Choododde Nanu Choododde Lyrics In Telugu – చూడొద్దే నను చూడొద్దే లిరిక్స్
SUBSCRIBE TO OUR YOUTUBE CHANNEL
చూడొద్దే నను చూడొద్దే… చురకత్తిలాగ నను చూడొద్దే
వెళ్ళొద్దె వదిలెళ్ళొద్దే… మది గూడు దాటి వదిలెళ్ళొద్దే
అప్పుడు పంచిన నీ మనసే… అప్పని అనవద్దే
ఇప్పుడు పెరిగిన వడ్డీతో… ఇమ్మని అడగొద్దే… ఏ ఏ
చూడొద్దే నను చూడొద్దే… చురకత్తిలాగ నను చూడొద్దే
వెళ్ళొద్దె వదిలెళ్ళొద్దే… మది గూడు దాటి వదిలెళ్ళొద్దే
వద్దు వద్దు అంటు నేనున్నా… వయసే గిల్లింది నువ్వేగా
పో పో పొమ్మంటూ నేనున్నా… పొగలా అల్లింది నువ్వేగా
నిదరోతున్న హృదయాన్ని… లాగింది నువ్వేగా
నలుపై ఉన్న రాతిరికి… రంగులు నువ్వేగా
నాతో నడిచే నా నీడ… నీతో నడిపావే
నాలో నిలిచే నా ప్రాణం… నువ్వై నిలిచావే
చూడొద్దే నను చూడొద్దే… చురకత్తిలాగ నను చూడొద్దే
వెళ్ళొద్దె వదిలెళ్ళొద్దే… మది గూడు దాటి వదిలెళ్ళొద్దే
హా హా హా హా హా హా… హా హా హా హా హా హా
ఆఆఆఆ… ఆ ఆ ఆఆ
వద్దు వద్దంటు నువ్వున్నా… వలపే పుట్టింది నీ పైనా
కాదు కాదంటు నువ్వున్నా… కడలే పొంగింది నాలోన
కన్నీల్లు తీరంలో… పడవల్లే నిలుచున్నా
సుడిగుండాల శృతిలయలో… పిలుపే ఇస్తున్నా
మంటలు తగిలిన పుత్తడిలో… మెరుపే కలుగునులే
ఒంటిగా తిరిగిన ఇద్దరిలో… ప్రేమే పెరుగునులే.. ఏ ఏ
చూడొద్దు నను చూడొద్దు… చురకత్తిలాగ నను చూడొద్దు
వెళ్ళొద్దు వదిలెళ్ళొద్దు… మది గూడు దాటి వదిలెళ్ళొద్దు
అప్పుడు పంచిన నా మనసే… అప్పని అనలేదే
గుప్పెడు గుండెల చెలి ఊసే… ఇప్పుడు నీదేలే… ఏ ఏ.. ..
Choododde Nanu Choododde Lyrics In Telugu – చూడొద్దే నను చూడొద్దే లిరిక్స్