Pilla O Pilla Lyrics In Telugu – Current Theega – పిల్లా ఓ పిల్లా లిరిక్స్
అదిరెను అదిరెను ఎదసడి అదిరెను
కలిగెను కలిగెను అలజడి కలిగెను
గిరగిర తిరిగెడి భూమి నిలిచెను
గలగల కదిలెడి గాలి నిలిచెను
మనసులో తొలకరి మొక్క మొలిచెను
వయసున మగసిరి పొద్దు పొడిచెను
నరనర నరములు సల సల మరిగెను
నిన్న లేని నిప్పులాంటి తూఫాను
గుండెల్లోన వేయి వేళ్ళ పిడుగులు పగిలెను
కోటి కోట్ల మెరుపుల కత్తి దాడి జరిగెను
నాపై నాపై నాపై… నా పై నా పై
కాలి కింది నేల కూడ… నన్ను వీడి కదిలెను
ప్రాణమంత పిండుతున్న తీపిబాధ రగిలెను
ఏమయ్యిందో ఏమయ్యిందో రెప్ప మూసి తీసేలోగా
ఏమయ్యిందో చూసేలోగా నాలో నేను లేనే లేను
పిల్లా ఓ పిల్లా నా చూపుల్లోన మెరిశావే
పిల్లా ఓ పిల్లా నా ఊపిరి లోన కలిశావే
పిల్లా ఓ పిల్లా నా దేవత నువ్వై నిలిచావే
అయ్యో, ఓ ఓ ఓ ఓహో ఓ ఓ హో
పాదరసమునే పోతపోసి నీ మెరుపు దేహమే మలిచారో
పూల పరిమళం ఊపిరూదిన పైకి నిన్నిలా ఒదిలారో
అద్భుతాలన్నీ ఒక చోటే వెతికి నిను చేరినాయేమో
పోలికలు సోలిపోయే రూపం నీదే
పిల్లా ఓ పిల్లా నా గుండె తలుపు తట్టావే
పిల్లా ఓ పిల్లా నా ప్రేమ దారి పట్టావే
పిల్లా ఓ పిల్లా నా కల్లో దీపం పెట్టావే
అయ్యో, ఓ ఓ ఓ ఓహో ఓ ఓ హో
హోరుగాలిలో నెమలి కన్నులా… తేలుతోంది మది నీవల్లే
జోరువానలో ఆడుతున్న నా అంతరంగమొక హరివిల్లే
పసిడి పరువాల పసిపాప మరువదే నిన్ను కనుపాప
జన్మకే జ్ఞాపకంగా చూశా నిన్నే
పిల్లా ఓ పిల్లా… నా లోకంలో అడుగెట్టావే
పిల్లా ఓ పిల్లా… నీ అందంతో పడగోట్టావే
పిల్లా ఓ పిల్లా… నా కోసమే నువ్వు పుట్టావే, అయ్యో, ఓ ఓ హో
పిల్లా ఓ పిల్లా… నీ అందం దెబ్బ తిన్నానే
పిల్లా ఓ పిల్లా… నే తేరుకోలేకున్నానే
పిల్లా ఓ పిల్లా… నీ ప్రేమలో పడుతున్నానే
అయ్యో ఓ ఓ ఓ ఓహో ఓ ఓ హో.. ..
Pilla O Pilla Lyrics In Telugu – Current Theega – పిల్లా ఓ పిల్లా లిరిక్స్
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.