Telugu Stories, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Best Telugu Stories, Great Stories in Telugu. Telugu Real Stories, Best Stories in Telugu, Intelligent Telugu Stories, Telugu Kadhalu
నచ్చితే తప్పకుండా షేర్ చెయ్యండి
అన్యోన్య దాంపత్యం వినోద్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ లో మేనేజర్…ఈ మధ్యనే పెళ్లయింది…తను ఉంటున్న ఊరు..కాస్త పల్లెటూరు కాదు..పూర్తి గా టౌన్ కూడా కాదు..మధ్యస్థంగా వున్న ఊరు… పెళ్లికి ముందు స్నేహితులతో కలిసి రూమ్ లో వుండేవాడు…పెళ్లయ్యాక కూడా కొద్దీ రోజులు స్నేహితులతోనే రూంని షేర్ చేసుకున్నాడు…ఇక ఇప్పుడు అన్ని సౌకర్యాలు సమకూర్చుకుని… వినోద్ తన భార్యను కాపురానికి తీసుకుని వచ్చాడు ..
వినోద్ భార్య స్వాతి..సి ఎ…చదివింది…జాబ్ చేస్తాను అని..ఇంట్లో ఖాళీగా వుండడం కష్టమని స్వాతి…వినోద్ కు పెళ్లికి ముందే చెప్పింది…కానీ..వినోద్ ఒప్పుకోలేదు…ఒక బాబు నో..పాప నో పుట్టిన రెండేళ్ల తర్వాత .అప్పటి తన ఇష్టాన్ని బట్టి మాత్రమే జాబ్ చేయడానికి ఒప్పుకుంటాను అని చెప్పాడు..
దానికి కూడా కారణం లేకపోలేదు…తమ జీవితం లోకి బిడ్డ వచ్చాక ఆ బిడ్డ ఆరోగ్యం కూడా ముఖ్యం అని వినోద్ అభిప్రాయం..రెండు సంవత్సరాలు బిడ్డకు తల్లి పాలు ఇవ్వాలి..బిడ్డ తల్లి సంరక్షణ లో పెరగాలి అని వినోద్ కోరిక…వినోద్ చెప్పిన విషయం కూడా మంచిదే కాబట్టి స్వాతి ఒప్పుకుంది….ఇక వినోద్ బస్ స్టాండ్ కు దగ్గర్లో అద్దె ఇంట్లో కాపురం మొదలు పెట్టారు..
వినోద్ ఉదయం వెళ్లిపోతే సాయంత్రం చీకటి పడుతుంది అనగా ఇంటికి వచ్చేవాడు…స్వాతి కి ..మొదట్నుంచీ ఇంట్లోనే ఎక్కువగా వుండే అలవాటు… స్వాతి తల్లి కి..వీధుల్లో ముచ్చట్లు పెట్టడం నచ్ఛక..స్వాతి ని కూడా అలానే పెంచింది…ఇప్పుడు కూడా స్వాతి…వినోద్ బ్యాంక్ కు వెళ్ళిపోగానే…మెయిన్ డోర్ లాక్ చేసి…ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని…వీలుంటే టీవీ చూసి..కాసేపు…బుక్స్ చదువుకుని….మధ్యాహ్నం కాసేపు నిద్రపోయేది….
తమ పొరుగింటి లో వున్న…రాగిణి వీళ్ళ సంసారాన్ని గమనిస్తూ వుండేది…రాగిణి గృహిణి…రాగిణి భర్త రైల్వే లో ఉద్యోగి…రాగిణి కుమార్తె రెండేళ్ల క్రితం భర్త నుండి విడాకులు తీసుకుని. తల్లిదండ్రుల దగ్గరే వుంటోంది…రాగిణి అప్పుడప్పుడు వినోద్ ను…స్వాతి ని పలకరిస్తూ..గమనిస్తూ…వినోద్..స్వాతి ల కుటుంబ విషయాలు కనుక్కుంటూ….వచ్చేది..వినోద్ .స్వాతి ల అన్యోన్య జీవనం…రాగిణి కి నచ్చేది కాదు…..
రాగిణి మొదట్లో బాగా మాట్లాడుతూనే.. స్వాతి పట్ల కనిపించని ద్వేషాన్ని మనసులో నింపుకుంది… కొందరంతే…అనవసరమైన ద్వేషం…..దానికి తోడు స్వాతి…తక్కువగా మాట్లాడడం..రాగిణి ని ఎక్కువగా పట్టించుకోక పోవడం…ఎప్పుడు చూడు ఏదో ఒకటి చదువుకుంటూ…ఇంట్లో చక్కగా పనులు చేసుకుంటూ…భర్త తో సంతోషంగా గడిపే స్వాతి …అంటే..రాగిణి కి నచ్చడం లేదు…అయినప్పటికీ..అప్పుడప్పుడు..ఏ పని లేకున్నా..స్వాతి వాల్ల ఇంట్లోకి వెళ్ళడం…
ఏదో ఒక ఇబ్బంది కరమైన..స్వాతి మనసు నొచ్చుకునేల..మాట్లాడ్డం..రాగిణి కి దినచర్య అయిపోయింది….స్వాతి కి రాగిణి మాటలు…మనసుకు చివుక్కు కనిపించేవి…కానీ..రాగిణి వయసు ను దృష్టి లో పెట్టుకుని..నొప్పించక కూడదు అని…స్వాతి భావించేది…స్వాతి మూడో నెల గర్భవతి…ఈ మధ్య రాగిణి గారి పుల్ల విరుపు మాటలు ఎక్కువై పోయాయి…ఎంత ఆలోచించకూడదు అనుకున్నా…స్వాతికి ఆమె మాటలు ..తేనె పూసిన కత్తుల్లా .మనసుకు .గాయం చేస్తూనే వున్నాయి….
అంతే కాకుండా..రాగిణి..వినోద్ ను పలకరించే నెపం తో..అతని కి వున్నవి..లేనివి ఏవేవో కల్పించి చెప్పడం మొదలుపెట్టింది…వినోద్ ఇవేవీ వినిపించుకోలేదు.. కానీ…స్వాతి లో అనవసర…ఆలోచనలు..దిగులు.. పెరిగిపోయాయి…మనసు లో రోజు రోజుకు దిగులు పెరుగుతోంది..ఒక రోజు స్వాతి క్లాస్ మేట్ అరుణ్…ఏవో బుక్స్ కోసం..స్వాతి ని వెతుక్కుంటూ ఇంటి వరకొచ్చాడు….అంతే…రాగిణి ఇదే విషయాన్ని..స్వాతికి తెలియకుండా వీదంతా..చిలువలు పలువలు చేసి..చెడు గా పుకారు పుట్టించింది….రెండు వారాల తర్వాత..వీధి చివరను వున్న శ్యామలమ్మ….స్వాతి తో మాట్లాడుతూ..అరుణ్ గురించి…వివరాలు…గుచ్చి గుచ్చి..అనుమానంగా… అడిగింది….
“అరుణ్ తన క్లాస్ మెట్.. మరి ఈమెకు ఏం అవసరం..అరుణ్ విషయాలు.”.. అనుకొంది స్వాతి…ఇక అది మొదలు.రాగిణి…ఎప్పుడు..ఇలానే..ఉన్నవి..లేనివి కల్పించి చెప్పడం ..ఇతరుల దగ్గర స్వాతి వ్యక్తిత్వాన్ని దిగజారుస్తు వచ్చింది …పైగా..స్వాతి తో నవ్వుతూ..చాలా మామూలు గా.. పలకరిస్తుంది….రోజూ రోజుకీ స్వాతి ఆరోగ్యం సరిగా ఉండడం లేదు…హాస్పిటల్ చెక్ అప్ లో బి పి..చాలా ఎక్కువ ఉండడం…పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుందని డాక్టర్ గారు వినోద్ ను హెచ్చరించారు….
వినోద్ లో మార్పు వచ్చింది…ప్రేమగా స్వాతి ద్వారా..రాగిణి విధానం తెలుసుకుని….రాగిణి ని గమనించడం మొదలు పెట్టాడు.రాగిణి…అనవసర జోక్యాన్ని ..మాటల ద్వారానే సున్నితంగా ఖండించాడు….ప్రతి విషయం లో స్వాతి ని సపోర్ట్ చేస్తూ…స్వాతికి మానసికంగా తోడుగా వుండేవాడు….ఇప్పుడు వారిది అన్యోన్య దాంపత్యం…స్వాతి నార్మల్ అయింది…
నెలలు దగ్గర పడడం తో..వినోద్ తల్లి..స్వాతి కి సహాయం గా వచ్చింది…రాగిణి గురించి ముందే తెలుసుకున్న వినోద్ తల్లి…కూడా..ఇతరుల జీవితాల్లో ..అనవసరంగా తల దూర్చి..అవమానాల పాలు కావద్దని…పరోక్షంగా రాగిణి ని..మాటలతో నే హెచ్చరించింది….ఇక ఆ కుటుంబం విషయం లో తన పాచికలు పారవు అని తెలుసుకున్న రాగిణి….ఇక తన అసూయ పూరిత ఆలోచనల తో..ఇంకా ఏ సంసారాన్ని దహనం చేయాలా అని ఆలోచిస్తూ …వెతుకులాట లో మునిగి పోయింది…
ఇలాంటి రాగిణి లు..అడుగడుగునా మన జీవితాల్లో..అప్పుడప్పుడు తారస పడుతుంటారు..అనవసరమైన ..అకారణ ద్వేషం తో ..మనసు లో రగిలిపోతూ..ఇతరుల జీవితాల్ని…కనిపించని పుకార్లు పుట్టించి…పచ్చని కాపురాలు ను…కలహాల అగ్ని కి ఆహుతి చేస్తుంటారు…అందుకే..ఎవరు ఎంత…ఎవరి పరిధి ఎంత..అనే ఆలోచన మనలో ఉండాలి…మంచి మాటలు ..మనసుకెక్కించు కొని..,అసూయ పూరిత మాటల్ని..విమర్శల్ని…పూచిక పుల్లలలా..విసిరేసి….మనం బాలన్స్డ్ గా వుంటూ…మన కుటుంబాన్ని చక్కగా చూసుకోవాల్సిన అవసరం..ఇప్పట్లో ప్రతి మహిళ బాధ్యత….అలాగని..చెడు మనసున్న వ్యక్తులకు దూరంగా వుంటూ నే..మంచి మనసున్న ఇరుగు పొరుగు వారితో ..స్నేహంగా కొనసాగడం కూడా ముఖ్యం.సర్వేజనా సుఖినోభవంతు.
స్వస్తి
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.