Menu Close

Telugu Ghost Stories – Telugu Horror Stories – Part 1

Telugu Ghost Stories – Telugu Horror Stories – దెయ్యాల కథలు – హర్రర్ కథలు

రఘు ఒక సాప్ట్ వేర్ ఉద్యోగి.ఒక గొప్ప కంపెనీలో ఉద్యోగం దొరికినందుకు చాలా ఆనందంగా ఉన్నాడు. కానీ అది కొద్దికాలం మాత్రమే అని తనకు తర్వాత అర్థం అయింది.ఒక రోజు ఆఫీస్ లో తను చేసే వర్క్ కంప్లీట్ కాలేదని వాళ్ళ బాస్ అరిచాడు.అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ తననే చూశారు మరియు బాస్ కళ్ళలో చెరుగుతున్న నిప్పుల్ని కూడా.

రఘు తప్పదు అన్నట్టు బాస్ అనే ప్రతిమాటను పడ్డాడు. ఈ రోజు నా గ్రహచారం ఏమీ బాగోలేదు, ఎలాగైనా పని పూర్తయిన తరువాతనే ఇంటికి వెళ్ళాలి అని పట్టుపట్టి కంప్యూటర్ ముందు కూర్చుని పని చేస్తునే ఉంటాడు.అందరూ ఆఫీస్ టైమ్ అయిపోయిందని బయలుదేరుతారు.

“హే రఘు, నువ్వు రావా మామ” అని మిత్రుడు సురేష్ అడుగుతాడు.

“అరేయ్ ,నువ్వే విన్నావుగా..బాస్ నన్ను ఎన్ని మాటలు అన్నారో,ఎప్పుడు అలాంటి మాటలు నేను పడలేదు.మా అమ్మ నాన్న కూడా అలా నన్ను తిట్టి ఉండరు.మన బాస్ కి నా విలువ ఎంటో తెలియాలి. ఈ పని ఈ రోజు అయ్యేంత వరకు ఇక్కడి నుండి నేను కదలను.నువ్వు వెళ్ళు,నేను పని ముగించుకొని వస్తాను…” అని అంటాడు..ఉద్వేగంతో రఘు

“సరే బై మామ,జాగ్రత్త రా,నువ్వు ఒక్కడివే ఉన్నావు.ఎక్కువ సేపు ఉండకు.రాత్రి ఒంటరి ప్రయాణం మంచిది కాదు.మళ్లీ ఇక్కడి నుండి ఒక గంట జర్నీ , మీ సిటీకి వెళ్ళాలంటే అడవి పక్కనే ఉన్న స్మశానం దాటి పోవాలి.ముందే నువ్వు భయస్తుడివి..అందుకే చెబుతున్న… ప్రతిదీ ఊహించుకొని భయపడ్తావ్.. మరి ఆలోచించుకో…”అంటాడు సురేష్..

Scariest Telugu ghost stories Horros Stories in Telugu Bucket

Telugu Ghost Stories – Telugu Horror Stories

“భయం లేదు,ఏం లేదు.నేను చాలా ధైర్యవంతుడినే.దయ్యలకి ,భూతాలకు భయపడే వ్యక్తి కాను నేను..రఘు ఇక్కడ రఫ్ఫ్ ఆడిస్తడు”…అంటాడు రఘు.

“ఏమో…రఫ్ ఆడ్తావో..రాకుండా పోతావో..నాకైతే డౌటే.. మొన్న పార్టీలో మామూలుగా చిన్నపిల్ల దయ్యం మాస్క్ లో చూసి భయపడి,నాలుగు రోజులు ఇంటి నుండి బయటికే రాలేదు. దయ్యాల గురించి,ధైర్యం గురించి నువ్వు చెప్తుంటే నాకు నవ్వొస్తుంది.”

“అది గతం గతః… అప్పుడేదో తెలీక జరిగింది. నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకుండా ముందు ఇక్కడి నుండి వెళ్ళు…”

“సరేలే,నీ ఇష్టం…ఎవరి కర్మ వారిది..నీ మంచే కోరి చెప్తున్నా…బై..” అంటూ అక్కడి నుండి కదులుతాడు సురేష్.

రఘు బాస్ ఇచ్చిన పని పూర్తి చేసి,నేనేంటో నిరూపించుకోవాలి. ఈ ఫైల్ అతన్ని మొహం మీద కొట్టాలి అని అనుకుంటాడు.పని చేస్తాడు. సమయం 10 గంటలు అవుతుంది.పని ఇంకా కాలేదు చేస్తునే ఉన్నాడు….చేస్తునే ఉన్నాడు. పని ఇంకా 30 నిమిషాల్లో అవుతుంది..సమయం చూస్తే..11:00 అవుతుంది. “వామ్మో సమయం చాలా ఎక్కువ అయిపోతుంది. “త్వరగా ఫినిష్ చేయాలి అని ,పని పూర్తిగా చేసేస్తాడు.కంపెనీ కావాల్సిన ప్రోజెక్ట్ డాక్యుమెంట్ రెఢీ అయింది.

పని పూర్తి చేసుకుని రఘు , ఆఫీస్ కి తాళాలు వేసి ఆ తాళాలను, వాచ్మెన్ రంగయ్య కిచ్చి బైక్ పై ఇంటికి బయలుదేరుతాడు. సిటీ అంతా నిశిలో నిశ్శబ్దంగా ఉంది దానికి తోడు అమావాస్య మరింత చీకటిని ఇచ్చింది. వాళ్ళ అమ్మమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి రఘుకి. చిన్నప్పుడు ప్రతిరోజు ఇంటి బయట మంచం మీద పడుకుని, వాళ్ళ అమ్మమ్మ చెప్పిన పొడుపు కథలు ,దయ్యం కథలు గుర్తుకొచ్చాయి. అమావాస్య రోజు దెయ్యాలు తిరిగే రోజట.

ఆ రోజు దయ్యాలకు చాలా శక్తులు వస్తాయి. అవసరమైతే అది మనిషి రూపంలో కూడా వస్తాయి అని బామ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి, రఘుకి వెన్నులో వణుకు పుట్టింది. అయినా ఎంతో ధైర్యం కూడగట్టుకొని , తన బండి పై చల్లని గాలులలో ఝూమ్మని సాగుతున్నాడు. అలా కొద్ది దూరం వెళ్లేసరికి, సిటీ పొలిమేర వచ్చింది. ఆ సిటీ అనేది సముద్ర తీరానికి ఆనుకునే ఉంటుంది. రఘు ప్రశాంతమైన సముద్రంలో అలలు తీరాని చేరి, వాటిని హాయిగా చూస్తూ ముందుకు కదులుతున్నాడు. ఆ బీచ్ కి ఒక పెద్ద చరిత్ర ఉంది. ఆ బీచ్ లో ఎవరు రాత్రిపూట వెళ్లరు.

Scariest Telugu ghost stories Horror Stories in Telugu Bucket 3

ఎందుకంటే రాత్రిపూట ఎంతోమంది అని అక్కడ చంపేశారు మరియు అనుమానాస్పదంగా కూడా చాలా మంది చనిపోయారు. వాటికి కారణం అక్కడ తిరుగుతున్న దయ్యాలే అని ఒక ఆర్టికల్ కూడా ఈనాడు పత్రికలో వచ్చిన పెద్ద సంచలనం చేసింది. అవి కూడా అమావాస్యరోజు వరుసగా జరిగిన పది మంది మరణాలు,వాళ్లు కూడా పెళ్లికాని ఆడవాళ్ళు మాత్రమే.ఇలా ఎందుకు జరుగిందో ఆ మిస్టరీ ఇప్పటికీ వీడలేదు.అవన్నీ ఎదలో గుర్తు చేసుకుంటూ ముందుకు పోతున్నాడు.రఘును ఒక్కసారిగా భయం ఆవరించుకొంది.

మురళీ గీతం – 8374885700

Scariest Telugu ghost stories
Most haunted places in Andhra Pradesh
Real ghost stories from Telangana
Telugu ghost stories that will make you shiver
Telugu ghost stories that will keep you up at night
Telugu ghost stories that will make you believe in the paranormal
Telugu ghost stories that will change your life
Telugu ghost stories that will make you laugh
Telugu ghost stories that will make you cry

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Top 5 Life Quotes in Telugu Most Inspiring Telugu Quotes Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images