ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Telugu Moral Stories
ఒక అడవిలో టోపీలు అమ్మేవాడొకడు అలిసిపోయి ఒక చెట్టు కింద తన టోపీల బుట్ట పక్కనే పెట్టుకొని నిద్రపోయాడు. చెట్టు మీద ఉన్న కోతులు దిగి, బుట్టలో ఉన్న టోపీలను తీసుకుని తలా ఒకటి పెట్టుకున్నాయి. కోతుల కిచకిచలకు టోపీలవాడు నిద్ర లేచి చూస్తే బుట్ట ఖాళీ. తలపైకెత్తి చూస్తే కోతులన్నీ టోపీలు పెట్టుకుని ఉన్నాయి.
కోపం వచ్చి తన తలమీది టోపీ విసిరి నేలకేసి కొట్టాడు. కోతులు కూడా టోపీలు నేలకేసి కొట్టాయి. తన ఊహ ఫలించినందుకు ఆనందించి టోపీలన్నిటినీ బుట్టలో పెట్టుకొని వెళ్లిపోయాడు. ఇది పాత కథే కదా! ఇది జరిగిన 50 ఏళ్లకు అతని మనవడు కూడా టోపీలు అమ్ముకుంటూ అనుకోకుండా అదే చెట్టు కింద సేద తీరడానికి, బుట్ట పక్కనపెట్టి నిద్రపోయాడు.
అతను లేచి చూసే సరికి టోపీలన్నీ మాయం. ఆ చెట్టు పైన ఉన్న కోతులన్నీ టోపీలు పెట్టుకుని కూర్చుని ఉన్నాయి. మనవడికి తాత చెప్పిన కథ గుర్తొచ్చింది. అతను తల గోక్కున్నాడు. కోతులు కూడా గోక్కున్నాయి. తన తలమీది టోపీ విసిరి నేలకేసి కొట్టాడు. ఒక్క కోతి కూడా టోపీ తీయలేదు. ఓ పిల్లకోతి కిందికి దూకి, ఆ టోపీ కూడా తీసుకుని, మనవడి చెంపమీద లాగి ఒకటిచ్చి “ఏం !! నీ ఒక్కడికే తాతయ్య ఉన్నాడనుకున్నావా” అని చెట్టెక్కేసింది.
ఎప్పుడూ ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు. సులువుగా ఎదుర్కోవచ్చని అనుకోకు, ప్రత్యర్థి బలహీనుడనో, అవివేకి అనో భావించకూడదు.
సేకరణ – V V S Prasad