ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Telugu Moral Stories
ఒక రైతు దగ్గర ఒక కుక్క ఉండేది. అది రోడ్డు మీద పోయే ప్రతి బండి వెనక మొరుగుతూ వెంబడించి దాన్ని దాటి ముందుకు వెళ్ళాలని శక్తి కొద్దీ పరుగెత్తేది. ఒక రోజు ఆ రైతు స్నేహితుడొకరు, “మీ కుక్క ఎప్పటికైనా ఆ వేగంగా వెళ్లే కార్లు, లారీలను దాటి ముందుకు వెళ్ళగలుగుతుందా !!”
“అది దాటి పోగలదో, లేదో చెప్పలేను కానీ, ఏదైనా ఒక బండిని దాటి పోయిన తరవాత అది ఏం చేస్తుంది, అన్నదే నా సందేహం !!!” అన్నాడు రైతు.
సేకరణ – V V S Prasad
చాలా మంది తమ జీవితాల్లో కూడా ఆ కుక్క మాదిరే అర్థం పర్థం లేని లక్ష్యాల వెంబడి నిరర్ధకంగా పరుగెత్తుతుంటారు. జూదం వంటి వ్యసనాల వెంబడి నిరంతరం పరిగెత్తే వాళ్ళు కూడా అటువంటి వాళ్ళే. జీవితాన్నే జూదంగా మార్చుకొనే వాళ్ళు మరి కొందరు.