కృషితో నాస్తి దుర్భిక్షం - Motivational Telugu Stories - Telugu Bucket
Menu Close

కృషితో నాస్తి దుర్భిక్షం – Motivational Telugu Stories

Motivational Telugu Stories

ఆ ఊళ్ళో ఒక పెద్దమనిషికి నలుగురు కొడుకులు. ఆ నలుగురూ పరమ బద్దకస్తులు, ఇటు పుల్ల తీసి అటు పెట్టరు. ఆ వృద్ధుడు కొన్నాళ్ళకు అనారోగ్యం పాలయ్యాడు. సోమరిపోతులైన కొడుకులు ఏమైపోతారో అని ఆందోళన చెంది నలుగురినీ పిలిచి, తన దగ్గర చాలా బంగారం, నిధినిక్షేపాలు ఉన్నాయని, కానీ అవి ఎక్కడ పెట్టాడో మరిచిపోయానని, అయితే వాటిని పొలంలోనే ఎక్కడో ఒక చోట దాచిపెట్టానని చెప్పాడు.

కొడుకులు నిరాశ చెందారు. కొన్నాళ్ళకే వృద్ధుడు మరణించాడు. ఆ తర్వాత ఆ నలుగురూ పొలాన్ని తవ్వినిధి నిక్షేపాలు వెతకాలని నిశ్చయించుకొని, చాలా కష్టపడి పొలాన్ని బాగా గుల్లగా తవ్వారు. ఒక మూల లోతుగా తవ్వితే నీళ్ళు కూడా పడ్డాయి. అటు వైపుగా వెళ్తున్న ఒక వ్యక్తి బాగా తవ్విన నేలను, నీటివసతిని చూసి సరిగ్గా సాగుచేస్తే మంచి పంట పండుతుందని చెప్పాడు.

farmer

నలుగురూ ఆ పొలంలో కూరగాయలు, పూల మొక్కల వంటివి పెంచడం మొదలు పెట్టారు. కొన్ని వారాలకు మంచి దిగుబడి వచ్చింది. దాన్ని అమ్మగా లాభాలు కూడా బాగానే వచ్చాయి.

ఆ అన్నదమ్ములకు శ్రమించడమే అసలు నిధి అని అర్థమైంది. ఆనాటి నుండి సుఖంగా, సంతోషంగా జీవించడం నేర్చుకున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకున్నారు.

సేకరణ – V V S Prasad

Telugu Stories, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Best Telugu Stories, Great Stories in Telugu. Telugu Real Stories, Best Stories in Telugu, Intelligent Telugu Stories, Telugu Kadhalu, Telugu Stories PDF, Telugu Stories Books, నీతి కథలు, ప్రేమ కథలు, తెలుగు కథలు, తెలుగు స్టోరీస్, పిల్లల కథలు, Inspiring Telugu Stories

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published.

Subscribe for latest updates

Loading