ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Telugu Ghost Stories – Telugu Horror Stories – దెయ్యాల కథలు – హర్రర్ కథలు
శ్వేత : మరి ఆ డబ్బు ఇవ్వడానికి ఏక్కడికి రమ్మన్నాడు? ఆ రోగ్…
సుహాసిని: ఇందిరా గాంధీ పార్క్ కి
శ్వేత : “నువ్వు భయపడకు,మా మామ డి.ఎస్.పి. ఆయనకి ఒక కాల్ చేస్తే అంతా ఆయనే చూసుకుంటాడు.”
సుహాసిని: “పోలీసులకు చెప్తే తనకు తెలుస్తుంది. ఎందుకంటే పోలీసులు తనకు కానిస్టేబుల్ నుండి కమిషనర్ వరకు అందరూ తెలుసు. వాళ్ల ద్వారా మనం ఏం చేయలేం. అలా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే తనకు తెలిస్తే నా జీవితం మొత్తం యూట్యూబ్లో పెడతాడు. దీనిని మనమే జాగ్రత్తగా డీల్ చేయాలి శ్వేత..”
శ్వేత : “మనం ఇద్దరం ఏం చేయలేము శ్వేత. మనకు నాలెడ్జ్ ఉన్న ఎవరైనా బాయ్స్ సపోర్ట్ ఉండాలి.”
సుహాసిని : “ఇపూడు ఎలానే…మనకు తెలిసిన వారు ఎవ్వరూ లేరు…”
శ్వేత: “సరే మనం ముందుగా ఇందిరాపార్కు వెళ్లి ఆ రాక్షసుని కలుద్దాం. ఎలాగైనా తనని బ్రతిమాలి తన దగ్గర నుండి అన్ని డిలీట్ చేయమని చెబుతాను. పోతే ఒక లక్ష రూ₹ పోతాయి.మనకు మళ్లీ ప్రాబ్లం రాకుండా ఉంటుంది కదా…”
సుహాసిని : సరే నే….
శ్వేత : నువ్వు డల్గా ఉండకు .కాబోయే సీఈవో వి. ఎంత హుషారుగా ఉండాలి.
**** ఇద్దరు కూడా ఇందిరా గాంధీ పార్క్ కి వెళ్తారు. రఘు కూడా సుహాసిని వాళ్ళు ఇందిరా గాంధీ పార్క్ కి వెళ్తున్నారని తెలుసుకుని, వాళ్ళ కంటే ముందే ఏమి కూడా ఏమి కూడా ఎరుగనట్టు పార్క్ లో వెళ్లి ఉంటాడు. రఘును , సుహాసిని చూస్తుంది. సుహాసిని అతన్ని కలవాలని అనుకుంటుంది కానీ ఏదో ఏదో తెలియని మొహమాటం, తన సమస్యను ఇతనికి చెప్తే ఏమైనా పరిష్కరిస్తాడేమో అని అనుకుంటుంది కానీ పిరికివాడు ఏం చేయగలడు. అయినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి తక్కువ అంచనా వేయొద్దు అని మనసులో అనుకొని రఘుని కలుస్తుంది.
హాయ్ రఘు,అని అంటుంది సుహాసిని…
రఘు షాక్ అవుతాడు.నేను తనని కలవాలని వస్తె తనే నన్ను కలిసింది.దేవుడా నువ్వు చాలా గ్రేట్ అని తనలో తను అనుకుంటాడు.
“హలో బాస్…ఎక్కడున్నావు..నిన్నే”… అని రెండోసారి పిలవగానే.. ఊహల నుండి బయటికి వస్తాడు రఘు.
“హలో మేడం బాగున్నారా…?”
“మేడం వద్దులే కానీ నా పేరు సుహాసిని.. సుహాసిని అని పిలువు.”
“ఒకే సుహాసిని. చాలా థ్యాంక్స్ అండీ”
“ఎందుకు ?”
“ఒక రోజు అర్ధరాత్రి బైక్ రిపేర్ అయితే నాకు లిఫ్ట్ ఇచ్చారు మరియు బస్ డీ కొడుతుంటే కాపాడారు.”
“ఓకే… నువ్వు చాలా ఇంటెలిజెంట్. ఆరోజు నీకు లిఫ్ట్ ఇచ్చింది నేనే అని ఎలా కనిపెట్టావూ. ఆరోజు నేను స్కార్ఫ్ కట్టుకునే ఉన్నా నువ్వు నన్ను చూడలేదు కదా..మరి ఎలా”
రఘు : ” మిమ్మల్ని ఆరోజు షాపింగ్ మాల్ లో చూసినప్పుడు, అదే స్కార్ఫ్ ని మీరు తెచ్చారు. కానీ సేమ్ స్కార్ఫ్ అందరూ వాడొచ్చు అని ఆరోజు నేను లెక్క చేయలేదు. నేనే పొరపడి ఉంటాను అని అనుకున్నా. తర్వాతి రోజు మీరు నన్ను బస్ ఆక్సిడెంట్ నుండి కాపాడినప్పుడు , మీరు నన్ను డ్రాప్ చేసిన స్కూటీనే తెచ్చారు.అదే డ్రెస్ నీ మీరు వేసుకున్నారు. అప్పుడే నాకు 50% మీరే అని అర్థమైంది. ఇంకా 50% కన్ఫర్మ్ మీరు ఇందిరా గాంధీ పార్క్ కి రావడం ద్వారా తెలిసింది”అని అంటాడు రఘు.
సుహాసిని : సుహాసిని అనుమానంగా ఆలోచిస్తూ… “అంటే మేము వస్తున్న విషయం నీకు ముందే తెలుసా…?”
రఘు : “ఆ తెలుసు కానీ అది ఎలా తెలుసో మీకు తర్వాత చెప్తాను…” కానీ ఆ రోజు అర్థరాత్రి మీరు మాట్లాడే ప్రతి మాట… నను చాలా భయపెట్టింది. ఆ రోజు రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు. మీరు నిజంగా దయ్యమే అని అనుకున్నాను.”
సుహాసిని మరియు శ్వేత ఇద్దరు కూడా బాగా నవ్వుతారు.
సుహాసిని : “నేను అంత ధైర్యవంతురాలిని కాదు. ఆ రోజు ఆఫీస్ వర్క్ చేసి లేట్ అయింది.సమయానికి కార్ రిపేర్ అయితే శ్వేత స్కూటీ నా దగ్గరే ఉంచుకున్నా. అర్ధ రాత్రిపూట ఎవరు ఎలా ఉంటారో తెలియదు కదా. అమ్మాయిలం కదా మా భయాలు మాకుంటాయ్. నువ్వు అలా అడ్డగాడిదలా అడ్డంగా రోడ్డుపై నిలబడి ఉంటే నేను కూడా నిన్ను చూసి దయ్యమే అనుకున్నాను. కానీ వెనక నుండి నిన్ను నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను.నువ్వు ఒక కుక్కని చూసి భయపడటం వల్ల నాకు చాలా నవ్వు వచ్చింది. నువ్వు పిరికివాడివి అని నాకు అనిపించింది.ఇంకా హాని చేసే వాళ్ళు ఎవరు ప్రొఫెషనల్స్ డ్రెస్సులో అయితే ఉండరు , కొంచెం ధైర్యం చేశా, అప్పుడు నేను వెనకనుండి నిన్ను తాకితే “నువ్వు ఇంకా చాలా భయపడ్డావ్, నీలో భయమే నాలో ధైర్యాన్ని పెంచింది. అందుకే నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసేంతవరకు నిన్ను మాటలతో భయపెట్టాను. సో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి ఉంటే సారీ.”
రఘు : “చాలా భయ పెట్టారు మామూలుగా కాదు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బిక్కు బిక్కు మంటూ మీతో వచ్చాను. నాకు దయ్యం అంటే సుస్సు. ఇంట్లో ఎప్పుడూ ఒంటరిగా కూడా పడుకోను. అమ్మ అయినా నాన్న అయినా పక్కన ఉండాల్సిందే. జరిగిందేదో జరిగిపోయింది. కాని నేను మిమ్మల్ని కంపెనీలో కలిసినప్పుడు ,అక్కడ మీ వాచ్ మెన్ మీ పేరు మార్చి ఎందుకు చెప్పాడు తర్వాత మీరు షాపింగ్ మాల్ లో ఉన్నప్పుడు నేను మీకు కాల్ చేస్తే , వేరే వాళ్లు లిఫ్ట్ చేశారు. అచ్చం మీ గొంతే..అది ఎలా..?నాకు అర్థం కాలేదు…”
సుహాసిని : “అది ఏమంత పెద్ద విషయం కాదు. మీరు నన్ను ఫాలో అవ్వడం చూసి నేనే, వాచ్ మెన్ కి ముందే కాల్ చేసి నా పేరు మార్చి చెప్పమని చెప్పాను. తర్వాత మీరు కాల్ చేసిన సిమ్ ఫ్రెండ్ ది, ఇవిడే ఆ ఫ్రెండ్ , మీతో ఎవరైనా రఘు అని కాల్ చేస్తే నాలా మాట్లాడి, బిజీగా ఉన్నా అని ఫోన్ పెట్టెయ్ అని ముందే చెప్పి ఉంచాను.”
రఘు : ఓకే అవన్నీ విషయాలు వదిలేయండి.మీరు నన్ను చూసి, నా పేరు, నా బయో డేటా మొత్తం చెప్పారు అది ఎలా?
సుహాసిని : ” మీ మెడలో ఉన్న ఐడి కార్డు చూసి….”
రఘు : “హొ అవునా….వామ్మో మీ మేధ శక్తికి జోహార్లు”అయినా నాకు ఆ రోజు షాపింగ్ మాల్ లో మీరు అబద్ధం ఎందుకు చెప్పారు.
సుహాసిని : “అమ్మ ఉన్నారు. తప్పుగా అర్థం చేసుకుంటారని అలా అబద్దం చెప్పాల్సివచ్చింది.”
రఘు : “ఓ ఓకే.ఓకే…..మీరు గ్రేట్ అండి.ఒక కంపెనీకి చిన్నవయసులోనే సీఈఓ అవుతున్నారు అంటే మీలాంటి గొప్ప వారిని కలవడం నా అదృష్టం. మీలాంటి వారి రుణం ఎన్ని జన్మలైనా తీర్చుకోలేం అండి.”
శ్వేత : “అంతొద్దు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు కని ఒక చిన్న పని ఉంది చేసి పెట్టు”
సుహాసిని , వద్దు వద్దు అంటూ శ్వేత చేయి పట్టుకుంటుంది. ఏమవ్వదులేవే చెబుదాం అంటూ శ్వేతా అంటుంది.
రఘు : “ఏమైంది.నాకు చెప్పండి.నా శాయశక్తులా నేను సహాయ పడతాను.ఏమైనా సమస్యా..”
శ్వేత : అవునండి దీనికి ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. అంటూ విషయం మొత్తం వివరిస్తుంది.
రఘు : “ఆ రాక్షసుడు ఎవరో నేను కనిపెడతాను అతని నెంబర్ ఇవ్వండి.”
రఘు ఆ నంబర్ తీసుకుంటాడు. తన ఫ్రెండ్ కి కాల్ చేసి ఆ నెంబర్ని ట్రాక్ చెయ్యమని చెప్తాడు.
రఘు : “మీరు వెళ్ళండి ఇక్కడి నుండి. నేను అతని సంగతి చూసుకుంటాను. రేపు ఉదయం కల్లా అతన్ని నేను పట్టుకుంటాను.”
సుహాసిని : “చాలా థ్యాంక్స్ అండీ”
రఘు : మీరు మందులాగే రఘు అని పిలవండి చాలు….
సుహాసిని అప్పుడు మనమిద్దరం ఫ్రెండ్స్ అని షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. అలా అయినప్పటి నుండి ప్రతిరోజు ఇద్దరూ మాట్లాడుకోవడం,ఇలా ఒక రోజు కాస్త తెలియకుండానే వారం రోజులు గడిచి పోతుంది. ఒకరి ప్రేమలో మరొకరు పడిపోతారు. ఒకరోజు అకస్మాత్తుగా సుహాసినికి అనుమానం వస్తుంది. నన్ను బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తి ఎలాంటి కాల్ చెయ్యట్లేదు? అసలు ఏమైంది? ఫోన్ చేసి అడుగుతుంది రఘుని.
రఘు : “హా సుహాసిని,వాడు దొరికాడు. చిత్తుచిత్తుగా కొట్టి మా ఇంటి వెనకాల గోడౌన్ లో కట్టేశాను. నువ్వు త్వరగా రా…”
సుహాసిని , రఘు వాళ్ళ ఇంటికి వెళ్తుంది. రఘు వాళ్ళ కుటుంబ సభ్యులందర్ని పరిచయం చేస్తాడు సుహాసినికి. ఆ కుటుంబంలోని ప్రేమానురాగాలకు సుహాసిని కూడా వాళ్ళలో ఒకరిగా కలిసిపోతుంది.
సుహాసిని : “రఘు ,వాడు ఎక్కడా?”
పదా, నీకు చూపిస్తా అని ఇంటి వెనకాల, ఒక గోడౌన్ లో సుహాసినినీ తీసుకెళ్తాడు.అక్కడ ఎవరు కూడా ఉండరు.
“ఏక్కడ రఘు! తను ఎక్కడ ఉన్నాడు?”
రఘు : ” నీకు ఎదురుగా ఉన్నాడు”
సుహాసిని : “వాట్ ? ఏమంటున్నావ్ నాకేమి అర్థం కావడం లేదు.. అర్థం అయ్యేలా చెప్పు రఘు….”
రఘు : “ఆరోజు ఇందిరా గాంధీ పార్క్ లో… మిగతా 50% మీరు రావడం వల్ల నాకు కన్ఫామ్ అయ్యింది అని చెప్పాను గుర్తుందా…ఇదంతా చేసింది నేనే. ఆ ఫోన్ లో బ్లాక్ మెయిల్ చేసింది కూడా నేనే.. ఇదంతా నేను ఆడిన డ్రామా.”
సుహాసిని : “నినూ…….నువ్వు ఇంత రాక్షసుడివా… ఛీ… నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది.”
రఘు : “అబ్బా.. ఆడవారికి ఎలా చెప్తే అర్థమవుతుంది. అప్పుడు అలా అబద్దం ఆడాల్సి వచ్చింది తల్లి. మరి నువ్వు నన్ను భయపెట్టి, బాధ పెట్టినప్పుడు ఏమీ లేదా? మరి దానికి నేనేం చేయాలి?”
సుహాసిని : “అయితే మాత్రం..అలా ఆడవారు బట్టలు మార్చుకుంటుంటే వీడియో తీయడం తప్పు కదా…?”
రఘు : “అయ్యో మహాతల్లి… నేను ఏలాంటి వీడియోలు ఫోటోలు తీయలేదు. నిన్ను గుర్తించడానికి అలా ఒక ట్రిక్ ప్లే చేశాను అంతే. ఇన్ని రోజులు మన ఫ్రెండ్ షిప్ లో నువ్వు నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా..?”
సుహాసిని : “అయినా నాకు నీమీద చాలా కోపంగా ఉంది”
రఘు : “సరే ,తప్పంతా నాదే.ఇప్పుడు నన్ను ఎం చేయమంటావు…నువ్వే చెప్పు…సరే నీ కాళ్ళు పట్టుకొనా” అంటూ సుహాసినీ కాళ్ళ మీద పడతాడు
సుహాసిని : “ఎంటి రఘు…నువ్వు మరినూ…సరే..అయిందేదో అయిందిలే. చెల్లుకి చెల్లు. మళ్లీ నువ్వు ఎప్పుడు ఇలా చెయ్యద్దు”
రఘు : ఓకే ఓకే.. ఇద్దరు హాయిగా నవ్వుకుంటారు…
అప్పటినుండి సుహాసినికి రఘు పై అభిమానం మరియు ప్రేమ మరింతగా పెరుగుతుంది.అలానే రఘు మరియు సుహాసినిలా జీవితం హాయిగా కొనసాగాలని ఆశిస్తూ..కథ సమాప్తం.
మురళీ గీతం – 8374885700
Scariest Telugu ghost stories
Most haunted places in Andhra Pradesh
Real ghost stories from Telangana
Telugu ghost stories that will make you shiver
Telugu ghost stories that will keep you up at night
Telugu ghost stories that will make you believe in the paranormal
Telugu ghost stories that will change your life
Telugu ghost stories that will make you laugh
Telugu ghost stories that will make you cry