Menu Close

Muthyala Chemma Chekka Lyrics In Telugu – Bobbili Yuddham


Muthyala Chemma Chekka Lyrics In Telugu – Bobbili Yuddham

ముత్యాల చెమ్మచెక్క… రత్నాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా
కలకల కిలకిల నవ్వులతో… గాజులు గలగలలాడ

ముత్యాల చెమ్మచెక్క… రత్నాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా
కలకల కిలకిల నవ్వులతో… గాజులు గలగలలాడ

తళ తళ తళ తళ మెరిసే సొగసు
ఇంపైన సంపంగి… అమ్మాయి మనసూ
తళ తళ తళ తళ మెరిసే సొగసు
ఇంపైన సంపంగి… అమ్మాయి మనసూ
పరువము వేసిన పందిరిలో… బుజబుజ రేకులు పూయవలె
పరువము వేసిన పందిరిలో… బుజబుజ రేకులు పూయవలె

ముత్యాల చెమ్మచెక్క… రత్నాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా
కలకల కిలకిల నవ్వులతో… గాజులు గలగలలాడ

ఒప్పులకుప్ప వయ్యారి భామా
సన్నబియ్యం ఛాయపప్పు
చిన్నమువ్వ సన్నగాజు
కొబ్బరికోరు బెల్లప్పచ్చు
గూట్లో రూపాయ్ నీ మొగుడు సిపాయ్
రోట్లో తవుడు నీ మొగుడెవడు
హహహహ హహహహ హహహహ

ఘుమ ఘుమ ఘుమ ఘుమ చారడేసి మొగ్గలు
గులాబి జవ్వాది… అమ్మాయి బుగ్గలు
ఘుమ ఘుమ ఘుమ ఘుమ చారడేసి మొగ్గలు
గులాబి జవ్వాది… అమ్మాయి బుగ్గలు
ఆడిన ఆటలు నోములయి… కోరిన పెనిమిటి దొరకవలె
ఆడిన ఆటలు నోములయి… కోరిన పెనిమిటి దొరకవలె

ఆఆ ఆ ఆ… ఆఆ ఆ ఆ
ఓ ఓఓ ఓ… ఓ ఓఓ ఓ
ముత్యాల చెమ్మచెక్క… రత్నాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా
కలకల కిలకిల నవ్వులతో… గాజులు గలగలలాడ

ముత్యాల చెమ్మచెక్క… రత్నాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా
కలకల కిలకిల నవ్వులతో… గాజులు గలగలలాడ

Like and Share
+1
0
+1
0
+1
0
Share with your friends & family
Posted in Lyrics in Telugu - Movie Songs
Loading poll ...

Subscribe for latest updates

Loading