Happy Happy Birthdaylu Lyrics in Telugu – Suswagatham
Happy Happy Birthdaylu Lyrics in Telugu – Suswagatham
హ్యాపి హ్యాపి బర్త్ డేలు మళ్ళి మళ్ళి చేసుకోగ
శుభాకాంక్షలందజేయుమా మిత్రమా
ఆపలేని స్వేచ్చ వుంది అందినంత ఛాన్స్ వుంది
అందుకోరా పుత్ర రత్నమా నేస్తమా
జీవితానికే అర్ధం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే
ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే
చిలిపి వయసు వరస తమకు తెలియద
హ్యాపి హ్యాపీ ఓ ఓ
హ్యాపి హ్యాపి బర్త్ డేలు మళ్ళి మళ్ళి చేసుకోగ
శుభాకాంక్షలందజేయుమా మిత్రమా
తెలియకడుగుతున్నాలే కంప్యూటరేమంటుంది
పాఠమెంత అవుతున్నా ఫలితం ఏమైంది
బోధపడని కంప్యూటర్ బదులన్నదే లేదంది
విసుగురాని నా మనసే ఎదురే చూస్తోంది
ప్రేమకధలు ఎప్పుడైన ఒకటే బ్రాండ్
ఆచితూచి ముందుకెళ్ళు ఓ మై ఫ్రెండ్
అప్ టు డేట్ ట్రెండ్ మాది టోటల్ చేంజ్
పాత నీతులింక మాకు నో ఎక్స్చేంజ్
ఫ్రెండులాంటి పెద్దవాడి అనుభవాల సారమే
శాసనాలు కావు నీకు సలహాలు మాత్రమే
కలను వదిలి ఇలను తెలిసి నడుచుకో హ్యాపీ హ్యాపీ
హ్యాపి హ్యాపి బర్త్ డేలు మళ్ళి మళ్ళి చేసుకోగ
శుభాకాంక్షలందజేయుమా మిత్రమా
సా సగమనిస సనిపమప గమప గమప గమప గమపని
అయ్యయ్యయ్యయ్యో అయ్యో అయ్యయ్యయ్యో
నిసనిసగ నిసనిసగ నిసనిస పనిపని మపనిసగ
గజిబిజిగా గజిబిజిగా గజిబిజి గజిబిజి గజిబిజిగా
మ్యూజిక్కా మ్యాజిక్కా మజా కాదు చాలంజీ
బాపూజీ బాపూజీ దనేకులా మా వీధి
నింగిలోని చుక్కలనే చిటికేసి రమ్మనలేమా
తలచుకుంటే ఏమైనా ఎదురే లేదనమా
నేల విడిచి సామైతే టైం వేస్టురా ఈ ధీమా
ముందు వెనుక గమనిస్తే విజయం నీది సుమా
రోజా నవ్వు రమ్మంటున్న రోజు కదా
తాకకుండా ఊరుకుంటే తప్పు కదా
నవ్వు కింద పొంచి ఉన్న ముళ్ళు కదా
చూడకుండా చెయ్యి వేస్తే ఒప్పు కదా
ముళ్ళు చూసి ఆగిపోతే పువ్వులింక దక్కునా
లక్ష్యమందకుండ లైఫుకర్ధమింక ఉండునా
తెగువ తెలుపు గెలుపు మనకి దొరకగ హ్యాపి హ్యాపీ
హ్యాపి హ్యాపి బర్త్ డేలు మళ్ళి మళ్ళి చేసుకోగ
శుభాకాంక్షలందజేయుమా మిత్రమా
ఆపలేని స్వేచ్చ వుంది అందినంత ఛాన్స్ వుంది
అందుకోరా పుత్ర రత్నమా నేస్తమా
జీవితానికే అర్ధం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే
ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే
చిలిపి వయసు వరస తమకు తెలియద
హ్యాపి హ్యాపీ ఓ ఓ
హ్యాపి హ్యాపి బర్త్ డేలు మళ్ళి మళ్ళి చేసుకోగ
శుభాకాంక్షలందజేయుమా మిత్రమా
Happy Happy Birthdaylu Lyrics in Telugu – Suswagatham
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.