ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఓహొ..! ఆహా… లాలలా… ఆ అహాహ ఆఆ…
పారాహుషార్… పారాహుషార్…
పారాహుషార్… పారాహుషార్…
తూరుపమ్మ దక్షిణమ్మ… పడమరమ్మ ఉత్తరమ్మ…
తూరుపమ్మ దక్షిణమ్మ… పడమరమ్మ ఉత్తరమ్మ…
పారాహుషార్… పారాహుషార్…
అంబారి ఏనుగునెక్కి… అందాల మా యువరాజు…
అంబారి ఏనుగునెక్కి… అందాల మా యువరాజు…
ఊరేగుతు వచ్చేనమ్మ పారాహుషార్…
పారాహుషార్… పారాహుషార్…
తుంటరి కన్నయ్య వీడు… ఆగడాల అల్లరి చూడు…
తూరుపమ్మా పారాహుషార్…
దుందుడుకు దుండగీడు దిక్కుతోచనీడు… దక్షిణమ్మ పారాహుషార్…
పాలు పెరుగు ఉండనీడు… పోకిరి గోపయ్య చూడు…
పడమరమ్మా పారాహుషార్…
జిత్తులెన్నో వేస్తాడమ్మ…
జిత్తులెన్నో వేస్తాడమ్మ… దుత్తలు పడదోస్తాడమ్మ..
ఉత్తరమ్మా… ఉత్తరమ్మా… పారాహుషార్…
పారాహుషార్… పారాహుషార్…
రేయిరంగు మేనివాడు వేయినామాలవాడు…
తూరుపమ్మా పారాహుషార్…
ఏమూలన నక్కినాడో… ఆనవాలు చిక్కనీడు…
దక్షిణమ్మా పారాహుషార్…
ఓఓ ఓఓ ఓ హో హొ…
నోరార రా… రా… రారా అన్నా… మొరాయించుతున్నాడమ్మా… ఆ ఆ
పడమరమ్మా పారాహుషార్…
ముక్కుతాడు కోసెయ్యాలి… ముట్టె పొగరు తీసెయ్యలి…
ముక్కుతాడు కోసెయ్యాలి… ముట్టె పొగరు తీసెయ్యలి…
ఉత్తరమ్మ పారాహుషార్… పారాహుషార్… పారాహుషార్…
నీలాటి రేవుకాడ… నీలమేఘ శ్యాముడు చూడ…
అమ్మో ఓయమ్మో…
నీలాటి రేవుకాడ… నీలమేఘ శ్యాముడు చూడ…
సల్లనైన ఏటినీరు… సలసలమని మరిగిందమ్మ…
అమ్మో ఓయమ్మో…
సెట్టుదిగని సిన్నోడమ్మ… బెట్టు వదలకున్నాడమ్మ…
సెట్టుదిగని సిన్నోడమ్మ… బెట్టు వదలకున్నాడమ్మ…
అమ్మమో ఓయమ్మో…
జట్టు కట్ట రమ్మంటుంటే… పట్టూ దొరకకున్నాడమ్మ…
అమ్మో… ఓయమ్మో… అమ్మమో… ఓయమ్మో…
తూరుపమ్మ దక్షిణమ్మ… పడమరమ్మ ఉత్తరమ్మ…
తూరుపమ్మ దక్షిణమ్మ… పడమరమ్మ ఉత్తరమ్మ…
పారాహుషార్… పారాహుషార్…
పారాహుషార్… పారాహుషార్…