Menu Close

కిచెన్ లో బాగా ఉపయోగపడుతుంది.
కరెంట్ పోయినప్పుడు కూడా
4 గంటల పాటు ఆన్ లో వుండే లైట్.
అమెజాన్ లో ఆఫర్👇👇

Buy Now

Real Ghost Stories in Telugu – వొనుకు పుట్టించే కథ – 2005 లో

Real Ghost Stories in Telugu – దేవుడు వున్నాడు అనేది ఎంత నిజమో దెయ్యం వుంది అనేది కూడా అంటే నిజం.

దేవుడు ప్రస్తావన వచ్చినప్పుడల్లా దెయ్యం గురించి వింటూనే ఉన్నాం…. నమ్ముతూనే ఉన్నాం….ఆ వినికిడి, సారాంశం, నమ్మకపు దెయ్యాలు క్రూరమైనవి, విచక్షణ లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాయి, వాటికి దేవుడంటే భయం అని , కానీ….దైవ శక్తికి సైతం లొంగని ఆరుప్రేతాత్మలు ఆరేళ్లపాటు ఓ అమ్మాయి శరీరాన్ని ఆవహించి , అనుక్షణం నరకయాతన పెట్టాయి…..చివరికి క్రూరంగా చంపేశాయి……

Scariest Telugu ghost stories Horror Stories in Telugu Bucket 2

2005లో ప్రపంచాన్ని వనికించినది “ది ఎక్సార్సిజం ఆఫ్ ఎమిలీ రోజ్” అనే సినిమా కల్పిత కథ కాదు….1976లో ముగిసిన ఓ అమ్మాయి నిజ జీవిత వ్యథ….. జర్మనీ చరిత్రలో సంచలనంగా మిగిలిన అన్నెలీస్ మిషెల్ కన్నీటి గాథ నేటికీ ఓ మిస్టరీనే…..ఉన్నట్టుండి నవ్వడం ,క్రూరంగా చూడటం, ఎంతటి బలవంతుడినైనా ఒంటి చేత్తో నొక్కి పెట్టి కదలకుండా చేయగలగడం, పైకి లేచి చేతులు చాచి వికృతంగా ప్రవర్తించడం, తనని తాను బాధించుకోవడం, కాళ్లతో పాటు చేతులను ఉపయోగించి మెట్లు దిగడం, మనిషి మొత్తం రకరకాల మెలికలు తిరగడం, ఇదంతా నేటి హారర్ చిత్రాలు సాధారణంగా కనిపించే దృశ్యాలు ……

కానీ ,,దెయ్యం ఆవహిస్తే అలాగే ప్రవర్తిస్తారు. అని మొదటిసారిగా ప్రపంచానికి తెలిసింది మాత్రం అన్నెలీస్ నీ చూసినప్పుడే…..అన్నెలీస్ పశ్చిమ జర్మనీ,,, బవేరియాలోని లీబ్లిఫింగ్ లో 1952 సెప్టెంబర్ 21న జన్మించింది ….జోసెఫ్ ,అన్నా మిషెల్ ,ఆమె తల్లిదండ్రులు ,వాళ్లు రోమన్ కేథలిక్స్…. అన్నెకు ముగ్గురు సోదరీమణులు…. చిన్ననాటి నుంచి దైవభక్తి కలిగిన ఆమె తల్లిదండ్రులతో పాటు వారంలో రెండు సార్లు చర్చికి హాజరయ్యేది ….అలాంటి అన్నె ఉన్నట్టుండి ,దేవుణ్ణి ద్వేషించడం మొదలుపెట్టింది….

ఆమెకు 16 ఏళ్ల వయసులో అకస్మాత్తుగా ఆరోగ్యం దెబ్బతింది…. వ్యాధి లక్షణాలను బట్టి మూర్చగా ,మానసిక రుగ్మతగా గుర్తించిన వైద్యులు ,ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించారు …..ఆత్మలు కనిపిస్తున్నాయి అంటూ …భయపడసాగింది అన్నె…. అదంతా, వ్యాధి లక్షణాల్లో భాగమే అన్నారు వైద్యులు …. దేవున్ని ప్రార్థిస్తున్న సమయంలో, ఎవరో నువ్వు నరకంలో కుళ్ళిపోతున్నావు. అంటున్నారని చెప్పేది ఆ అమ్మాయి……. దాన్ని మానసిక సమస్యగానే పరిగణించారు…..

జీసస్ చిత్రాన్ని చూసిన, సిలువను చూసినా వింత వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది…. దైవ క్షేత్రాలులోకి వెళ్లాలంటే భయపడేది…. బలవంతంగా ప్రార్థన స్థలాలకు తీసుకొని వెళ్తే నేల కాలిపోతుంది… కాళ్లు మంటలు పుడుతున్నాయి అనేది…. అన్ని ప్రవర్తన చూసిన ఆమె స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, ఆమెకు ఆత్మ ఆవహించిందా??? అని అనుమానం బలపడింది….

అదే భయంతో అన్నె కు భూత వైద్యం అందించాలని, చర్చి ఫాదర్ ఎర్నస్ట్ అల్ట్ ను ఆశ్రయించారు …..అయితే అప్పటికే భూత వైద్యం పై కఠిన నియమాలు ఉండడంతో వెంటనే అనుమతి లభించలేదు…. చివరికి అన్నె స్వయంగా చర్చ ఫాదర్ కు లేఖ రాసింది ….నాకు ఆరోగ్యంగా జీవించాలని ఉంది…. నా గురించి ప్రార్థించండి…. జనుల కోసం బాధను అనుభవిస్తాను… కానీ ఈ నరకం చాలా భయానకంగా ఉంది….. తట్టుకోలేకపోతున్నాను…. అంటూ తన కన్నీటి గాథ ఫాదర్ కు వివరించింది……

అది చదివిన ఫాదర్ అల్ట్ మనసు కరిగి ,ఆ లేఖను బిషప్ జోసఫ్ స్తoగల్ కు చూపించారు …..దాంతో బిషప్ ,ప్రీస్ట్ ఆర్నాల్డ్ రేంజ్ కు భూతం వైద్యం చేసేందుకు అనుమతి ఇచ్చాడు…. కానీ ఇదంతా రహస్యంగా జరగాలని ఆదేశించారు….. 1975 సెప్టెంబర్ 24 నుంచి అన్నె కు మందులు ఇవ్వడం మానేసి ,భూతవైద్యం మొదలుపెట్టారు ….మొత్తం వైద్య పద్ధతిని, అన్నె ప్రవర్తనని వీడియోల రూపంలో ఆడియోల రూపంలో, రికార్డ్ చేశారు….

నేటికి వాటిని నెట్లో వినొచ్చు …చూడొచ్చు ….ఆమె మాట్లాడుతున్నప్పుడు, ఆమె గొంతులో వినిపించేవి ,అవి ప్రేతాత్మలని గుర్తించారు….. భూత వైద్యులు వాటి పేర్లు లుసీఫర్ ,కైన్ ,జుదాస్ ఇస్త్ క్రీయాట్ బెలీయల్ ,లెజియాన్ ,నెరో ,అని తేల్చారు….. కానీ వాటిని అన్నె శరీరంలో నుంచి వెళ్ళగొట్టడంలో విఫలమయ్యారు…. వారానికి రెండు మూడు రోజులు ,నాలుగు గంటల చొప్పున 67 సార్లు ఆమెకు భూతవైద్యాన్ని అందించారు…. అయినా ఫలితం లేదు….

ఆ నరకం భరించలేక అన్నె 1976 జూలై 1న 23వ ఏటా చనిపోయింది…… అప్పుడే ప్రపంచం అన్నె కథ వైపు తిరిగి చూసింది… ఈ మరణానికి బిషప్ ఆదేశాలతో చేసిన భూత వైద్యమే కారణమని ,పోలీసులు కేసు నమోదు చేశారు ….అందుకు సహకరించిన అన్నె తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు….. అన్నె సుమారు 10 నెలలు ఆహారం తినలేదని, పౌష్టికాహార లోపంతో ఆమె చనిపోయిందని, ఎముకలన్నీ చిద్రమై, మాంసం ముద్దలా మారిందని ,కేవలం 30 కేజీల బరువు ఉందని పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది….

Real Ghost Stories in Telugu

Scariest Telugu ghost stories Horror Stories in Telugu Bucket 3

ఆమెను ప్రేతాత్మలు ఆవహించాయని చెప్పి, ఎందుకు భూత వైద్యులు రికార్డ్ చేసిన వీడియో, ఆడియో టేపులను కోర్టు ముందు ఉంచడంతో అవే వారిని కాపాడాయి ….. అన్నె తన మూత్రాన్ని తానే తాగేదని ,తనని తాను గాయపరుచుకునేదని, సాక్షులు తెలిపారు…. తల్లిదండ్రులు తెచ్చిన ఆహారాన్ని విసిరి కొట్టడం, అన్నె వింతగా ప్రవర్తించడం, అన్నిటికీ సాక్షాలు ఉండడంతో కోర్టు నమ్మింది ….అందరినీ విడుదల చేసింది…. ప్రేతాత్మల కారణంగా చనిపోవడంతో పద్ధతి ప్రకారం అంత్యక్రియలు చేయలేకపోయాం….

మరోసారి అవకాశం ఇవ్వాలి, అని కోర్టుని కోరారు అన్నె తల్లిదండ్రులు….. కోర్టు అంగీకారంతో రెండేళ్ల తర్వాత ఆమె అస్థికలను బయటకు తీసి మరో నాణ్యమైన శివపేటికలో పెట్టి పూడిచి పెట్టారు….. అన్నె అనారోగ్యంతో బాధపడుతుంటే ,భూత వైద్యం చేసి తిండి పెట్టకుండా చంపేశారని,,, తల్లిదండ్రుల ఒత్తిడి, కఠిన నియమాలు, చాదస్తం, కారణంగానే అన్నె పిచ్చిది అయిందని పలు విమర్శలు వచ్చాయి…….. సరిగ్గా 37 ఏళ్ల తర్వాత 2013 జూన్ 6న అన్నెలీస్ మిషెన్ నివాసం ఉన్న ఇల్లు అగ్నికి ఆహుతి అయింది….

ఎవరూ లేని ఇంట్లో మంటలు ఎలా వ్యాపించాయి …అనేది మరో మిస్టరీ….. పైగా ఆ మంటల్లో తమకు అన్నె కనిపించిందని ,స్థానికులు ఫోటోలు, వీడియోలు, షేర్ చేయడం ,సంచలనమైంది….. దాంతో ఈ కథ మరోసారి తెరమీదకి వచ్చింది…..సంఖ్యాశాస్త్రం ప్రకారం ఆరవ నెల 6వ తేదీ 2013 లోని అంకెలు కలిపితే ,ఆరు, కాబట్టి 666 అనే నంబర్ దెయ్యాల సంఖ్య అంటూ… మీడియా కూడా అప్పట్లో ప్రచారం చేసింది ….దాంతో అగ్ని ప్రమాదానికి కారణం ప్రీతాత్మలేనని కొందరు భయాందోళనకు గురి అయ్యారు….. మరికొందరు పొట్టి పారేశారు….

Scariest Telugu ghost stories
Most haunted places in Andhra Pradesh
Real ghost stories from Telangana
Telugu ghost stories that will make you shiver
Telugu ghost stories that will keep you up at night
Telugu ghost stories that will make you believe in the paranormal
Telugu ghost stories that will change your life
Telugu ghost stories that will make you laugh
Telugu ghost stories that will make you cry

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Like and Share
+1
1
+1
0
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks