తాను నేను… మోయిలు మిన్ను
తాను నేను… కలువ కొలను
తాను నేను… పైరు చేను
తాను నేను… వేరు మాను
శశి తానైతే నిశినే నేను… కుసుమం తావి తాను నేను
వెలుగు దివ్వె… తెలుగు తీపి
తాను నేను… మనసు మేను
దారి నేను తీరం తాను… దారం నేను హారం తాను
దాహం నేను నీరం తాను… కావ్యం నేను సారం తాను
నేను తాను రెప్ప కన్ను… వేరైపోని పుడమి మన్ను
నేను తాను రెప్ప కన్ను… వేరైపొని పుడమీ మన్ను
తాను నేను మోయిలు మిన్ను… తాను నేను కలువ కొలను
తాను నేను గానం గమకం… తాను నేను ప్రాయం తమకం
తాను నేను… మోయిలు మిన్ను
తాను నేను… కలువ కొలను
తాను నేను… పైరు చేను
తాను నేను… వేరు మాను
శశి తానైతే నిశినే నేను… కుసుమం తావి తాను నేను
వెలుగు దివ్వె… తెలుగు తీపి
తాను నేను… మనసు మేను
మనసూ మేను… మనసూ మేనూ
మనసూ మేనూ…
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.