Telugu Funny Stories
ముంబైలో ఒక హేర్ కటింగ్ సెలూన్లో ఓ మంచి బార్బర్ ఉండేవాడు. ఓ పూలమ్ముకొనే వ్యక్తి ఆ హేర్ కటింగ్ సెలూన్ కి వెళ్లి కటింగ్ చేయించుకొని డబ్బులివ్వబోయాడు. “మీ దగ్గర నేను డబ్బు తీసుకోను. నేను సమాజసేవ చేస్తున్నాను” అన్నాడు మా మంచి బార్బర్. పూలమ్ముకునే వ్యక్తి సంతోషంగా వెళ్లి పోయాడు.
మర్నాడు సెలూన్ తెరిచినప్పుడు అక్కడ ఒక గ్రీటింగ్స్ కార్డు, ఒక బొకే కనిపించాయి. అలాగే ఇంకొక రోజు ఒక స్వీట్ షాప్ యజమాని కటింగ్ చేయించుకొని పోబోతూ డబ్బివ్వబోతే, ఆ బార్బర్ తీసుకోకుండా, “ఇదంతా సమాజసేవ కోసం చేస్తున్నాను. డబ్బులు ఒద్దండీ!” అన్నాడు.
స్వీట్ షాప్ యజమాని ఆనందంగా వెళ్లి పోయాడు. పక్కరోజు షాప్ ముందు ఒక గ్రీటింగ్ కార్డు, స్వీట్ పాకెట్ ఉన్నాయి. ఇంకొక రోజు ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హేర్ కటింగ్ కు వచ్చి, డబ్బులివ్వబోతే, “ఇది సమాజ సేవ కోసం చేస్తున్నాను. డబ్బులు ఒద్దండీ” అన్నాడు ఆ బార్బర్.
పక్క రోజు పొద్దున్నే షాప్ ముందు ఒక డజను మంది ఇంజనీర్లు హేర్ కటింగ్ చేయించుకోవడానికి వచ్చారు. వాళ్ళ చేతుల్లో, “ఇక్కడ ఉచితంగా హేర్ కటింగ్ చేస్తున్నారు.” అని టైప్ చేసిన e-మెయిల్ ప్రింట్లు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు.
సేకరణ – V V S Prasad
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.