మీకు మీరే బాస్ - Inspiring Telugu Stories - Telugu Bucket
Menu Close

మీకు మీరే బాస్ – Inspiring Telugu Stories

Inspiring Telugu Stories

బ్రిడ్జి దాటుతున్న ఏనుగును చూసి ఒక దోమ, “లిఫ్ట్ ఇస్తావా, నీ వీపు మీద కూర్చుని ఈ వంతెన దాటే వరకూ నీకు కంపెనీ ఇస్తా” ఏనుగు మాట్లాడలేదు, ఏనుగును ఒప్పించి దానిపై కూర్చున్నానన్న దర్జాతో దోమ “జాగ్రత్త మిత్రమా!!! ఇద్దరి బరువు బ్రిడ్జి మోయలేదేమో!” ఏనుగు ఇప్పుడు కూడా ఏం మాట్లాడలేదు.

బ్రిడ్జి దాటుతుండగా ఏనుగుతో గర్వంగా చెప్పింది, “చూసావా! నీవు జాగ్రత్తగా దాటడానికి ఎంత సహకరించానో!” ఏనుగు నిశ్శబ్దంగా ఉండిపోయింది. చివరికి దోమ ఏనుగు వీపు పైనుండి ఎగిరి, “ఇది నా బిజినెస్ కార్డు, నీకేమైనా సహాయం కావాలంటే నా సెల్ నం.కు ఫోన్ చెయ్యి” ఏనుగుకు దోమ జుయ్ మన్న శబ్దం మాత్రం వినిపించింది, ఏనుగు తనదారిన తాను వెళ్లి పోయింది.

మీరు అద్భుతమైన లక్షణాలున్న ఏనుగు లాంటి వారు, మీమీద మీకు సంపూర్ణ ఆధిపత్యం ఉన్నవాళ్ళు, దోమల్లాంటి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు,
విమర్శిస్తుంటారు, అవహేళన చేస్తుంటారు. తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే మీకు మీరే బాస్, మీ ఆనందాన్ని ఎవ్వరూ హరించలేరు. ఇటువంటి వాళ్ళను
పట్టించుకోకుండా ముందుకు సాగి పోవాలి.

సేకరణ – V V S Prasad

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి, ఇలాంటి మరిన్ని పోస్టుల కోసం సోషల్ నెట్వర్క్ లో ఫాలో అవ్వండి – @TeluguBucket

Telugu Stories, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Best Telugu Stories, Great Stories in Telugu. Telugu Real Stories, Best Stories in Telugu, Intelligent Telugu Stories, Telugu Kadhalu, Telugu Stories PDF, Telugu Stories Books, నీతి కథలు, ప్రేమ కథలు, తెలుగు కథలు, తెలుగు స్టోరీస్, పిల్లల కథలు, Inspiring Telugu Stories

Like and Share
+1
1
+1
0
+1
0
+1
1
+1
0

Leave a Reply

Your email address will not be published.

Subscribe for latest updates

Loading