Life of a Middle Class Family in the Bedroom in Telugu
సగటు కుటుంబ పడక గది దాంపత్య సన్నివేశాలు – పెళ్లి అయిన రోజు నుండి 75 సంవత్సరాల అంతిమ నిద్ర వచ్చే వరకు క్లుప్తంగా
మొదటి అంకం:
సమయం : రాత్రి 10 గంటలు
ప్రదేశం : మధ్యతరగతి పడక గది
వయసు. : భర్త : 27 ఏళ్ళు, భార్య 25ఏళ్ళు.
భర్త : అబ్బా రాత్రి 10 అవుతుంది,
ఇంకా ఎంత సేపు ఎదురు చూడాలి నీకోసం ,
తొందరగా రావచ్చుగా గదిలోకి,
ఒక్కడినే ఉండి ఏంచేయాలో తోచక చేతులు, దిండు నలుపుతున్నా….
భార్య : నాకూ రావాలనే ఉంది…కానీ, మీ అమ్మ వదిలితేగా,
ఏదో ఒక పనో, మాటలో చెప్తూ ఉంది,
అవన్నీ అయ్యేటప్పటికి ఈసమయం అయింది.

రెండవ అంకం:
వయసు: 37, 35
సమయం : రాత్రి 10
ప్రదేశం : అదే పడకగది
భర్త : పెద్దోడితోటి బాధ లేదు, వాడు మా అమ్మ పక్కన పడుకుంటున్నాడు,
బాధ అంతా ఈ చిన్నోడి తోటే, నాయనమ్మ పక్కన పడుకోమంటే పడుకోడు,
మనం మంచి మూడ్ లో ఉన్నప్పుడు లేచి నాకు బాత్రూం వస్తుంది,
మంచి నీళ్ళు కావాలి, ఆకలి ఐతుంది అంటాడు….
భార్య : ఏం చేస్తాం మనమే సర్దుకుపోవాలి, వాడు చిన్నోడు కదా అంతే మరి…

మూడవ అంకం:
వయసు : 47,45
సమయం : రాత్రి 10 గంటలు
ప్రదేశం : అదే పడక గది
భర్త : గ్యాస్ సిలిండర్ ఆఫ్ చేశావా,
పాలు తోడు పెట్టావా..
భార్య :ఆ ఆ అన్నీ చేశా, మీరు కళ్ళజోడు, ఫోన్తె చ్చుకున్నారా?
భర్త : ఇక పడుకో అని కుడి పక్కకు తిరిగి పడుకున్నాడు.
భార్య : సరే అని ఎడమ పక్కకు తిరిగి పడుకుంది.

నాలుగవ అంకం:
వయసు. : 57, 55
సమయం : రాత్రి 10
*ఎప్పటి లాగేప్రదేశము : అదే పాత పడక గది
భర్త : బి.పి, షుగరు టాబ్లెట్ లు వేసుకున్నవా,
పిల్లలు పండగకి వస్తామన్నారా?
భార్య : నేను, వేసుకున్నా, మీరు వేసుకున్నారా,
పెద్దోడికి సెలవు దొరకలేదట, చిన్నోడు ఆఫీసులో తీరిక లేకుండా ఉన్నాడట కుదరదన్నాడు.
భర్త : సరే ఏం చేస్తాం , పడుకో, అన్నట్టు పాలు తోడు పెట్టావా?
భార్య : తోడు పెట్టాను, మీరు ఫోను, కళ్లజోడు దగ్గర పెట్టుకున్నారా?
ఇద్దరు చెరో వైపు తిరిగి పడుకున్నారు

అయిదవ అంకం:
వయసు : 67, 65
సమయం : రాత్రి 10 గంటలు
ప్రదేశం : అదే పాత పడకగది
భర్త : బి.పి, షుగరు తో పాటు మోకాళ్ళ నొప్పుల మందు కూడా వేసుకున్నవా….
భార్య : నేను వేసుకున్నా, మీవి కూడా పట్టుకొచ్చా వేసుకోండి…
భర్త : సరే ఇటియ్యి, వేసుకుంటా, అవునూ, అమెరికా నుండి మనవళ్లు, మనవరాళ్లు ఫోన్ చేసారా
ఈమధ్య , ఎప్పుడయినా వస్తామంటున్నార, పుట్టి పదేళ్లు వస్తున్నా ఇంతవరకు ఒక్కసారి కూడా రాలేదు,
ఫోన్లో వీడియో కాల్ లో చూడటమే తప్ప నిజంగా ఒక్కసారి చూసింది లేదు.
భార్య : నిన్న చిన్నవాడు, పెద్దవాడు ఇద్దరి కుటుంబాలు ఎదో హోటల్ లో కలుసుకొని
అక్కడినుండి ఇద్దరు వాళ్ళ , వాళ్ళ పిల్లలతో ఫోన్ లో మాట్లాడించారు.
మంచి డాక్టర్ కి చూపించుకోండి, మందులు వాడండి
ఎన్ని డబ్బులు అయినా ఫరవాలేదు పంపిస్తాము అన్నారు,
వాళ్ళకి ఇంకో 2 ఏళ్ల దాకా రావటానికి కుదరదట,
సరే పొద్దు పోయింది పడుకోండి..
భర్త : వాళ్ళు రారు, మనం వాళ్ళని, వాళ్ళ పిల్లలని చూడలేము, ఇక మన పరిస్థితి ఇంతే,
పడుకుందామంటే మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళ మంటలతో రాత్రి ఒంటిగంట దాకా నిద్ర పట్టదు,
నిద్ర పట్టకపోతే పిల్లలు గుర్తొచ్చి మనసంతా దిగులుగా ఉంటుంది,
అసలు వాళ్ళని ఇద్దరిని అమెరికా పంపి తప్పు చేసామేమో,
ఒక్కడినన్న ఇక్కడ ఉండమనాల్సింది, సరే లే ఇప్పుడు అనుకోని ఏంచేస్తాం,
నీకన్నా నిద్ర పడుతున్నదా?
భార్య : నాది మీ పరిస్థితే నాకూ ఒంటిగంట తరువాతే నిద్ర,
కళ్ళు తెరిచినా, మూసినా పిల్లలే కళ్ళలో మెదులుతున్నారు,
ఏంచేస్తాం అంతా మన ఖర్మ ,
సరే నిద్ర రాకపోయినా అట్లాగే కళ్ళు మూసుకొని పడుకుందాం ఎప్పటికో నిద్ర పట్టక పోదు.
ఇద్దరూ బలవంతాన కళ్ళు మూసుకున్నారు.

చివరి అంకం:
వయసు : 75
సమయం : రాత్రి 11 గంటలు
ప్రదేశం : ముసలి కంపు కొట్టే పాత పడక గదిలో, కాళ్ళు సరిగా లేని కుంటి మంచం.
భార్య : ఆయన పోయి నెల రోజులు అయింది,
ఇంతవరకు ఒక్క కొడుకు కానీ, ఒక్క కోడలు కానీ, మనవళ్లు, మనవరాళ్లు ఎవరూ వచ్చిన పాపాన లేదు,
కన్నతండ్రి చనిపోతే అంతిమ సంస్కారాలు కూడా చేయలేని, తీరిక లేని కొడుకులు,
సమయానికి మా తమ్ముడు, వాడి కొడుకు రాబట్టి కనీసం స్మశాన కార్యక్రమాలు అయినా పూర్తి అయినయి.
ఇక నా పరిస్థితి ఏమి కానుందో…. ఎప్పటికయినా నా పిల్లలు వస్తారో.. రారో అనుకుంటూ
కళ్ళు మూసుకుంది, అంతే ఆ కళ్ళు మళ్ళీ తెరుచుకోలేదు,
జీవితంలో ఆఖరు పడకగది సన్నివేశం ముగిసింది
మర్నాడు పనిమనిషి వచ్చి తలుపు ఎంత సేపు కొట్టినా తలుపు తెరుచుకోలేదు,
అనుమానం వచ్చి చుట్టుపక్కల వాళ్ళని పిలిచి తలుపు పగలగొట్టి చూస్తే
“భార్య” శాశ్వత నిద్రలోకి పోయింది…
చుట్టుపక్కల వాళ్ళు ఆమె తమ్ముడి నెంబర్ పట్టుకొని ఫోన్ చేస్తే ఆయన వచ్చి
అంతిమ సంస్కారం చేసి వెళ్ళిపోయాడు.
మధ్యతరగతి జీవిత నాటకరంగంలో సగటు మనిషి పడక గది సన్నివేశాలు…
మధ్య తరగతి దాంపత్య ప్రతిఫలాల నిలువుటద్దాలు… ఇవే

ఇదే సగటు మద్య తరగతి కుటుంబం యుక్క జీవితం, ఆశలు, ఆవేదనలు, నిస్పృహలు, నిస్సహాయత, చివరి వరకు తోడుండేది, కలిసుండేది భార్య – భర్తలు మాత్రమే.
ఈ పోస్ట్ మీకు నచ్చితే తప్పకుండా షేర్ చెయ్యండి. మీ అభిప్రాయాన్ని ఒక కామెంట్ రూపంలో తెలియ చేయండి. ధన్యవాదాలు.
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com
మద్యతరగతి కుటుంబంలో పడక గది అంకముల వీశేష్షాణ అద్దం పట్టినట్టు వుంది.
ధన్యవాదాలు🙏.
మీ అభిప్రాయానికి ధన్యవాదాలు.
మరిన్ని కథలు చదివి ఆనందించగలరు.
https://telugubucket.com/category/telugu-stories/
neatly and sincerely brought out the situations. its great
thank you sir
నిజంగా చాల బాగుంది
thank you so much mam
సాగటు మనిషికి కావలసింది జీవితాంతం తోడు, కానీ ఈ కాలం వాళ్లకి ఏమి అర్థమౌతుందో ఏమో కానీ, పై చెప్పినవి మధ్యతరగతి జీవితం, బతికున్నవారికి.. ఈ ప్రేమ శాశ్వతం, దేవుడి దృష్టిలో ఈ ప్రేమ మరణం lenidhi.