Menu Close

Andela Ravamidi Song Lyrics In Telugu – Swarna Kamalam

గురుః బ్రహ్మ గురుః విష్ణుః గురుః దేవో మహేశ్వరః
గురుః సాక్షాత్ పరబ్రహ్మ… గురుః సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః

ఓం నమో నమో నమః శివాయ
మంగళప్రదాయగోతు రంగతే నమః శివాయ
గంగయా తరంగితోత్తమాంగతే నమః శివాయ
ఓం నమో నమో నమః శివాయ
శూలినే నమో నమః కపాలినే నమః శివాయ
పాలినే విరంచితుండ మాలినే నమః శివాయ

అందెల రవమిది పదములదా…
అందెల రవమిది పదములదా… అంబరమంటిన హృదయముదా
అందెల రవమిది పదములదా… అంబరమంటిన హృదయముదా
అమృత గానమిది పెదవులదా… అమితానందపు ఎద సడిదా
ఆగిన సాధన సార్థకమందగ… యోగ బలముగా యాగ ఫలముగా
ఆగిన సాధన సార్థకమందగ… యోగ బలముగా యాగ ఫలముగా
బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా… అందెల రవమిది పదములదా
ఆ ఆఆ ఆ ఆఆ…

మువ్వలు ఉరుముల… సవ్వడులై
మెలికలు మెరుపుల… మెలకువలై
మువ్వలు ఉరుముల… సవ్వడులై
మెలికలు మెరుపుల… మెలకువలై
మేను హర్ష వర్ష మేఘమై… వేణి విసురు వాయు వేగమై

అంగభంగిమలు గంగ పొంగులై… హావభావములు నింగి రంగులై
లాస్యం సాగే లీల… రసఝరులు జాలు వారేలా
జంగమమై జడమాడగా… జలపాతగీతముల తోడుగా
పర్వతాలు ప్రసవించిన… పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా
అందెల రవమిది పదములదా…

నయన తేజమే నకారమై … మనోనిశ్చయం మకారమై
శ్వాస చలనమే శికారమై… వాంఛితార్థమే వకారమై
యోచన సకలము యకారమై…
నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం
వేదం వకారం యజ్ఞం యకారం…
ఓం నమః శివాయ…

భావమే భవునకు… భావ్యము కాగా
భరతమే నిరతము… భాగ్యము కాగా
తుహిన గిరులు కరిగేలా… తాండవమాడే వేళా
ప్రాణపంచమమే పంచాక్షరిగా… పరమపదము ప్రకటించగా
ఖగోళాలు పద కింకిణులై… పది దిక్కుల ధూర్జటి ఆర్భటి రేగా

అందెల రవమిది పదములదా… అంబరమంటిన హృదయముదా
అమృత గానమిది పెదవులదా… అమితానందపు ఎద సడిదా
అందెల రవమిది పదములదా… ఆ ఆ ఆఆ

Like and Share
+1
9
+1
9
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading