Menu Close

Padametu Potunna Song Lyrics In Telugu – Happy Days – పాదమెటు పోతున్న లిరిక్స్

Padametu Potunna Song Lyrics In Telugu – Happy Days – పాదమెటు పోతున్న లిరిక్స్

SUBSCRIBE FOR MORE

పాదమెటు పోతున్న… పయనమెందాకైన
అడుగు తడబడుతున్న… తోడు రానా
చిన్ని ఎడబాటైన… కంటతడి పెడుతున్న
గుండె ప్రతి లయలోనా… నేను లేనా

ఒంటరైన, ఓటమైనా… వెంట నడిచే నీడవేనా?
ఓ మై ఫ్రెండ్… తడి కన్నులనే తుడిచిన నేస్తామా
ఓ మై ఫ్రెండ్… ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా

అమ్మ ఒడిలో లేని పాశం… నేస్తమల్లే అల్లుకుందీ
జన్మకంతా తీరిపోనీ… మమతలెన్నో పంచుతోంది
మీరూ మీరూ నుంచి… మన స్నేహ గీతం
ఏరా ఏరాల్లోకీ మారే… మొమాటాలే లేనీ కలే జాలువారే

ఒంటరైన, ఓటమైనా… వెంట నడిచే నీడ నీవే
ఓ మై ఫ్రెండ్… తడి కన్నులనే తుడిచిన నేస్తామా
ఓ మై ఫ్రెండ్… ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా

వాన వస్తే కాగితాలే… పడవలయ్యే ఙ్ఞాపకాలే
నిన్ను చూస్తే చిన్ననాటీ… చింతలన్నీ చెంతవాలే
గిల్లికజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ…
తళ్ళింతల్లో తేలే స్నేహం… మొదలొ తుదలొ తెలిపే ముడి వీడకుందే

ఒంటరైన, ఓటమైనా… వెంట నడిచే నీడ నీదే
ఓ మై ఫ్రెండ్… తడి కన్నులనే తుడిచిన నేస్తామా
ఓ మై ఫ్రెండ్… ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా.. ..

Padametu Potunna Song Lyrics In Telugu – Happy Days – పాదమెటు పోతున్న లిరిక్స్

Like and Share
+1
0
+1
2
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading