Menu Close

ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది – Telugu Moral Stories

Telugu Moral Stories

సృజన్, శ్రామిక్ మంచి స్నేహితులు, పైగా నిరుద్యోగులు కూడా! ఊరి బయట చెట్టుకింద రోజుల తరబడి ఏం చేయాలా అని ఆలోచిస్తూ కూర్చునేవాళ్ళు. ఆ ఊరి స్త్రీలు దూరంగా ఉన్న చెరువు నుండి కష్టపడి కుండల్లో నీళ్ళు మోసుకొచ్చేవాళ్ళు. స్నేహితులిద్దరికీ ఒక ఉపాయం తట్టింది. ఊళ్ళో వాళ్ళకు కుండకో పావలా చొప్పున ఇస్తే ప్రతిరోజూ నీళ్లు పోస్తామని చెప్పారు, ప్రజలకు ఈ పద్ధతి నచ్చింది.

అలా వాళ్ళు రోజూ నీళ్లు పోసి నాలుగు డబ్బులు సంపాదించుకొనేవాళ్ళు. సృజన్ కు దీని కంటే మెరుగైన పద్ధతి కనుక్కోవాలనే కోరిక పుట్టింది. ఒక రోజు పక్క ఊళ్ళో కుమ్మరి పొడవు మూతి ఉండే కూజాలు తయారు చేయడం చూసాడు. ఒక పొడవైన మట్టి గొట్టం చెరువు నుండి ఊరికి వేస్తే ‘ఈ నీళ్లు మోసే పని తప్పుతుంది కదా’ అని శ్రామిక్ తో చర్చించాడు.

అయితే శ్రామిక్ కు నచ్చలేదు, చాలా కష్టమైన పని అని, అసాధ్యం అని వెయ్యి కారణాలు చెప్పాడు. కానీ సృజన్ కృత నిశ్చయంతో చెరువు నుండి ఊరికి గొట్టం తయారు చేసే పని మొదలు పెట్టాడు. గొట్టం విరిగి పోవడం వంటి ఎన్నెన్నో సమస్యలు, అన్నింటినీ ఎదుర్కొని కష్టపడి పైప్ లైన్ తయారు చేసాడు. ఇప్పుడు పైపు నుండి ఊళ్ళోకి నీళ్లు ప్రవహిస్తున్నాయి.

కుండకు 10 పైసలు. రోజూ పుష్కలంగా నీరు ఇంటింటికీ అందుతున్నాయి. శ్రామిక్ వద్ద పావలాకు నీళ్లు కొనే వాళ్ళు లేరు.

అపజయానికి భయపడకూడదు, ప్రయత్నలోపానికి భయం పడాలి. మీరేం చెయ్యకపోతే ఏమీ దక్కదు మీకు. కొత్తగా ఆలోచించండి. కొత్తగా చెయ్యండి. ‘ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది కదా!”

సేకరణ – V V S Prasad

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి.

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks