ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
సొగసు చూడ తరమా..!
సొగసు చూడ తరమా
నీ సొగసు చూడ తరమా
మరుని నారి… నారిగ మారి
మదిని నాటు విరిశరమా
సొగసు చూడ తరమా
నీ సొగసు చూడ తరమా
మరుని నారి… నారిగ మారి
మదిని నాటు విరిశరమా
సొగసు చూడ తరమా
హేయ్ హే… హే హేయ్ హే
కులుకే సుప్రభాతాలై… కునుకే స్వప్న గీతాలై
ఉషా కిరణమూ… నిషా తరుణమూ
కలిసె కలికి మేనిగా… రతి కాంతుని కొలువుగా
వెలసే చెలి చిన్నెలలో
సొగసు చూడ తరమా
పలుకా చైత్ర రాగాలే… అలకా గ్రీష్మ తాపాలే
మదే కరిగితే… అదే మధుఝరీ
చురుకు వరద గౌతమీ… చెలిమి శరత్ పౌర్ణమీ
అతివే అన్ని ఋతువులయ్యే
సొగసు చూడ తరమా
నీ సొగసు చూడ తరమా
మరుని నారి… నారిగ మారి
మదిని నాటు విరిశరమా
సొగసు చూడ తరమా
సొగసు చూడ తరమా
నీ సొగసు చూడ తరమా
మరుని నారి… నారిగ మారి
మదిని నాటు విరిశరమా
సొగసు చూడ తరమా