Menu Close

మనం ఎదుగుతున్నాం…! నిజంగానే మనం ఎదుగుతున్నాం !

మనం ఎదుగుతున్నాం…!
నిజంగానే మనం ఎదుగుతున్నాం !

నిక్కర్ చిన్నదయ్యిందని స్కూలుకు వెళ్ళడానికి సిగ్గుపడ్డ మనం…
ఇప్పుడవే నిక్కర్లు వేసుకుని వీధుల్లో ఊరేగుతున్నాం…!
మనం ఎదుగుతున్నాం !!!

అమ్మ అరగంట కనబడకుంటేనే అల్లాడిపోయిన మనం…
అమ్మకు ఏడు సముద్రాల దూరంలో ఎక్కడో విదేశాల్లో బ్రతుకుతున్నాం…!
మనం ఎదుగుతున్నాం

నాన్నలోనే మన హీరోని చూసుకున్న మనం… నేనే హీరో…
నా ముందు నాన్నెంత అనుకునే స్థాయికి చేరుకున్నాం…!
మనం ఎదుగుతున్నాం !!!

గళ్ళపెట్టెల్లో చిల్లర దాచుకున్న మనం…
అవే చిల్లరబుద్ధులతో బ్యాంకుల్లో కోట్లు దాచుకుంటున్నాం…!
మనం ఎదుగుతున్నాం !!!

చుట్టాలు వెళ్లిపోతుంటే ఎంతో బాధపడ్డ మనం…
ఇప్పుడు వస్తుంటే భాధపడుతున్నాం…!
మనం ఎదుగుతున్నాం !!!

సంతోషాల కోసం పోటిపడుతూ పెరిగిన మనం…
ఇప్పుడు సంపాధనల్లో పోటీ పడుతున్నాం…!
మనం ఎదుగుతున్నాం !!!

చిన్నప్పుడంతా మనకు నచ్చినట్టు బ్రతికిన మనం…
ఇప్పుడు చచ్చినట్టు బ్రతుకుతున్నాం…!
మనం ఎదుగుతున్నాం !!!

మనిషికే పుట్టి… మనిషిలా పుట్టి…
కొన్నాళ్ళు మనిషిలానే పెరుగుతున్నాం…!
కానీ… మెల్లిగా మంచి అనే కంచెను తెంచుకుని…
మరమనిషిలా మారిపోతున్నాం…!
మనలో మనిషికి దూరంగా పారిపోతున్నాం..!
మంచి నుంచి వేగంగా జారిపోతున్నాం…!
నలుగురికి వెలుగునివ్వకుండానే ఆరిపోతున్నాం…!
ఎందుకంటే మనం ఎదుగుతున్నాం !!!
నిజంగానే మనం ఎదుగుతున్నాం !!!

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Like and Share
+1
1
+1
3
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading