Menu Close

Telugu Ghost Stories – Telugu Horror Stories – Part 4

Telugu Ghost Stories – Telugu Horror Stories – దెయ్యాల కథలు – హర్రర్ కథలు

రఘు అర్థ రాత్రి ఇంటికి వస్తాడు. ఇంటి డోర్ తట్టుతాడు.చెల్లెలు గిరిజ వచ్చి తలుపు తీస్తుంది.

రఘు నీరసంతో వస్తాడు..నువ్వు పడుకొలేదా గిరిజ

గిరిజ : ‘”లేదు అన్నయ్య ,రికార్డ్స్ ఉన్నాయి.అందుకే రాస్తూ కూర్చున్నాను.అమ్మ నువ్వు ఇంకా రాలేదని చెప్పింది,వస్తె చూడమని చెప్పి, తను పడుకుంది. డాడీ నీకు కాల్ చేశారు కానీ నువ్వు లిఫ్ట్ చెయ్యలేదు.అయిన ఇంత లేట్ ఎందుకు అయింది రా నీకు?”

రఘు తలకాయ ఆల్రెడీ హీట్ ఎక్కి ఉంది.గిరిజ ప్రశ్నలకు తన పిచ్చి మరింత ఎక్కింది..

రఘు : “ఆపు..నీ డిటెక్టివ్ ప్రశ్నలు..కాస్త నన్ను ప్రశాంతంగా వదిలేయ్..”అంటాడు రఘు.

గిరిజ : ‘”సరే,వచ్చి తిను…నీకోసం అమ్మ చికెన్ 65 వండి పెట్టింది కానీ నువ్వు రావని నేనే తినేశా, ఈ సారికి ఈ వంకాయా కర్రీ తో అడ్జస్ట్ కారా”..అంటుంది గిరిజ.

Scariest Telugu ghost stories Horror Stories in Telugu Bucket

రఘు :” నన్ను కూడా తినవే..అన్ని నువ్వే తిన్నకా నేనేమీ తినాలి.. వంకాయ కర్రీ అంటే నాకు నచ్చదు అని నీకు తెలుసుగా..”

గిరిజ :”ఆపారా బాబు నీ గోల, తినలేదులే …నువ్వే తిను…అంటూ ఫ్రీజ్ నుండి తెచ్చి ముందు పెడుతుంది గిరిజ…”

రఘు తినడం మొదలు పెడతాడు. గిరిజకు అన్నయ్యను ఆట పట్టించడం తనకు అలవాటు,ఎప్పుడు విసిగిస్తు ఉంటుంది. అమ్మాయితో అన్నయ రావడాన్ని.. తను పైనుండి గమనిస్తుంది…

“అరేయ్ అన్నయ్య ఇంతకుముందు ఎవరితో మాట్లాడుతున్నావు రా ఇంటిముందు గాల్లో”అని అడుగుతుంది గిరిజ

రఘు :”గాలితో కాదు, ఎవరో తెలియని పర్సన్ రా,నా బైక్ ట్రబుల్ ఇస్తే తను దేవతలాగా వచ్చి నాకు లిఫ్ట్ ఇచ్చింది.

గిరిజ : “దేవతనా దయ్యమా?”

రఘు :” దయ్యం ఎక్కడైనా లిఫ్ట్ ఇస్తుందా..?”

గిరిజ : “ఏమో మరి? నాకు ఎవరు కనపడలేదు.నువ్వు గాల్లో మాట్లాడితే నీకు పిచ్చి పట్టిందేమో అనుకున్నా…’

రఘు కి లోపల టెన్షన్ వేస్తుంది రఘు : “నువ్వు సరిగ్గా చూడలేదు తెల్ల పంజాబి డ్రెస్ లో తనని “

గిరిజ : నేను నిజం చెపుతున్నాను.నువ్వు నడిచి వచ్చావు కదా,లిఫ్ట్ ఎక్కి రావడం” ఎంటి అని అడుగుతుంది గిరిజ

రఘు : గిరిజ చెప్పేదే నిజమే కావచ్చు.ఆ దయ్యం ఎవరికీ కనబడకుండా నాకే కనబడింది. ఆ అమ్మాయి దయ్యమే,ఇంకోసారి ఆమెను కలవద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఆ స్మశానంలో రాత్రి పూట ఒంటరిగా వెళ్ళకూడదు అని నిశ్చయించుకుంటాడు.

సరే,గుడ్ నైట్ అంటూ మద్యలో తినడం అపేసి బెడ్ రూమ్ లో కి వెళ్తాడు..

గిరిజ : అన్నయ్య బాగా భయపడినట్టు ఉన్నాడు..హ్మ్మ్ అంటూ..రికార్డ్స్ రాయడం ఆపేసి తను కూడా వెళ్ళి పడుకుంటుంది.

రఘులో ఒకే ఆలోచన. అర్ధరాత్రి ఏ అమ్మాయి కూడా బయటికి రాదు. ఆ అమ్మాయి వచ్చింది అంటే కచ్చితంగా దెయ్యమే మా బామ్మ చెప్పినట్టు, మళ్లీ అందులో తెల్లని దుస్తులు ,కురులు కూడా ఊగుతూనే ఉన్నాయి……అవన్నీ అతనిలో అలజడిని రేపుతాయి. అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్ర పోతాడు రఘు.

ఉదయం అవ్వగానే, వెచ్చని సూర్యకిరణాల రఘు పై పడగానే, తను నిద్ర లేస్తాడు. త్వరగా లేచి, స్నానం చేసి రెడీ అవుతాడు. ఈరోజు ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ ఫైల్స్ సబ్మిట్ చేయాలి. వెంటనే బయటికి వెళ్లి ,బైక్ స్టార్ట్ చేద్దాం అని బైక్ కోసం వెతుకుతాడు. తనకు రాత్రి జరిగిన విషయం అంతా గుర్తుకు వస్తుంది. తన ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫైల్ మొత్తం రెడీ చేయడం, తర్వాత బైక్ లోయలో పడి పోవడం, తనకు ఒక అమ్మాయి లిఫ్ట్ ఇవ్వడం అన్ని గుర్తుకు వస్తాయి.

“ఓహ్ షట్..నిజమే కదా..” అని ఆటో ఎక్కి ఆఫీస్ కి వెళ్తాడు రఘు.

Scariest Telugu ghost stories Horror Stories in Telugu Bucket 3

అందరూ స్నేహితులు వస్తారు. సురేష్ రఘు ని పలకరిస్తాడు.

“హాయ్ రఘు,ఏంట్రా చాలా డల్ గా ఉన్నావ్.”

“అదేం లేదు మామ.. నార్మల్ యే”

“ఏదో దయ్యాన్ని చూసి భయపడ్డట్టు ఉన్నావ్, నీ మొహం అలా పెట్టావ్…”

రఘు ,”వీడికి అన్ని ఎలా తెలుస్తాయి అసలు,”

నాకు జరిగింది ఆలోచిస్తే, గిరిజ చెప్పింది మరియు సురేష్ మాటలు వింటుంటే ఇదంతా నిజమే కావచ్చు..రాత్రి నేను ప్రయాణం చేసింది దయ్యంతోనేనా?? ఎన్నో ఆలోచనలు వెంటనే ఆవరించాయి రఘుని చుట్టూ..

రఘు నీ పిలుస్తాడు సురేష్ సురేష్ మాటలు విని రఘు మళ్ళీ ఆలోచనల నుండి తేరుకుని బయటికి వస్తాడు.

సురేష్ : “నిన్న రాత్రి చేసిన ప్రాజెక్ట్ ఫైల్ రెడీ అయిందా రఘు?”

అయింది సురేష్,

సురేష్ :”కంగ్రాట్స్ రఘు, నువ్వేంటో ఈరోజు మన బాస్ కి తెలుస్తుంది..'”

వెంటనే అక్కడున్న ప్యూన్ రామయ్య.. రఘుని బాస్ క్యాబిన్ పిలిచాడు అని చెప్తాడు. రఘు ఆ ఫైల్ తీసుకొని బాస్ దగ్గరికి వెళ్తాడు.

రఘు : “మే ఐ కం ఇన్ సార్”.

బాస్ : కమ్ ఇన్ రఘు…నేను ఇచ్చిన ఫైల్ కంప్లీట్ చేశావా

రఘు : హా సర్ అయిపోయింది

బాస్ : “వెరీ గుడ్, నువ్వు ఇంత ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తావ్ అని అనుకోలేదు. ఈరోజు దీనినే టెండర్ వేయబోతున్నాను .మనం అనుకున్న విధంగా గవర్నమెంట్ టెండర్ మన కంపెనీ కి వస్తె.. నీ జీవితం మారిపోతుంది.నువ్వు ఇంకా ఎప్పటికీ ఇలా ఉద్యోగం చేస్తుంది జీతం తీసుకోవాల్సిన దుస్థితి నీకు ఉండదు. రాబోయే ప్రాజెక్టులో నీకు టెన్ పర్సెంట్ షేర్ ఇస్తాను.. గుడ్ లక్ రఘు అంటాడు”

Scariest Telugu ghost stories Horror Stories in Telugu Bucket 2

రఘు : థాంక్స్ సర్… అని చెప్పి తన చేతికి ప్రోజెక్ట్ డాక్యుమెంట్ ఇచ్చి బయటికి వస్తాడు ఎంతో ఆనందంతో.

రఘు తన క్యాబిన్లో వచ్చి కూర్చుంటాడు. పక్కనే ఉన్న సురేష్ రఘులోని హుషారుని చూసి “ఏమన్నాడు రా బాస్”..అని అడుగుతాడు

రఘు :”అనుకున్న విధంగా గవర్నమెంట్ ప్రాజెక్ట్ మన కంపెనీ కి వస్తే మంచి షేర్ ఇస్తాను అన్నాడు..”

సురేష్ :”సూపర్ రా మామ.. ఒకే దెబ్బకు నీ లైఫ్ సెట్ అయిపోవాలి…” అని అంటాడు రఘు..

అంతా బానే ఉంది కానీ…అని అంటాడు రఘు..

సురేష్ : ఏమైంది రా ,మళ్లీ కానీ ఎంటిరా?

రఘు : అది నీకు ఎలా చెప్పాలి రా..నువ్వు నమ్మవు

సురేష్ : “చెప్పు రా అసలు ఏం జరిగిందో ఊరించకుండా”

వెంటనే అక్కడ ఉన్న అసిస్టెంట్ మేనేజర్ వచ్చి, రఘు నిన్న 11:00 వరకు నువ్వే ఆఫీస్ లో ఉన్నావు. మరి ఆఫీస్ తాళాలు ఎవరికి ఇచ్చావు అని అడుగుతాడు మేనేజర్…

“సర్ అది ,నేను మన వాచ్మెన్ రంగయ్య కి ఇచ్చాను సార్” అని అంటాడు రఘు.

“తను నిన్న తన భార్యకు బాగోలేదు అని లీవ్ పెట్టాడు. ఆఫీస్ కి వచ్చాడా… రంగయ్య” అతన్ని పిలవండి అని అనగానే వాచ్మెన్ రంగయ్య అక్కడికి హుటాహుటిన వస్తాడు.

అసిస్టెంట్ మేనేజర్ రంగయ్య నీ అడుగుతాడు “నువ్వు నిన్న వచ్చావా ఆఫీస్ కి…”

లేదు అని అంటాడు రంగయ్య..

రఘుకి ఏమీ అర్థం కాదు.నిన్న రాత్రి గేట్ దగ్గర ఉన్నది ఎవరు మరి?

నువ్వు లేవా రంగయ్య అని మళ్ళీ అడుగుతాడు రఘు

లేదు సార్, నేను రాలేదు…

అంతలో ఒక వ్యక్తి వచ్చి, గార్డెన్లో నీరు పడుతుంటే కోతి బొమ్మ చేతిలో ఈ తాళాల గుత్తి పెట్టి ఉంది అని చెప్పి వెళ్ళిపోతాడు…

రఘుకి అంతా అయోమయంగా ఉంటుంది.సురేష్ అతన్ని నిదానంగా అడుగుతాడు.అసలు ఏమైందో టెన్షన్ పడకుండా చెప్పు రఘు అని అడుగుతాడు సురేష్…

రఘు మొత్తం జరిగిన విషయం చెప్తాడు. రాత్రి సముద్రతీరంలో చూసిన రూపం గురించి మరియు లిఫ్ట్ ఇచ్చిన అమ్మాయి గురించి,చెల్లెలు గిరిజ చెప్పిన విషయం గురించి అన్ని వివరిస్తాడు రఘు. ఇవన్నీ విషయాలు విని ఆశ్చర్యంగా సురేష్ అవునా అని అంటాడు..

మురళీ గీతం – 8374885700

Scariest Telugu ghost stories
Most haunted places in Andhra Pradesh
Real ghost stories from Telangana
Telugu ghost stories that will make you shiver
Telugu ghost stories that will keep you up at night
Telugu ghost stories that will make you believe in the paranormal
Telugu ghost stories that will change your life
Telugu ghost stories that will make you laugh
Telugu ghost stories that will make you cry

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Top 5 Life Quotes in Telugu Most Inspiring Telugu Quotes Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images