ఓ పాతికేళ్ళ అందమైన అమ్మాయి ఆ గది నుండి బయటకి వచ్చింది - Telugu Funny Stories - Telugu Bucket
Menu Close

ఓ పాతికేళ్ళ అందమైన అమ్మాయి ఆ గది నుండి బయటకి వచ్చింది – Telugu Funny Stories

ఓ పాతికేళ్ళ అందమైన అమ్మాయి ఆ గది నుండి బయటకి వచ్చింది – Telugu Funny Stories

ఒక పల్లెటూరి పెద్ద మనిషి తన కొడుకుతో పాటు పట్టణంలోని ఒక షాపింగ్ మాల్ చూడడానికి వెళ్ళాడు. ఆ మాల్ లో కనిపించిన ప్రతిదీ వాళ్ళకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ముఖ్యంగా రెండు వెండి తలుపులు ఒకదానికొకటి విచ్చుకుని, మళ్ళీ మూసుకోవడం వాళ్ళను అబ్బుర పరిచింది.

తండ్రి కొడుకుతో, “ఒరేయ్ ! నా జీవితంలో ఇటువంటిది ఎప్పుడూ చూడలేదు, అదేమిటో నాకు తెలీదురా !” అదే సమయంలో ఒక వృద్ధ మహిళ చేతికర్ర సహాయంతో దాని దగ్గరకు వెళ్ళి పక్కనున్న బటన్ నొక్కింది. ఆ వెండి తలుపులు విచ్చుకున్నాయి. ఆ మహిళ నెమ్మదిగా లోపలి గదిలోకి వెళ్ళింది. తలుపులు మూసుకున్నాయి. ఆ తండ్రి, కొడుకులు ఆ తలుపులపైన వెలుగుతున్న లైట్లు, అంకెలు 1,2,3,4 అంటూ మారడం ;

అవే సంఖ్యలు మళ్ళీ 4,3,2,1 అంటూ తగ్గుతూ రావడం కూడా ఆశ్చర్యం కలిగించింది. ఇంతలో ఆ తలుపులు తెరుచుకుని ఓ పాతికేళ్ళ అందమైన అమ్మాయి ఆ గది నుండి బయటకి వచ్చింది. తండ్రి ఆనందం పట్టలేక కొడుకుతో అన్నాడు, “ఒరేయ్! ఒరేయ్! వెంటనే పోయి మీ అమ్మను తీసుకురా! “

సేకరణ – V V S Prasad

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published.

Subscribe for latest updates

Loading