Pranamlo Pranamga Song Lyrics In Telugu – ప్రాణంలో ప్రాణంగా లిరిక్స్
Subscribe to Our YouTube Channel
ప్రాణంలో ప్రాణంగా… మాటల్లో మౌనంగా చెబుతున్నా
బాధైనా ఏదైనా… భారంగా దూరంగా వెళుతున్నా
మొన్న కన్న కలా… నిన్న విన్న కథ
రేపు రాదు కదా జతా…
ఇలా… ఇలా… నిరాశగా…
నది దాటుతున్నా… ఊరు మారుతున్నా
ఊరుకోదు ఎదా… ||2||
ప్రాణంలో ప్రాణంగా… మాటల్లో మౌనంగా చెబుతున్నా
స్నేహం నాదే… ప్రేమా నాదే
ఆ పైన ద్రోహం నాదే…
కన్ను నాదే… వేలు నాదే
కన్నీరు నాదే లే…
తప్పంత నాదే… శిక్షంత నాకే…
తప్పించుకోలేనే…
ఎడారిలో తుఫానులో…
తడి ఆరుతున్న… తడి చూడకున్నా
ఎదురేది అన్నా…
ప్రాణంలో ప్రాణంగా… మాటల్లో మౌనంగా చెబుతున్నా
బాధైనా ఏదైనా… భారంగా దూరంగా వెళుతున్నా
ప్రాణంలో ప్రాణంగా… మాటల్లో మౌనంగా చెబుతున్నా
గతానిపై సమాధినై… గతిమారుతున్నా
స్థితి మారుతున్నా… బ్రతికేస్తు ఉన్నా.. ..
Pranamlo Pranamga Song Lyrics In Telugu – ప్రాణంలో ప్రాణంగా లిరిక్స్
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.