Menu Close

కిచెన్ లో బాగా ఉపయోగపడుతుంది.
కరెంట్ పోయినప్పుడు కూడా
4 గంటల పాటు ఆన్ లో వుండే లైట్.
అమెజాన్ లో ఆఫర్👇👇

Buy Now

Telugu Ghost Stories – Telugu Horror Stories – Part 7

Telugu Ghost Stories – Telugu Horror Stories – దెయ్యాల కథలు – హర్రర్ కథలు

అందులో ఒక వ్యక్తి, “సిద్ధాంతి గారు మీ మంత్రాలు వింటే దయ్యాలు వచ్చి చితగ్గొడతాయి కావచ్చు”ఎందుకంటే మూవీస్ లో అలానే జరుగుతుంది.

“ఊరుకోరా బుద్ధిలేని వెధవా! నన్ను చూస్తూ ముందుకు సాగు అని అంటారు సిద్ధాంతి..”

అందరూ వెళుతుంటారు. రఘు దయ్యాన్ని చూశా అని చెప్తాడు. వెనక ఉన్న వారి గుండెల్లో గుబులు పుడుతుంది. అందరికీ ముచ్చెమటలు పట్టేస్తాయి సిద్ధాంతి గారితో సహా.

సురేష్ మాత్రం ఒకటి గమనిస్తూ ఉన్నాడు. దయ్యం అంటే భయపడే వాడు రఘు , ఇంత ధైర్యంగా ఎలా ముందుకు వెళ్తున్నాడో అర్థం కావడం లేదు. అందులో దయ్యాన్ని చూసి కూడా ధైర్యంగా నిలబడి ఉన్నాడు. సురేష్ కి లోలోపల ఏదో అనుమానం కలిగింది. ఒకవేళ రఘు దయ్యం కావచ్చు అని. ఛ ఛ .. అలా ఏమీ ఉండదు అని అందరూ ముందుకు వెళ్తారు. అందరూ చూసి షాక్ అవుతారు రఘుతో సహా…

Scariest Telugu ghost stories Horror Stories in Telugu Bucket 2

అక్కడ ఏముందంటే.. బీచ్ మధ్యలో నాలుగు కర్రలు పాతిపెట్టి నిర్మించిన చిన్న గుడిసె,ఆ గుడిసె మీద ఒక కర్ర, దానికి తెల్లని వస్త్రం కట్టేసి ఉంది. ఎవరైనా దానిని దూరం నుండి చూస్తే, బీచ్లో అది గాలికి రెపరెపలాడుతూ ఎగరడం వల్ల, అది అందరికీ దయ్యంలా కనిపించి దాని జోలికి ఎవరు వెళ్లలేదు. పుకార్లు మరియు తెలియని భయాలు ఆ దయ్యం అనే ఒక కల్పిత పాత్రకి మరింతగా ప్రాణం పోశాయి.

ఆ ప్రదేశంలో ఎవరికీ యాక్సిడెంట్ అయి చనిపోయిన అది దయ్యమె చేసిందని బలంగా నమ్మేవారు. నిజంగా అక్కడ ఎలాంటి దయ్యం లేదు కేవలం భయం తప్ప.మొత్తానికి విజయవంతంగా దయ్యం గుట్టు రట్టయింది. అందరూ ప్రాణాలతో ఊపిరిపీల్చుకున్నారు. అక్కడినుంచి అందరూ సంతోషంగా ఇళ్లకు వెనుదిరిగారు.

ఉదయం అవ్వగానే ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ లో ఒకటి వార్త…. ఒకటే headline…

“ఇన్ని రోజులుగా భయబ్రాంతులకు గురి చేస్తున్న బీచ్లోని దయ్యం గుట్టురట్టయింది. ఒక యువకుల బృందం దీనిని చేధించింది. రఘు మరియు సురేష్ మరియు వారి యొక్క మిత్రులను, జిల్లా డి.ఎస్.పి గౌరవంగా సత్కరించి అభినందించారు.”

రఘు సురేష్ కి కాల్ చేస్తాడు….

“హలో రఘు చెప్పురా..”

“ఆ మామ లేచావా…!?”

“లేచాను రఘు, మన వార్తే న్యూస్ లో పదే పదే వస్తుంది. కానీ నిజంగా చెప్పాలంటే నిన్న రాత్రి నిన్ను చూసి నేను ఎక్కువ భయపడ్డాను” అని అంటాడు సురేష్

“ఎందుకురా అలా అంటున్నావు?”

“ఉన్నట్టుండి నువ్వు చాలా ధైర్యంగా ఉంటేనూ,?”

“దానికి ఒక సీక్రెట్ ఉంది అది ఏంటంటే నిన్న రాత్రి మొత్తం నేను గూగుల్లో సెర్చ్ చేసి కొన్ని విషయాలు తెలుసుకున్నాను.నిజానికి దయ్యాలంటూ ఉండవు అవి కేవలం మనం కల్పించుకున్న కల్పిత ఊహలు మాత్రమే. నిజంగానే ఒకవేళ దెయ్యాలు ఉన్నా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటికి శరీరం లేదు కనుక అవి మన కంటికి కనబడవు.మనల్ని ఏమీ చేయలేవు.

Scariest Telugu ghost stories Horror Stories in Telugu Bucket 3

మనం మన సమాజంలో దయ్యం అనే ఒక బొమ్మని వేసిన దానిని క్రూరంగా చిత్రీకరించాం, అది ఏమైనా చేయగలదు, దానికి మాయలు వచ్చు ,మంత్రాలు వచ్చు, మనిషిని చంపేస్తుంది అంటూ మనమే ఊహించుకొని ,అడ్డుగోడలు గీసి, ప్రతిక్షణం దాన్ని చూసి భయపడుతున్నాము. వాస్తవానికి దయ్యాలు భూతాలు లేవు. ఆ పుస్తకం చదివిన తర్వాత నేను ఇలా తయారయ్యాను.ఆ రోజు రంగయ్య రాకున్నా కోతి బొమ్మను చూసి రంగయ్య అనుకొని తాళం ఇచ్చి వచ్చాను. అది నాకు తర్వాత గుర్తుకు వచ్చింది. నేను పుస్తకం చదివినప్పుడు నాలో నేను ఊహించుకుంటున్న తప్పుడు ఆలోచనలే నాకు భయానికి కారణాలు అని తెలుసుకున్నాను.

సురేష్ : “ఓహొ….ఇదా సంగతి…. చాలా బాగా ఆలోచించావు.”

రఘు : “ఈరోజు సుహాసిని ఇందిరా గాంధి పార్క్ కి వెళ్తుంది. నేను ఈ రోజు తనను కలుస్తాను. నేను చెప్పింది నీకు అర్థమైంది కదా. మనం అనుకున్నట్టే జరగాలి .ఎవరికీ కూడా ఎలాంటి అనుమానం రాకూడదు ” అని రఘు సురేష్ కి చెప్తాడు.

సురేష్ : సరే రా,అన్ని నువ్వు చెప్పినట్టే చేశాను.నువ్వు తనని కలిశాక చెప్పు.

రఘు : ఓకే రా….భై అని ఫోన్ పెట్టేస్తాడు రఘు.

సుహాసిని ఇంట్లో..

సుహాసిని నిన్నటి నుండి చాలా దిగులుగా ఉంది. అన్నం కూడా తినటం లేదు.ఏమైందో తనకు అని వాళ్ళ అమ్మ చాలా టెన్షన్ పడుతున్నారు. అప్పుడే వాళ్ళ స్నేహితురాలు శ్వేత వచ్చింది. అది చూసిన సుహాసిని వాళ్ళమ్మ శ్వేతతో ,

“అమ్మ! శ్వేత సుహాసిని నిన్నటి నుండి ఎందుకో డల్ గా ఉంది నేను అడిగితే ఏమీ చెప్పట్లేదు. నువ్వు అయినా కాస్త అడిగి తెలుసుకో’..అని చెప్పింది.

“అలాగే ఆంటీ, ఎక్కడుంది తను..”

“పైన తన గదిలో పడుకుని ఉంది. నేను లే అని ఎంత బతిమాలినా లేవలేదు.”

“నేను లేపుతాను ఆంటీ గారు, మీరు ఏం బాధపడకండి. మీరు తనకు భోజనం చేసి ఉంచండి,తను వచ్చి తింటుంది”

అలాగే నమ్మ…అని సుహాసిని వాళ్ళ అమ్మ కిచెన్ లోకి వెళ్తుంది.

“సుహాసిని….లే సుహాసిని…ఎంటే నీ మొద్దు నిద్ర..లే అంటే లేవట్లేదు… అన్నం కూడా తినట్లేదు అంట.. నా కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఏమైందే నీకు..?”

సుహాసిని ఏడవడం చూసి, శ్వేత కంగారు పడుతుంది. ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది.

సుహాసిని చెప్పదు అలాగే బాధపడుతూ ఉంటుంది.

శ్వేత: “ఏమైందో చెప్పు సుహాసిని… ఎప్పుడు హ్యాపీ గా ఉండే దానివి ఎందుకు ఇలా అయ్యావు ఒకసారిగా.నేను నీ బెస్ట్ ఫ్రెండ్నీ నాతో చెప్పు…”

సుహాసిని : “మొన్న నేను మా అమ్మతో కలిసి షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఎవడో నన్నే ఫాలో అయ్యాడు అంట.నేను షాపింగ్ మాల్ లో రెస్ట్ రూమ్ లో బట్టలు మార్చుకుంటున్నప్పుడు ,తను ఒక సీక్రెట్ కెమెరా ద్వారా ఫొటోస్ మరియు వీడియోస్ తీశాడంట. నిన్న నాకు కాల్ చేసి బెదిరించాడు. తనకు లక్ష రూపాయలు డబ్బు అవసరం ఉంది అది ఇస్తే , ఆ ఫొటోస్ మరి వీడియోస్ డిలీట్ చేస్తాను,ఎవ్వరికీ లీక్ చేయను అని చెప్తున్నాడు. ఈ విషయం అమ్మకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు” అని శ్వేతని పట్టుకుని ఏడుస్తుంది సువాసిని.

మురళీ గీతం – 8374885700

Scariest Telugu ghost stories
Most haunted places in Andhra Pradesh
Real ghost stories from Telangana
Telugu ghost stories that will make you shiver
Telugu ghost stories that will keep you up at night
Telugu ghost stories that will make you believe in the paranormal
Telugu ghost stories that will change your life
Telugu ghost stories that will make you laugh
Telugu ghost stories that will make you cry

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks