అర్థం పర్థం లేని లక్ష్యాల వెంబడి నిరర్ధకంగా పరుగెత్తుతుంటారు - Telugu Moral Stories - Telugu Bucket
Menu Close

అర్థం పర్థం లేని లక్ష్యాల వెంబడి నిరర్ధకంగా పరుగెత్తుతుంటారు – Telugu Moral Stories

Telugu Moral Stories

ఒక రైతు దగ్గర ఒక కుక్క ఉండేది. అది రోడ్డు మీద పోయే ప్రతి బండి వెనక మొరుగుతూ వెంబడించి దాన్ని దాటి ముందుకు వెళ్ళాలని శక్తి కొద్దీ పరుగెత్తేది. ఒక రోజు ఆ రైతు స్నేహితుడొకరు, “మీ కుక్క ఎప్పటికైనా ఆ వేగంగా వెళ్లే కార్లు, లారీలను దాటి ముందుకు వెళ్ళగలుగుతుందా !!”

“అది దాటి పోగలదో, లేదో చెప్పలేను కానీ, ఏదైనా ఒక బండిని దాటి పోయిన తరవాత అది ఏం చేస్తుంది, అన్నదే నా సందేహం !!!” అన్నాడు రైతు.

సేకరణ – V V S Prasad

చాలా మంది తమ జీవితాల్లో కూడా ఆ కుక్క మాదిరే అర్థం పర్థం లేని లక్ష్యాల వెంబడి నిరర్ధకంగా పరుగెత్తుతుంటారు. జూదం వంటి వ్యసనాల వెంబడి నిరంతరం పరిగెత్తే వాళ్ళు కూడా అటువంటి వాళ్ళే. జీవితాన్నే జూదంగా మార్చుకొనే వాళ్ళు మరి కొందరు.

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published.

Subscribe for latest updates

Loading