Telugu Moral Stories
ఒక ఖరీదైన దుస్తులు ధరించిన, అందమైన స్త్రీ సైకియాట్రిస్ట్ (మానసిక వ్యాధి నిపుణులు)దగ్గరికి వెళ్లి, ‘జీవితమంతా నిరాసక్తంగా, అర్థరహితంగా ఉందని వాపోయింది. ఆఫీస్ శుభ్రపరిచే రాధమ్మను పిలిపించాడు. “రాధమ్మ జీవితంలో ఆనందాన్ని, సుఖసంతోషాలను, ఎలా పొందిందో చూడండి చాలు.” అన్నాడు ఆ స్త్రీతో. రాధమ్మ కూర్చుని, “నా భర్త మలేరియాతో చనిపోయాడు.
ఆ తర్వాత నా కొడుకు కొన్నాళ్ళకు యాక్సిడెంట్ లో పోయాడు. నేను ఒంటరినై పోయాను. నిద్ర పట్టేది కాదు. ఒక రోజు ఇంటికి వెళ్తుంటే ఒక పిల్లి పిల్ల ‘మ్యావ్ మ్యావ్’ అంటూ వెంట పడింది. దాన్ని చూస్తే జాలేసి, పిల్లి పిల్లను ఇంట్లోకి రానిచ్చాను.
కొంచెం పాలు దానికి ఒక ప్లేట్లో పోస్తే శుభ్రంగా నాకేసి, నా కాళ్ళను నాకుతూ కూర్చుంది. చాలా నెలల తర్వాత దాన్ని చూసి నవ్వొచ్చింది. అప్పుడు తెలిసింది. ఒక పిల్లిపిల్లకు చిన్న సహాయం చేస్తేనే మొదటిసారిగా నవ్వొచ్చింది, అదే తోటివారికి సహాయం చేస్తే ఇంకా ఆనందంగా ఉండొచ్చు కదా! తర్వాతి రోజు రెండు రొట్టెలు, జబ్బుతో ఉన్న పక్కింటి పెద్దాయనకు ఇచ్చాను.
అప్పటినుండి ప్రతిరోజూ ఎవరో ఒకరికి ఏదో ఒక సాయం చేసేదాన్ని. అది నాకు మరింత ఆనందం ఇచ్చేది. ఈ రోజు నాకు తెలీదు! నాలాగా కడుపారా తిని, సుఖంగా నిద్రపోతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని! ఇతరులకి ఏమైనా ఇవ్వడంలోనే ఆనందం ఉందని తెలిసింది.” ఈ మాటలు విన్న ధనిక స్త్రీకి దుఃఖం ఆగలేదు. డబ్బుతో కొనగలిగినవన్నీ ఆమె దగ్గర ఉన్నాయి. డబ్బుతో కొనలేనివి ఆమె కోల్పో యింది.
జీవితం అందంగా సాగాలంటే, నీ వల్ల ఇతరులు ఎంత ఆనందం పొందుతున్నారని అనేది ముఖ్యం.
సేకరణ – V V S Prasad
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి.
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.