పట్టు చీరలా తళతళలూ… పట్టగొలుసులా గలగలలూ
పట్టు చీరలా తళతళలు… పట్టగొలుసులా గలగలలు
పూల చొక్కల రెపరెపలు… సిల్కు పంచెల టపటపలు
కాసుల పేరులా ధగధగలు… కాఫీ గాజుల భుగభుగలు
మామిడాకుల మిలమిలలు… కొబ్బరాకుల కళకళలు
గట్టిమేళాల ఢమఢమలు డమ్మా డమ్మా ఢమఢమలు
గట్టిమేళాల ఢమఢమలు… వంటశాలలో ఘుమఘుమలు
అన్నీ అన్నీ అన్నీ అన్నీ అన్నీ కలిపితే
పిపి పిపి పిపిపిపి పెళ్ళిసందడి
డుడుం డుడుం డుడుం డుడుం పెళ్ళిసందడి
పిపి పిపి పిపిపిపి పెళ్ళిసందడి
డుడుం డుడుం డుడుం డుడుం పెళ్ళిసందడి
(పిపి పిపి పిపిపిపి పెళ్ళిసందడి
డుడుం డుడుం డుడుం డుడుం పెళ్ళిసందడి)
మహిళామనుల చింత పిక్కలు, హబ్బో
పుణ్య పురుషులా పేక ముక్కలు
బావమరుదులు పరిహాసాలు
పాత మిత్రుల పలకరింపులు
అందరితోటి ఫోటోలు… అంత్యాక్షరి పోటీలు
అందరితోటి ఫోటోలు… అంత్యాక్షరి పోటీలు
అత్తమామల ఆత్మీయతలు… తాతభామ్మలా ఆశీస్సులు
అందరు చల్లే అక్షింతలు, అమ్మా నాన్నల
అమ్మానాన్నల తడి కన్నులు,
హ్మ్ సెంటిమెంటు బాగా ఎక్కువైందబ్బయా
కొంచం సెటప్పు బీటు మార్చండిరా బాబు
కన్నెపిల్లల కొంటె నవ్వులు
కుర్ర కన్నుల దొంగ చూపులు
అందగత్తెల చిలిపి సైగలు
కోడిగిత్తల చురుకు చేష్టలు
చెవులను ఊగెను జూకాలు
మోగించెను మదిలో బాకాలు
ముక్కుపుడకలో మిరుమిట్లు
పెదవెరుపులు పెంచెను పదిరెట్లు
ఆఆ ఆ ఆ, పచ్చని ఓణీ అందాలు
నచ్చినాయి ఆ పరువాలు
మొక్కుకుంటే అదే పదివేలు
ఆహాలు యమ ఓహోలు
ఎవడికి తెలియని సంగతులు
ఎరగా విసిరే బిస్కటులు
ఎంత పొగిడినా మీ కధలు
ఆశలు దోషలు అప్పడాలు, చెల్ రే చెల్
పెళ్ళిసందడీ పెళ్ళిసందడీ
పిపి పిపి పిపిపిపి పెళ్ళిసందడి
డడం డుడుం డుడుం డుడుం పెళ్ళిసందడి
పిపి పిపి పిపిపిపి పెళ్ళిసందడి
డడం డుడుం డుడుం డుడుం పెళ్ళిసందడి
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.