Menu Close

Kanne Kanne Song Lyrics In Telugu – Arjun Suravaram


నా మనసిలా మనసిలా… ఓ మనసే కోరుకుందే
నీ మనసుకే మనసుకే… ఆ వరసే చెప్పమందే…

ఏమో ఎలా చెప్పేయడం…. ఆ తీపి మాటే నీతో
ఏమో ఎలా దాటేయడం ఈ తగువే తకదిమితోం…

ఎదో తెలియనిదే ఇన్నాళ్ళు చూడనిదే
నేడే తెలిసినదే… మునుపెన్నడూ లేనిది మొదలౌతుందే…

ఎదో జరిగినదే… బరువేదో పెరిగినదే
మౌనం విరిగినదే… పెదవే విప్పే వేళ ఇదే…

కన్నె కన్నె రెప్పే వేస్తె… నీ కలలోకే నడిచాలే
నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ… నన్నే నేనే మరిచానే ||2||

తియ్యగా తియ తియ్యగా… నీ తలపులు పంచవెలా
దాచుతూ ఎమార్చుతూ… నిను నువ్వే దాస్తావెందుకలా

ఓ చినుకూ కిరణం… కలగలిపే మెరుపే హరివిల్లే
సమయం వస్తే… ఆ రంగులు నీకే కనపడులే

మెల్లగా మెల మెల్లగా… మన దారులు కలిసెనుగా
హాయిలో ఈ హాయిలో… ఆకాశాలే దాటేసాగా

ఇన్నాళ్ళ నా ఒంటరితనమే… చెరిగెను నీ వల్లేనే
చూపులతో కాక పెదవులతో చెప్పేయ్ మాటలనే

కన్నె కన్నె రెప్పే వేస్తె… నీ కలలోకే నడిచాలే
నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ… నన్నే నేనే మరిచానే ||2||

కదలిక తొలి కదలిక… నా నిలకడ తలపుల్లో
సడలిక తొలి సడలిక… మరి చుట్టూ బిగిసిన సంకెలలో
ఈ కలహం విరహం… తియ్యని తరహాగుండదు విడుదలెలా
వినవా చెలియా… కనిపించని పెదవుల పలుకులిలా

మొదలిక తొలిసారిగా నీ ఎదలో అలజడులే
నిదురిక కరువవ్వగా… మరి కుదురే కుదురే చెదిరెనులే

ఇన్నేళ్ళ కాలం మెరిసెనులే… నిన్నే కలసిన వేళ
నా ఊహల విస్మయ విశ్వంలో… వెన్నెల నీ చిరునవ్వే

కన్నె కన్నె రెప్పే వేస్తె… నీ కలలోకే నడిచాలే
నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ… నన్నే నేనే మరిచానే ||2||

Like and Share
+1
0
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading