ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Opium Poppy Seeds | Gasagasalu | గసగసాలు
గసగసాలను అన్ని దేశాల్లో పండించరు. పండించకూడదనే ఒడంబడిక ఉంది. కేవలం అనుమతి ఇవ్వబడిన దేశాల్లో (టర్కీ అందులో ఒకటి) – UN ఆధ్వర్యంలో మాత్రమే పండించాలి. కొన్ని రకాల స్వీట్లలోనూ, కొన్ని క్రానిక్ జబ్బుల నియంత్రణకై వాడటం కోసమే పరిమిత మొత్తంలో పండిస్తారు.
ఇవి డ్రగ్స్ కోసం ఎక్కువగా ఉపయోగించటం జరుగుతుంది. మార్ఫిన్ వంటి వాటి కోసం కూడా వినియోగిస్తారు. మెదడుకు శరీరంతో సంబంధం లేకుండా చేసేదే ఈ మార్ఫిన్. మూడో దశ క్యాన్సర్ పేషంట్లకూ ఇస్తుంటారు. మతిస్థిమితం కోల్పోయేలా చేయటం వలన క్యాన్సర్ బాధ తెలియకుండా ఉంటుంది.
గసగసాలలో ఓపియం ఆల్కలాయిడ్స్ మార్ఫిన్, కోడైన్‌లు ఎక్కువ మొత్తాలలో ఉంటాయి. విపరీతమైన మత్తుని కలిగిస్తాయి. డ్రగ్ టెస్ట్‌లో విఫలమయ్యేలా చేస్తాయి.
ఖుస్ ఖుస్/ఖష్ ఖష్ తినే వ్యక్తులు డ్రగ్స్ పరీక్షలో పాజిటివ్ అని తేలితే వారికి దండన విధించవచ్చని మలేషియా అధికారులు చెప్పిన తర్వాత యూనివర్సిటీ మలయా – పాథాలజీ విభాగం నుండి ముస్తఫా అలీ మొహద్ చేసిన పరిశీలనలు తెరముందుకు వచ్చాయి.
గసగసాలలో చాలా తక్కువ మొత్తంలో కోడైన్ ఉంటుందని, ఇది పెద్ద మొత్తంలో తీసుకుంటే తప్ప మూత్ర పరీక్షలో గుర్తించబడదని ఆయన అన్నారు. గసగసాల మొక్కలో చాలా భాగాలు వ్యసనానికి బానిస చేస్తాయని, మత్తుతో కూడిన ఆనందాన్ని కలిగిస్తాయని, కానీ విత్తనాలు తినవచ్చని ఆయన పేర్కొన్నారు.
అయితే ప్రస్తుతం విత్తనాలు కలిగి ఉంటే, ఎన్నోదేశాల్లో చట్టరీత్యా నేరంగా పరిగణిస్తున్నారు. మాదకద్రవ్యాలు కలిగి ఉంటే ఎలాంటి శిక్షలు ఉంటాయో, అవే వర్తిస్తాయి. ప్రస్తుతం సింగపూర్, తైవాన్, అమెరికా, సౌదీ, యూఏఈ గసగసాల సీడ్స్ కలిగి ఉంటే అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నాయి. కొన్ని దేశాల్లో డిఫెన్స్ కి కూడా ఆస్కారం లేదు.
అసలు సుగంధ ద్రవ్యాలలో ఒకటైన గసగసాల సాగుపై నిషేధం ఉందని ఎందరికి తెలుసు? గసగసాల కాయల నుండి నల్లమందు (ఓపియం) ఉత్పత్తి అవుతుందని, అది ప్రమాదకరమైనదని ఎంతమందికి తెలుసు?
మధ్యప్రదేశ్ , ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అత్యంత కట్టుదిట్టమైన చట్టాలకు లోబడి సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కొటిక్స్ అధికారుల పర్యవేక్షణలో సాగు చేస్తారు.
గసాల నుంచి నల్లమందు తయారవుతుంది అనే విషయం దాదాపు చాలా మందికి తెలుసు. నల్ల మందు ఒక మాదకద్రవ్యం. గసాలను పెద్ద బాణలిలో వేయించి మాడ్చి మరి కొన్ని దినుసులు కలిపి నల్ల మందు తయారుచేస్తారు.
మనలో చాలా మందికి కి నల్లమందు యుద్ధం గురించి తెలిసే ఉంటుంది. అత్యంత వినాశకరమైన యుద్ధం. చైనా ప్రజలను దుర్భర దారిద్ర్యంలో కి నెట్టిన యుద్ధం అది. కోట్లాది మంది రైతులు యుద్ధ ప్రభువుల సైన్యంలోకి బలవంతంగా నెట్టబడ్డ యుద్ధం అది.
గసాలు అత్యంత ఔషధ విలువలు ఉన్న (దినుసు) ధాన్యం. కానీ ఏ పదార్థమైనా మంచి కోసం కన్నా చెడుకు వాడటం మానవ నైజం.