Menu Close

ఒక లైలా కోసం – Lyrics In Telugu

ఒక లైలా లైలా లైలా
ఒక లైలా కోసం… తిరిగాను దేశం
ఒక లైలా కోసం… తిరిగాను దేశం
ప్రతి రోజు ప్రతి రాత్రీ… ప్రతి పాటా ఆమె కోసం
లైలా లైలా లైలా
ఒక లైలా కోసం… తిరిగాను దేశం
లైలా లైలా లైలా… లై లై లై లైలా

అకాశానికి నిచ్చెనవేసి… చుక్కల పట్టుకునడిగాను
లైలా ఏదనీ… నా లైలా ఏదనీ
స్వర్గానికి నే దారులు వెతికీ… ఇంద్రుని పట్టుకునడిగానూ
లైలా ఏదనీ… నా లైలా ఏదనీ

అక్కడ ఇక్కడ ఎక్కడనీ… దిక్కులు వెతుకుతు ఉన్నావూ
లైలా కోసం మజ్నూలా… ఎందుకు తికమక పడతావూ
ప్రతి చూపూ ప్రతి పిలుపూ… ప్రతి చోటా నీకోసం
ఒక లైలా కోసం… తిరిగాను దేశం

పగలూ రేయీ పందెం వేసీ
సృష్టిని పట్టుకు బ్రతిమాలాయి
మజ్నూ ఏడనీ… నా మజ్నూ ఏడనీ
రంభా ఊర్వశి ధైర్యం చేసీ… స్వర్గం విడిచీ వచ్చారూ
లైలా నేననీ… ఆహా లైలా నేననీ

ఇల్లూ వాకిలి వదిలొస్తే… రంభా ఊర్వశి అంటావూ
నీ కోసం నే పుట్టొస్తే… ఎవ్వరి వెంటో పడతావూ
ప్రతి రోజు ప్రతి రాత్రీ… ప్రతి పాటా ఆమె కోసం

ఒక లైలా కోసం… తిరిగాను దేశం
ప్రతి రోజు ప్రతి రాత్రీ… ప్రతి పాటా ఆమె కోసం
లైలా లైలా లైలా
ఒక లైలా లైలా లైలా… ఒక లైలా లైలా లైలా

Movie: Oka Laila Kosam Released Date – 25 February 2011
Director: Vijay Kumar Konda
Producer: Supriya Yarlagadda
Singers: S.P.Charan & Divya
Music: Anup Rubens
Lyrics: Dasari Narayana Rao
Star Cast: Naga Chaitanya, Pooja Hegde
Music Label: Aditya Music

Like and Share
+1
2
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading