50 Teachers Day Best Telugu Quotes - Teachers Day Wishes in Telugu - Telugu Bucket
Menu Close

50 Teachers Day Best Telugu Quotes – Teachers Day Wishes in Telugu

50 Teachers Day Best Telugu Quotes – Teachers Day Wishes in Telugu

Teachers Day Best Telugu Quotes - Teachers Day Wishes in Telugu

విద్యార్థులను తీర్చిదిద్దే క్రమంలో వెలకట్టలేని త్యాగాలు చేసిన ఉపాధ్యాయులందరికీ హ్యాపీ టీచర్స్ డే.

మనలోని శక్తిని చూసేది, దానికి సానబట్టేది, అందమైన భవిష్యత్తు దిశగా నడిపించేది ఉపాధ్యాయుడే. గురువు అనే నిచ్చెనతోనే మనం ఉన్నత స్థాయికి చేరుకుంటాం.

ఈ ప్రపంచంలో ఓ రాయిని వజ్రంలా మార్చగలిగే శక్తి ఉన్న ఏకైక వ్యక్తి ఉపాధ్యాయుడు.

సైలెన్స్. పుస్తకాలు తీసి బుద్ధిగా చదువుకోండి. హ్యాపీ టీచర్స్ డే.

Teachers Day Best Telugu Quotes - Teachers Day Wishes in Telugu

గొప్ప విజయాలు సాధించడానికి పట్టుదల ఎంత అవసరమో.. లక్ష్యాన్ని చేరుకునే మార్గం నుంచి పక్కదారి పట్టకుండా చూసే గురువు కూడా అంతే అవసరం.

వాస్తవానికి తల్లిదండ్రులకంటే గురువులు మరింత పూజనీయులు. ఎందుకంటే అమ్మానాన్న మనకు జన్మనిస్తే.. ఉపాధ్యాయుడు ఆ జన్మకు సార్థకత చేకూరుస్తారు.

రైతు, జవాన్ తర్వాత దేశానికి నిజమైన సేవ చేసేది ఉపాధ్యాయులే. ఎందుకంటే భావి భారత పౌరులను తీర్చిదిద్దేది.. దేశాన్ని అభివృద్ధి బాట పట్టించేది వారే.

గురువు విద్యతో పాటు విచక్షణ కూడా నేర్పిస్తాడు. ఆ విచక్షణే మనల్ని మంచి వైపు నడిపిస్తుంది. ఈ విచక్షణ పాఠ్యపుస్తకాల్లో ఉండదు. ఉపాధ్యాయుడి గుండెల్లో ఉంటుంది. మన:పూర్వకంగా పాఠాలు చెప్పే ప్రతి ఉపాధ్యాయుడికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

మంచి టీచర్లు విద్యార్థులకు విద్యను బోధిస్తే.. ఉత్తమ ఉపాధ్యాయులు మాత్రం విద్యార్థులకు విద్యతో పాటు మంచి గుణం అలవడేలా చూస్తారు.

మనమేంటో మనకే తెలియని క్షణంలోనూ మన భవిష్యత్తును అంచనా వేయగలిగే శక్తి ఒక్క ఉపాధ్యాయుడికి మాత్రమే ఉంది.

మీ శక్తిని, సమయాన్ని మా కోసం ఖర్చు చేసినందుకు, మమ్మల్ని తీర్చిదిద్దినందుకు ధన్యవాదాలు. హ్యపీ టీచర్స్ డే.

డియర్ టీచర్ మీరు నాకు పాఠాలు మాత్రమే చెప్పలేదు. నా కాళ్ల మీద నేను నిలబడేలా చేశారు. నన్ను వ్యక్తిగా తీర్చిదిద్దారు. దానికి మీకెప్పటికీ రుణపడే ఉంటాను. థాంక్యూ టీచర్.

టీచర్.. మీ స్ఫూర్తిదాయకమైన మాటలే నా జీవితాన్ని మార్చేశాయి. నన్ను అనునిత్యం ఇన్స్పైర్ చేస్తూనే ఉంటున్నందుకు థ్యాంక్స్.

 • గురువు కొవ్వొత్తి లాంటి వారు. తను కాలిపోతున్నా సరే.. ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపుతూనే ఉంటారు.
 • ఉపాధ్యాయుడు నాటిన జ్ఞానమనే విత్తనాలు ఎన్నేళ్లయినా ఫలాలు ఇస్తూనే ఉంటాయి.
 • విద్యార్థిలో జ్ఞానమనే జ్యోతిని వెలిగించి అందమైన జీవితానికి వెలుగు బాట చూపించేవాడే ఉపాధ్యాయుడు.
 • ‘చిన్న విజయానికే సంతృప్తి పడిపోవద్దు. నువ్వు సాధించాల్సిన లక్ష్యం చాలా పెద్దది.’ ఉపాధ్యాయుడు చెప్పే ఈ మాట మనల్ని ఎప్పుడూ ఉన్నత లక్ష్యాల దిశగా నడిపిస్తుంది.
Teachers Day Best Telugu Quotes - Teachers Day Wishes in Telugu
School girl writing on the board — Image by © India Picture/Corbis
 • ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉత్తమమైన దారి చూపిస్తారు. ఆ దారిలో తన శిష్యులను నడిపించడం కోసం తిడతారు. మరీ మొండికేస్తే కొడతారు. అది తన దగ్గర చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు కోసమే.
 • మీ జీవితంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి మీకు ఏదో ఒక పాఠం నేర్పించి వెళతారు. వారు కూడా టీచర్లే. అలాంటి టీచర్లందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
 • ఈ ప్రపంచంలో మనకి మొదటి గురువులు తల్లిదండ్రులే. వారే మనల్ని తీసుకెళ్లి ఉపాధ్యాయుడి చేతిలో పెడతారు. కాబట్టి టీచర్లతో పాటు తల్లిదండ్రులకు కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు చెప్పడం మరిచిపోవద్దు.

 • ఈ ప్రపంచం ఓ విశ్వవిద్యాలయం. ఇందులో మనకు తారసపడే ప్రతి వ్యక్తి మనకు ఓ ఉపాధ్యాయుడే. కాబట్టి మీరు ప్రతి రోజూ చదువుకోవడానికి వెళుతున్నామనే విషయం మాత్రం మరచిపోవద్ధు.
 • ఉత్తమ ఉపాధ్యాయుడు గతాన్ని మనముందుంచుతారు. ప్రస్తుతాన్ని విడమరచి చెబుతారు. భవిష్యత్తునే ఎలా తీర్చిదిద్దుకోవాలో నేర్పిస్తారు.
 • అతిగా మాట్లాడేవారిని చూసి మౌనంగా ఉండటం నేర్చుకున్నా. జాలి లేని వారిని చూసి దయతో ఉండటం నేర్చుకున్నా. బాధపడేవారిని చూసి బాధపడకుండా ఉండటం నేర్చుకున్నా. ధైర్యంగా, స్థిరంగా ఉండటం నేర్పిన వీరందరూ నాకు టీచర్లే.
Teachers Day Best Telugu Quotes - Teachers Day Wishes in Telugu
 • మీ లక్ష్యాన్ని మీరే ఎంచుకునేలా చేయడంతో పాటు.. ఆ లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో మిమ్మల్ని నడిపించేవారే గొప్ప టీచర్.
 • గొప్ప ఉపాధ్యాయులు ఎలా ఉంటారంటే.. పిల్లలందరితోనూ కలసిపోతారు. వారిని గౌరవిస్తారు. ప్రతి విద్యార్థిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉందని నమ్ముతారు. ఆ ప్రత్యేకతను బయటకు తీయడానికి ప్రయత్నిస్తారు. ప్రోత్సహిస్తారు. నేర్పిస్తారు. కొన్ని సార్లు ప్రేమగా, మరికొన్నిసార్లు కఠినంగా ఉంటారు. ఇదంతా తన శిష్యులు గెలుపు గుర్రమెక్కడానికే చేస్తారు.
 • ఉపాధ్యాయుడు తన విద్యార్థి విషయంలో సంతృప్తిగా ఉండేదెప్పుడో తెలుసా? జీవితంలో ముందుకు వెళ్లే విషయంలో తన శిష్యుడికి తన అవసరం ఇక లేదనుకున్నప్పుడు.

 • ఉపాధ్యాయ వృత్తి ఎంత గొప్పదంటే.. ఏ రంగానికి చెందిన నిపుణులైనా సరే ఉపాధ్యాయుల దగ్గరే తమ నైపుణ్యాలకు సానపెట్టుకుని రావాలి.
 • విద్యార్థులపై టీచర్ల ప్రభావం ఎంత కాలం వరకు ఉంటుంది. వారికి చదువు చెప్పినంత కాలమా? వారిని గుర్తుంచుకున్నంత కాలమా? ఈ రెండూ కాదు. జీవిత కాలం ఉంటుంది.
 • ఏదైనా సాధించాలనే తపన ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? మిమ్మల్ని మీ తల్లిదండ్రులు తీసుకెళ్లి టీచర్ చేతిలో పెట్టినప్పుడు. ఆ క్షణం నుంచే మీ లక్ష్యం దిశగా అడుగులు వేయడం ప్రారంభిస్తాం.

 • తరగతిలో ఉన్న విద్యార్థిని మీ టీచర్ గురించి కథ రాయమని చెబితే.. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా రాస్తారు. ఆ కథలో హీరో మాత్రం ఉపాధ్యాయుడే.
 • మన జీవితంలో కీలకమైన పాత్ర పోషించేది ఉపాధ్యాయులే. వారిపై జోకులు వేయద్దు.
 • ప్రతి ఏడాది టీచర్స్ డే వచ్చేసరికి నా టీచర్లందరి దగ్గరకు వెళ్లాలనిపిస్తుంది. మళ్లీ చదువుకోవాలనిపిస్తుంది. నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు.
 • గురువు అనే వ్యక్తే లేకపోతే.. ఈ ప్రపంచం అంతా అంధకారంలోనే మునిగిపోయి ఉండేదేమో. జ్ఞానమనే జ్యోతిని వెలిగించి ఈ ప్రపంచానికి వెలుగు ప్రసాదించింది ఉపాధ్యాయుడే. అలాంటి గొప్ప గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

Teachers Day Best Telugu Quotes, Teachers Day Wishes in Telugu, Teachers Day Greetings in Telugu, టీచర్స్ డే కోట్స్, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

Like and Share
+1
1
+1
0
+1
0
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published.

Subscribe for latest updates

Loading