Menu Close

Bavagari Choope Song Lyrics in Telugu – Govindudu Andarivadele

చిన్నారికి ఓణీలిచ్చెయ్… వయ్యారిపై బాణాలేసే
చిన్నారికి ఓణీలిచ్చెయ్… వయ్యారిపై బాణాలేసే
శుభకార్యం జరుపుటకై… వచ్చాడు వచ్చాడు
బంగారి బావ బంగారి బావ… బంగారి బావా

బావగారి చూపే బంతి పువ్వై పూసిందే
బావగారి మనసే… మల్లె పువ్వై నవ్విందే
మరదలి మాటల్లో… మందారం జారిందే
కలిసిన బంధంలో కురిసేనే ఇలా
పువ్వుల చినుకులే… హే ఏ, పువ్వుల చినుకులే, హే ఏ

బావగారి చూపే… బంతి పువ్వై పూసిందే
బావగారి మనసే… మల్లె పువ్వై నవ్విందే
మరదలి మాటల్లో… మందారం జారిందే
కలిసిన బంధంలో కురిసేనే ఇలా
పువ్వుల చినుకులే… హే ఏ, పువ్వుల చినుకులే, హే ఏ

హో హో హో హో ఓ
లంగా తోటి ఓణీకుంది… ఓ బంధం
ఈ రాజా తోటి రాణికుంది అనుబంధం
పాదాలకి అందెలకుంది… ఓ బంధం
ఈ ప్రాయానికి అల్లరికుంది అనుబంధం

వాలు జడ జాజులు ఓ జంట… వడ్డాణము నడుము ఓ జంట
ఇక నీతో నేనవుతా జంటా
చేతులకి జంటే గోరింట… లేకపోతె కళే లేదంట
నా వెంటే నువ్వుంటే కురిపిస్తా నీపై
బంగరు చినుకులే… హే ఏ బంగరు చినుకులే, హే ఏ
బావగారి చూపే బంతి పువ్వై పూసిందే
బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే

నవ్వుల్లోన బంధం అందం మెరుస్తుంది
అరె బాధల్లోన బంధం… బలం తెలుస్తుంది
హే..! రూపం లేని ప్రాణం తానై నిలుస్తుంది
ఆ ప్రాణం పోయే క్షణం దాక తపిస్తుంది
కమ్మనైన బంధం ఈనాడే… కోవెలల్లె మారే ఈ చోటే
ఈ కోవెల్లో భక్తుడు నేనే

అల్లుకున్న బంధం ఇవ్వాళే… ఇల్లుకట్టుకుంది ఈ చోటే
ఈ ఇంట్లో మనవడినై… ఈ ఇంట్లో మనవాడినై కురిపిస్తా మీపై
ప్రేమల చినుకులే… హే ఏ ప్రేమల చినుకులే, హే ఏ

బావగారి చూపే… బంతి పువ్వై పూసిందే
బావగారి మనసే… మల్లె పువ్వై నవ్విందే
మరదలి మాటల్లో… మందారం జారిందే
కలిసిన బంధంలో… కురిసేనే ఇలా
పువ్వుల చినుకులే… హే ఏ, పువ్వుల చినుకులే, హే ఏ

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Top 5 Life Quotes in Telugu Most Inspiring Telugu Quotes Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images