కాకి అరుపులు
అది ఒక చిన్న పల్లెటూరు.అందులో నాగయ్య అనే భూస్వామి ఉండేవాడు.
వచ్చే పోయే చుట్టాలతో ఇల్లు కళ కళలాడుతుండేది.
వారి ఇంట తాతల తరాల నుండి, సిరి అనే కాకి ఉండేది. చుట్టాలు వదిలి వేసిన ఆహారం తిని, కాస్త వళ్ళు చేసింది కూడా.
పెద్ద దని ఊరిలో వున్న కాకులు,దానికి నాయకత్వ పదవి కట్ట బెట్టాయి.
ముందుగా మనం హెచ్చరిక చేస్తే, మనకూ ఒక ముక్క తగులు తుందని ఆశతో ఓ కేక వేస్తుంది.
భూస్వామి భార్య వనమ్మకు, వళ్ళు మండి ఉదయాన్నే దీనికేమీ పనిలేదని, రాయితో కొట్టింది.
ఒక కన్నుపోయి ఏడుస్తూ ఎటో వెళ్ళిపోయింది.
అది కడుపులో పెట్టుకుని, సాటి కాకులకు చెప్పి, కర్మంత్రాలకు మనం వెళ్ళి పిండం తినకూడదు. ఈ వెర్రి మొఖాలకు మనం తింటేనే వారికి ముక్తి వస్తుందని ఓ వెర్రి నమ్మకం. ఎట్టి పరిస్తితులలో ఎవ్వరూ పోకూడదని నిర్ణయం తీసుకున్నాయి.
కర్మంత్రాలు వస్తున్నాయి. పొద్దు తిరిగినా కాకులు వచ్చి పిండం తినక, విసిగి పోయిన చుట్టాలు, తొందర పనులున్నాయని, భోంచేయక కొందరు వెళ్ళి పోతున్నారు.
మొత్తానికి కార్యాలు భంగమౌతున్నాయి.
ఇలా కాదని పొరుగూరి నుంచి ఓ కాకిని తెప్పించారు.
ఆ సంగతి తెలుసుకున్న సిరి”బాబాయ్! ఇది మాఊరి సమస్య మాసమస్య నువు పాల్గొంటే బాగుండదు వెళ్ళి పో”అని తరిమేసింది.
ఓరోజు గ్రామ పెద్ద దిగివచ్చి, సిరిని పిలిపించాడు.
“ఇలా చేయడం తప్పు . తప్పొప్పులుంటే చర్చలలో తేల్చుకుందాము. మాపెద్దల ముక్తికి అడ్డురావడం ధర్మంకాదు” అన్నాడు .”కొంచెం ప్రాధేయపడినట్టుగా.
“అయ్యగారూ! అల్పజీవులని,చిన్నపనులు చేసేవారని చులకనగా చూడరాదు.
విమానమైనా చిన్న చీల లేకుంటే ఆగి పోతుంది మీ సౌకర్యం కోసం మేము గొంతు పోయేలా అరిస్తే ఛీ పాడు అని రాయితో కొట్టి కన్ను పోగొట్టారు . అందరూ అన్ని పనులు చేస్తేనే ఈ సమాజం సజావుగా సాగుతోంది ” అన్నది సిరి కొంచెం ఆవేశంతో.
“జరిగిన పొరబాటుకు మన్నించండి. త్వరలో కన్ను బాగుచేయిస్తాను. అందరమూ కలసి మెలసి బ్రతుకుదాము”
ఆ మాటలకు సంతసించిన కాకులు కావు కావుమంటూ సంతోషాన్ని వ్యక్తపరిచాయి
✍🏻జంజం కోదండ రామయ్య
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.