Telugu Ghost Stories – Telugu Horror Stories – దెయ్యాల కథలు – హర్రర్ కథలు
రఘు అనుకుంటూనే ఎవరు నువ్వు అని అడుగుతాడు.
“నేను ఎవరైతే నీకెందుకు, ఈ టైంలో నువ్వు యిక్కడ ఏం చేస్తున్నావ్ స్మశానంలో?” అని అడుగుతుంది అమ్మాయి.
“నా బైక్ రిపేర్ అయ్యిందండి. అందుకే నడుచుకుంటూ వెళుతున్నాను..”
“చూడబోతే మంచి ప్రొఫెషనల్స్ డ్రెస్ లో సాఫ్ట్వేర్ ఎంప్లాయిలా ఉన్నావు. బైక్ రిపేర్ అయితే మరో ఆటో ఎక్కొ, బస్సు ఎక్కో వెళ్లాలి కానీ ఇలా నడుచుకుంటూ వెళ్తారా” అని అడుగుతుంది.
“అదేం కాదండీ, సగం దూరం వచ్చాక బైక్ ట్రబుల్ ఇచ్చింది.”
“సరే , మీరు ఎక్కడికి వెళ్లాలి చెప్పండి నేను లిఫ్ట్ ఇస్తాను..”
రఘు చాలా సంతోషంగా థాంక్స్ అండి అంటూ, ఆ అమ్మాయి యొక్క స్కూటీ ఎక్కబోయి వెంటనే మళ్ళీ ఆగిపోతాడు..
అమ్మాయి : “ఏమైంది, ఆగిపోయారు…”
రఘు : “మీకు పెళ్లి అయ్యిందా “అని అడుగుతాడు రఘు..
అమ్మాయి : “వాట్ డు యు మీన్?”
రఘు : “అంటే,మీరు నన్ను ఏం చెయ్యరు కదా? మిమ్మల్ని నమ్మొచ్చా…”అంటాడు రఘు.
అమ్మాయి : లోలోపల నవ్వి ,బయటికి గంభీరంగా.. “అంటే మీ ఉద్దేశం ఏమిటి. నేను ఏమైనా క్రిమినల్ లా అవుపడుతున్నానా.అయినా మీరు అసలు అబ్బయేనా,ఇలా భయపడుతున్నారు.ఒక అమ్మాయి వచ్చి హెల్ప్ చేస్తాను అని, అర్ధరాత్రి వేళ ఏ భయం లేకుండా వచ్చి లిఫ్ట్ ఇస్తుంటే ,లిఫ్ట్ తీసుకోవాలంటే ఇన్ని అనుమానాలు కలుగుతున్నాయి …మీరు చాలా పిరికివాళ్ళాలా ఉన్నారు కదా..”
రఘు : చ ఛ,అదేం లేదు.ఊరికే అడిగాను..అంతే…
అమ్మాయి : ఓకే,సరే ఎక్కండి…
రఘు : “ఒక్క విషయం అండి.మీరు ఎవరైనా సరే నాకు మాత్రం ఒక నిజం చెప్పండి ….”
అమ్మాయి : “సరే అడగండి రఘు” అని అంటుంది
రఘు ఆశ్చర్యంగా చూస్తాడు, నా పేరు మీకెలా తెలుసు..అని అడుగుతాడు..
అమ్మాయి : నాకు నీ బయోడేటా మొత్తం తెలుసు,నువ్వు Infosys లో పనిచేస్తున్నావు. ఆఫీస్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడే వస్తున్నావు.
రఘు : అవును ,మీరు అన్నవి నిజం , కాని ఇవన్నీ ఎలా?
అమ్మాయి : “అవన్నీ నాకు వెన్నతో పెట్టిన విద్యలే కానీ నువ్వు ఎం అడగదలుచుకున్నావో అది చెప్పు..”
రఘు : “నన్ను ఏమి అనుకోవద్దు..మరి మేడం” భయంతో చెప్తాడు రఘు
అమ్మాయి : ఓకే చెప్పండి
రఘు : “మీరు నిజంగా అమ్మాయేనా లేదా దయ్యమా? మా బామ్మ చెప్పారు, అమావాస్యలో దయ్యాలు,ఆత్మలు అమ్మాయిలా మారి వస్తారని చెప్పింది ..అంటూ వణుకుతూ చెప్తాడు…”
అమ్మాయి బాగా నవ్వుతుంది..ఆ నవ్వుకు రఘు భయపడతాడు.
రఘు : “మీరు నవ్వుతూ ఉంటే నిజంగా దయ్యమే అనిపిస్తుంది..”
అమ్మాయి : అవును …అంటుంది…
రఘుకి ఒళ్ళు మొత్తం షివరింగ్ అవుతూ చెమటలు పట్టేసాయి..
“ప్లీజ్ నన్ను ఏం చేయకండి” అంటూ బ్రతిమిలాడాతాడు రఘు.
అమ్మాయి : “ఆపండి మీరు కాస్త,మీకు నేను దయ్యంలా కనిపిస్తున్నానా ,మీరు భలే వారు…హెల్ప్ చేయడానికి వస్తె అందరూ దేవత అనో,మదర్ థెరీసా అనో ఇలా పొగుడుతారు.కానీ మీరు టెక్నాలజీ యుగంలో ఉండి కూడా దయ్యాలు, భూతాలు అని భయపడుతున్నారు.నేనేమీ దయ్యం కాను మీరు ధైర్యంగా ఎక్కండి” అని అంటుంది ఆ అమ్మాయి.
అమ్మాయి మాటలు అయిపోగానే, స్మశానంలో కాలుతున్న శవం ఒక్కసారిగా పైకి లేస్తుంది.రఘుకి మరింత భయం వేస్తుంది.దూరంగా కుక్కలు,నక్కలు అరుస్తాయి.రఘు అమ్మాయి వైపు చూస్తాడు.
అమ్మాయి : “అయ్యో…మీకు ఇంత కూడా బుర్ర లేదు. కాలే శవం లేవడానికి కారణం, వాటి ఎముకలో ఉండే భాస్వరం మండడం వల్ల అలా ఎముకలు పైకి లేస్తాయి అంతే తప్ప అది దయ్యం కాదు.ఇంకా కుక్కలు ,నక్కలు అరిచినంత మాత్రాన దయ్యం రాదు అని సర్ది చెప్తుంది…”
రఘు కదలకుండా ఉంటాడు..
అమ్మాయి : మీకు లిఫ్ట్ కావాలా వద్దా,నేను వెళ్లి పోతున్నాను..అంటుంది
రఘు వెంటనే స్కూటీ ఎక్కి కూర్చుంటాడు.ఇద్దరు కూడా ఆ స్మశానం నుండి బయలుదేరుతారు. స్కూటీ కదులుతుంది కానీ రఘుకి మాత్రం ఎదో తెలియని భయం ఉంటుంది.అసలు ఈ అమ్మాయి వివరాలేంటో తెలుసుకుందాం అని రఘు మెల్లగా మాట్లాడటం మొదలు పెడతాడు.
రఘు : “ఏవండీ ! మీరు ఏం చేస్తుంటారండి”
అమ్మాయి : “స్మశానంలో శవాలను పీక్కుతింటాను” అంటుంది సీరియస్ గా
రఘు : “ఒక్కసారిగా రఘు గొంతులో నుండి నీళ్ళు మింగుతాడు..” ఏంట్రా బాబు ఇది,శావాలు అంటుంది..నన్ను పీక్కు తినదు కదా” అని మనసులో అనుకుంటాడు..
రఘు : “మన మధ్య ఈ అర్ధ రాత్రి జోకులు బాగోవు మేడం…కాస్త దయచేసి నిజం చెప్పండి”
అమ్మాయి : “ఎందుకు ,ప్రతి రోజూ నన్ను ఫాలో అవ్వడానికా..?'”
రఘు : “దయ్యాలకి ఫాలోయింగ్ కూడా ఉంటుందా” …అని మెల్లగా గొణుగుతాడు..
అమ్మాయి : “నాకు వినబడింది..మిస్టర్…”అంటుంది
రఘు : “వామ్మో,దీనికి ఇంద్రునికి ఒళ్ళంత కళ్ళు ఉన్నట్టు,దీనికి చెవులు ఉన్నట్టు ఉన్నాయని మనసులో అనుకుంటాడు..”
అమ్మాయి : “అవును..నాకు ఒళ్ళంతా చేవులే ఉంటాయి.నువ్వు ఎది అనుకున్న అది నాకు తెలుస్తుంది.ఈ రోజు అమావాస్య మాకు చాలా మంత్ర శక్తులు లభిస్తాయి” అంటూ రఘును భయపెడుతుంది తను
రఘు ,” వామ్మో శక్తులా….., ఎంటి దేవుడా నాకు ఈ దుస్థితి..ఇలా ఇరికించావు…”అని తనలో తానే అనుకుంటాడు
అమ్మాయి : “ఈ రోజు నుంచి నిన్ను నానుండి ఎవ్వరూ కాపాడలేరు..ఆ దేవుడు సైతం..ఒక్క నేను తప్పా..”
రఘు : “ప్లీజ్..మీరు చెప్పేది నాకు ఏమీ అర్థం కావడం లేదు”
అమ్మాయి : “సరే అయితే విను,నేను మీ ఆఫీస్ నుండి 10 km తర్వాత ఉన్న ఆరిజిన్ ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నాను. మాది కూడా మీ సిటీ యే, గాంధీ నగర్ కాలనిలో ఉంటాము.. కానీ నువ్వు ఎప్పుడు కనబడలేదు,నిన్ను తిందాం అంటే…”
రఘు : “వామ్మో…తినడం ఏంట్రా…నేనేమైనా చికెన్ హా మటన్ హా….దీని మాటలకి నిజమే అనిపిస్తుంది. దీని చేతికి చిక్కి నా పరిస్థితి వెనుక నుయ్యి ముందు గొయ్యిలా తయారయింది.”
అమ్మాయి : ‘”హేయ్..అడిగేది..నిన్నే మాట్లాడవ్..అంటూ గద్దిస్తుంది ఆ అమ్మాయి..”
రఘు : తడబడుతూ…చెప్పండి మేడం అంటాడు..
అమ్మాయి : నీ గ్రాడ్యుయేషన్ ఏంటి
రఘు : నేను న్యూఢిల్లీలో ఎంబీఏ చేశాను..
అమ్మాయి : ఓహో అదా సంగతి,ఓకే
ఇంతలో రఘు వాళ్ళ ఇల్లు వస్తుంది.స్కూటీ ఆపుతుంది అమ్మాయి.రఘు బండి దిగి ,థాంక్స్ చెప్పి ఇంట్లో వెళుతుంటాడు…
అమ్మాయి : “హొయ్,ఉత్తి థాంక్స్. యేనా…నువ్వేం మనిషివయ్యా…”
ఇంకా ఏం అడుగుతుంది రా నాయనా అనుకుంటూ… “ఏం కావాలి మేడం.చెప్పండి అని అడుగుతాడు” రఘు ఆ అమ్మాయిని.
అమ్మాయి : “ఏం వద్దులే కానీ ముందు వెళ్లి తిని బొజ్జో…ఇంకోసారి స్మశానంలో కనబడితే మా ఫ్యామిలీ కి ఆహారం అవుతావు..జాగ్రత్త” అంటూ స్కూటీ తిప్పి వెళ్తుంది.
రఘు తన మనస్సులో ఇంకా సందిగ్ధం వీడదు.ఈమె అమ్మయా ? దయ్యమా? అసలు ఎవరు తను ?
మురళీ గీతం – 8374885700
Scariest Telugu ghost stories
Most haunted places in Andhra Pradesh
Real ghost stories from Telangana
Telugu ghost stories that will make you shiver
Telugu ghost stories that will keep you up at night
Telugu ghost stories that will make you believe in the paranormal
Telugu ghost stories that will change your life
Telugu ghost stories that will make you laugh
Telugu ghost stories that will make you cry
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.