నరసింహా… లక్ష్మీ నరసింహా…
శ్రీకర శుభకర ప్రనవ స్వరూప లక్ష్మీ నరసింహా…
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహా… ||2||
నీవే శరణమయ్యా… ఓ యాదగిరీ నరసింహా…
శ్రీకర శుభకర ప్రనవ స్వరూప లక్ష్మీ నరసింహా…
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహా…
పురాణ యుగమున ఈ గిరి పైనే… తపమొనరించేను యాదఋషి
ధరాతలమ్మున అతని పేరుతో… అయినది ఈ గిరి యాదగిరి…
ఈ గుహలో వెలసెను… ప్రళయ మహోజ్వల జ్వాలా నరసింహుడు…
భక్తా అభీష్టములన్నియు తీర్చే… లక్ష్మీ నరసింహుడు…
సుఖశాంతులను చేకూర్చు శుభయోగ నరసిహుడు…
ఆ ఆఆ ఆ ఆఆ… ఆ ఆఆ
సుఖశాంతులను చేకుర్చు శుభయోగ నరసిహుడు…
నమో నమః నమో నమః
నమస్కరిచెను నాలుగు దిక్కులు… నఖముల వెలుగుకు మ్రొక్కెను చుక్కలు
గోపుర రూపము దాల్చినది… ఆ దివ్యసుదర్శన చక్రము
మంగళ హారతులిచ్చినది మహా కాలచక్రము…
శ్రీకర శుభకర ప్రనవ స్వరూప లక్ష్మీ నరసింహా…
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహా…
ఈ స్వామి పాదమును బ్రహ్మ కడుగగా… విష్ణు కుండమే ప్రభవించే
ఇట స్నానము చేసిన… జన్మదన్యమే కర్మ వియోచనమే…
ఇట విశ్వవైద్యుడై స్వామియె.. చేయును రోగ నివారణమే..
చిత్తము నేపము సత్వము గానపు బెత్తము తాకగనే…
భోగభాగ్యాలు దీర్ఘాయు ఒసగేను గిరిప్రదక్షిణం…
ఆ ఆఆ ఆ ఆఆ… ఆ ఆఆ
భోగభాగ్యాలు దీర్ఘాయు ఒసగేను గిరిప్రదక్షిణం…
నమో నమః నమో నమః
క్షేత్ర పాలకుడు ఆంజనేయుడే… సాక్షి అవును ఈ మహిమలకు…
కలియుగ దైవము యాదగిరి శ్రీనరసింహుడి దర్శనం
కోరిన కోర్కెలు తీర్చేటి… మహా కల్పవృక్షము…
శ్రీకర శుభకర ప్రనవ స్వరూప లక్ష్మీ నరసింహా…
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహా…
భూతప్రేత పిశాచ రాక్షసుల… ప్రారద్రోలు నీ నామమే…
క్షుద్రశక్తులను బాణామతులను… దద్ఘమమచ్చును స్మరణమే
ప్రపంచ బాల ప్రహ్లాదునియే… హిరణ్యకశిపుడు హింసింపగనే…
సర్వకాలముల సర్వావస్థల సర్వ దిక్కులకు వ్యాపించి…
సంరక్షింపుము నరసింహా… అనుగ్రహింపుము నరసింహా…
యాదగిరీశా నరసింహా… ఓం ఓం ఓం ఓం…
శ్రీకర శుభకర ప్రనవ స్వరూప లక్ష్మీ నరసింహా…
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహా…
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.