Redmi TV జస్ట్ - 8000/-
Samsung Fridge 183 L జస్ట్ - 13000/-
LG వాషింగ్ మెషిన్ - జస్ట్ - 9000/-
Samsung phone at - 10000/-
realme Earbuds జస్ట్ - 900/-
ఎవ్వరె నువ్వు… నన్ను కదిపావు
నీ లోకంలోకి లాగావు…
కన్నులు మూసి… తెరిచేలోగా
నా ప్రాణం నువ్వైపోయావు…
తెలవారింది లే లేమ్మంటూ… వెలుగేదో చూపావు
నాకూ ఓ మనసుందంటూ… తెలిసేలా చేశావు
మెరుపల్లే కలిసావు… మైమరపే ఇచ్చావు
నీలోనే కలిపావు…
ఎవ్వరె నువ్వు… నన్ను కదిపావు
నీ లోకంలోకి లాగావు…
కన్నులు మూసి… తెరిచేలోగా
నా ప్రాణం నువ్వైపోయావు…
ఎటు చూసినా… ఏం చేసినా
ఏ దారిలో అడుగేసినా…
నలువైపులా… నాకెదురేఉందా మైనా మైనా
ఏ మబ్బులో దోగాడినా… ఏ హాయిలో తేలాడినా
నాకింతగా ఆనందం ఉందా… నిన్నా మొన్నా
ఎవ్వరికైనా ఏ ఎదకైనా… ప్రేమలొ పడితే ఇంతేనా
ఔననుకున్నా కాదనుకున్నా… అనుకోనిదే జరిగిందిగా
నా తీరుతెన్ను మారుతోందిగా…
ఎవ్వరె నువ్వు… నన్ను కదిపావు
నీ లోకంలోకి లాగావు…
కన్నులు మూసి… తెరిచేలోగా
నా ప్రాణం నువ్వైపోయావు…
దేవత ఓ దేవతా దేవత దేవత… అది నా దేవత
దేవత ఓ దేవతా దేవత దేవత…
చెలి చూపులో చిరుగాయమై… మలిచూపులో మటుమాయమై
తొలిప్రేమగా నే మొదలౌతున్నా… కలలే కన్నా
నా శ్వాసలో తను లీనమై… నా నిన్నలన్నీ శూన్యమై
ఈ జీవితం చెలి కోసం… అన్నా ఎవరేమన్నా
ఎక్కడి నేను ఎక్కడున్నాను… చాలా దూరం నడిచాను
తియ్యని దిగులై పడి ఉన్నాను… చెలిలేనిదే బ్రతికేదెలా
ఏ ఊపిరైన ఉత్తి గాలిలే…
ఎవ్వరె నువ్వు… నన్ను కదిపావు
నీ లోకంలోకి లాగావు…
కన్నులు మూసి… తెరిచేలోగా
నా ప్రాణం నువ్వైపోయావు…
తెలవారింది లే లేమ్మంటూ… వెలుగేదో చూపావు
నాకూ ఓ మనసుందంటూ… తెలిసేలా చేశావు
మెరుపల్లే కలిసావు… మైమరపే ఇచ్చావు
నీలోనే కలిపావు…
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.