ఎందరో మహానుభావులు ధ్యాన సమయంలో పిల్లిని కట్టేయడం వెనక ఉన్న ఆధ్యాత్మికత గురించి గొప్పగా గ్రంథాలు రాసారు-Telugu Moral Stories - Telugu Bucket
Menu Close

ఎందరో మహానుభావులు ధ్యాన సమయంలో పిల్లిని కట్టేయడం వెనక ఉన్న ఆధ్యాత్మికత గురించి గొప్పగా గ్రంథాలు రాసారు-Telugu Moral Stories

Telugu Moral Stories

ఒక ఆశ్రమంలో గురువు గారు, ఆయన శిష్యులు ప్రతిరోజూ సాయంత్రం పూట ధ్యానం చేసుకుంటూ ఉంటారు. అదే సమయానికి ఒక పిల్లి వచ్చి నానా అల్లరి చేస్తూ ఉండేది. దాని గోల వల్ల ధ్యానానికి భంగం కలిగేది. గురువు గారు దాని అల్లరి భరించలేక ఎక్కడైనా కట్టేయమన్నాడు. ఆనాటి నుండి ధ్యానం సమయంలో పిల్లిని కట్టేయడం ఆనవాయితీగా మారింది.

కొన్నాళ్ళకు గురువు గారు పరమపదించారు. ఆ పిల్లి చనిపోయింది. కాని ప్రతి రోజూ ధ్యానం చేసే సమయానికి ఒక పిల్లిని కట్టేస్తూనే ఉన్నారు. వందలు, వేలు సంవత్సరాలు గడిచిపోయాయి అయినా ఆశ్రమాల్లో పిల్లిని కట్టేస్తూనే ఉన్నారు. ఎందరో మహానుభావులు ధ్యాన సమయంలో పిల్లిని కట్టేయడం వెనక ఉన్న ఆధ్యాత్మికత గురించి గొప్పగా గ్రంథాలు రాసారు.

ప్రజలు తామేం చేస్తున్నారనే విషయం గురించి ఆలోచించరు. ప్రతి ఒక్కరూ అలాగే చేస్తున్నారు కాబట్టి అందరూ అలాగే చేస్తారు. మనలో చాలామంది మన జీవితాలను కూడా అలాగే గడిపేస్తాం. మనం కూడా చాలా పనులు వాటి ప్రాధాన్యత గానీ, అర్థం కానీ తెలుసుకోకుండా చేసేస్తుంటాం. మనలోని అసందర్భపు
అలవాట్లకు, ఆలోచనలకు, కోరికలకు పిల్లి ప్రతీక అనుకుందాం. ఆ కోరికలను కట్టడి చేయడానికే పిల్లిని కట్టేయడం అన్న విషయాన్ని మరిచి పోతాం.

సేకరణ – V V S Prasad

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి, ఇలాంటి మరిన్ని పోస్టుల కోసం సోషల్ నెట్వర్క్ లో ఫాలో అవ్వండి – @TeluguBucket

Telugu Stories, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Best Telugu Stories, Great Stories in Telugu. Telugu Real Stories, Best Stories in Telugu, Intelligent Telugu Stories, Telugu Kadhalu, Telugu Stories PDF, Telugu Stories Books, నీతి కథలు, ప్రేమ కథలు, తెలుగు కథలు, తెలుగు స్టోరీస్, పిల్లల కథలు, Inspiring Telugu Stories

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published.

Subscribe for latest updates

Loading