయకంగా అత్యాశకు పోయి డబ్బు, బంగారం పోగొట్టుకుంటుంటారు చాలా మంది.
సేకరణ – V V S Prasad