Prema O Premaa Lyrics In Telugu – NGK – ప్రేమా ఓ ప్రేమా లిరిక్స్
ప్రేమ… ప్రేమ…
ఓ ప్రేమా… ఓ ప్రేమా…
ప్రేమ సుడిగాలై నువ్వే ఉంటె… చిరుగాలై చేరనా…
నిశిలాగా నువ్వే ఉంటే… నిను నీడై తాకనా…
నదిలాగా నువ్వే ఉంటే… చినుకై నే చిందనా…
అడిగా బదులడిగా… నీ అడుగై నడిచే
మార్గం చూపుమా… చూపుమా…
పిలిచా నిను పిలిచా… నీ కలలో నిలిచే
మంత్రం చెప్పుమా… చెప్పుమా…
ప్రియ మేఘం కురిసే వేళా… పుడమెంత అందమో…
మరు మల్లి మందారాలా… చెలిమెంత అందమో…
ఎగసే అలలెగసె… నీ ప్రేమలో అందం
ఎదనే లాగెనే… లాగెనే…
నా గుండెల్లో నిండే మోహం… శ్వాసల్లో ధూపం వేసే…
చుట్టూరా పొగలై కమ్మేనే… గుట్టంతా తెలిపెనే…
తలుపును వదలని యోచన… పెరిగెను మనసున యాతన…
ప్రాయము చేసే ప్రార్థనా… పరుగున వచ్చే మోహనా…
ఓ… చైత్ర మాసాన మేఘమే… చిందేను వర్షం…
కోనల్లోన మోగదా… భూపాల రాగం…
ప్రేమ ఓ ప్రేమా… మన నీడల రంగులు
నేడే కలిసెనే… కలిసెనే…
చెలిమే మన చెలిమే… ఒక అనువై పెరిగి
అఖిలం అయినదే… అయినదే…
ఓ ఓ.. అనురాగం పాడాలంటే… మౌనం సంగీతమే…
అనుబంధం చూపాలంటే… సరి-పోదే జన్మమే.. ..
Prema O Premaa Lyrics In Telugu – NGK – ప్రేమా ఓ ప్రేమా లిరిక్స్
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.