Menu Close

కరెంట్ పోయినప్పుడు దాదాపు
4 గంటలు ఆన్లో వుండే బల్బ్ Buy Now👇

Ghallu Ghallumani Lyrics in Telugu – Indra – ఘల్లు ఘల్లు మని సిరి మువ్వల్లే చినుకే చేరగా లిరిక్స్

Ghallu Ghallumani Lyrics in Telugu – Indra – ఘల్లు ఘల్లు మని సిరి మువ్వల్లే చినుకే చేరగా లిరిక్స్

మా కంటెంట్ మీకు నచ్చినట్లైతే
మా యూట్యూబ్ చానెల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండీ
SUBSCRIBE TO OUR YOUTUBE CHANNEL

ఘల్లు ఘల్లు మని సిరి మువ్వల్లే చినుకే చేరగా…
ఝల్లు ఝల్లు మని పులకింతల్లో పుడమే పాడగా…
ఘల్లు ఘల్లు మని సిరి మువ్వల్లే చినుకే చేరగా…
ఝల్లు ఝల్లు మని పులకింతల్లో పుడమే పాడగా…

హరివిల్లు ఎత్తి కరిమబ్బు వాన బాణాలే వేయనీ
నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరనీ…

జడివాన జాడతో ఈ వేళ… జన జీవితాలు చిగురించేలా
రాళ్ళ సీమలో ఈ వేళ… రతనాల ధారలే కురిసేలా…
జడివాన జాడతో ఈ వేళ… జన జీవితాలు చిగురించేలా
రాళ్ళ సీమలో ఈ వేళ… రతనాల ధారలే కురిసేలా…

ఘల్లు ఘల్లు మని… సిరి మువ్వల్లే చినుకే చేరగా
ఝల్లు ఝల్లు మని… పులకింతల్లో పుడమే పాడగా

రాకాసులు ఇక లేరని… ఆకాశానికి చెప్పనీ
ఈ రక్తాక్షర లేఖని… ఇపుడే పంపనీ
అన్నెం పున్నెం ఎరగని… మా సీమకి రారమ్మని
ఆహ్వానం అందించనీ… మెరిసే చూపునీ…

తొలిగింది ముప్పు అని… నీలి మబ్బు మనసారా నవ్వనీ
చిరుజల్లు ముంపు… మన ముంగిలంతా ముత్యాలే చల్లనీ

ఆ శాసు గంధమై నేలంతా… సంక్రాంతి గీతమే పాడేలా
శాంతి మంత్రమై గాలంతా… దిశలన్నీ అల్లనీ ఈ వేళ

జడివాన జాడతో ఈ వేళ… జన జీవితాలు చిగురించేలా
రాళ్ళ సీమలో ఈ వేళ… రతనాల ధారలే కురిసేలా

భువిపై ఇంద్రుడు పిలిచెరా… వరుణా వరదై పలకరా
ఆకాశాన్నే ఇల దించరా… కురిసే వానగా
మారని యాతన తీర్చగా… మా తల రాతలు మార్చగా
ఈ జలయజ్ఞము సాక్షిగా… తలనే వంచరా…

మహారాజు కాలి సమిదల్లె మారి… నిలువెల్లా వెలగెరా
భోగాన్ని విడిచీ త్యాగాన్ని వలచి… తాపసిగా నిలిచెరా

జనక్షేమమే తన సంకల్పంగా… తన ఊపిరే హోమజ్వాలంగా
స్వర్గాన్నే శాసించెనురా… అమృతములు ఆహ్వానించెనురా

జడివాన జాడతో ఈ వేళ… జన జీవితాలు చిగురించేలా
రాళ్ళ సీమలో ఈ వేళ… రతనాల ధారలే కురిసేలా

ఘల్లు ఘల్లు మని సిరి మువ్వల్లే చినుకే చేరగా…
ఝల్లు ఝల్లు మని పులకింతల్లో పుడమే పాడగా…

హరి విల్లు ఎత్తి కరిమబ్బు వాన బాణాలే వేయనీ
నిలువెల్ల మంచు పడగళ్ళు తాకి కడగళ్ళే తీరనీ…

జడివాన జాడతో ఈ వేళ… జన జీవితాలు చిగురించేలా
రాళ్ళ సీమలో ఈ వేళ… రతనాల ధారలే కురిసేలా
జడివాన జాడతో ఈ వేళ… జన జీవితాలు చిగురించేలా
రాళ్ళ సీమలో ఈ వేళ… రతనాల ధారలే కురిసేలా.. ..

Ghallu Ghallumani Lyrics in Telugu – Indra – ఘల్లు ఘల్లు మని సిరి మువ్వల్లే చినుకే చేరగా లిరిక్స్

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks