Menu Close

Eppatiki Thana Guppeta Lyrics in Telugu – ఎప్పటికీ తన గుప్పెట విప్పదు

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Eppatiki Thana Guppeta Lyrics in Telugu – ఎప్పటికీ తన గుప్పెట విప్పదు

ఎప్పటికీ తన గుప్పెట విప్పదు
ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు
ఎందుకిలా ఎదురైనది… పొడుపు కథా
తప్పుకునేందుకు… దారిని ఇవ్వదు
తప్పు అనేందుకు… కారణముండదు
చిక్కులలో పడడం… తనకేం సరదా

బదులు తోచని ప్రశ్నల తాకిడి… ఏమిటో ఇలా
అలలు ఆగని సంద్రములా… మది మారితే ఎలా
నిన్న మొన్నా నీ లోపలా… కలిగిందా ఏనాడైనా కల్లోలం ఇలా
ఈరోజేమైందని ఏదైనా… అయ్యిందని
నీకైనా కాస్తయినా… అనిపించిందా

ఎప్పటికీ తన గుప్పెట విప్పదు
ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు
ఎందుకిలా ఎదురైనది… పొడుపు కథా
తప్పుకునేందుకు… దారిని ఇవ్వదు
తప్పు అనేందుకు… కారణముండదు
చిక్కులలో పడడం… తనకేం సరదా

ఏదోలా చూస్తారే… నిన్ను వింతలా
నిన్నే నీకు చూపుతారే… పోల్చలేనంతలా
మునపటిలా లేవంటూ… కొందరు నిందిస్తూ ఉంటే
నిజమో కాదో… స్పష్టంగా తేలేదెలా
సంబరపడి నిను చూపిస్తూ… కొందరు అభినందిస్తుంటే
నవ్వాలో నిట్టూర్చాలో తెలిసేదెలా…

బదులు తోచని ప్రశ్నల తాకిడి… ఏమిటో ఇలా
అలలు ఆగని సంద్రములా… మది మారితే ఎలా

నీ తీరే మారింది… నిన్నకీ నేటికీ
నీ దారే మళ్లుతోందా… కొత్త తీరానికి
మార్పేదైనా వస్తుంటే… నువ్వది గుర్తించక ముందే
ఎవరెవరో చెబుతూ ఉంటే నమ్మేదెలా ??
వెళ్లే మార్గం ముళ్లుంటే… ఆ సంగతి గమనించందే
తొందరపడి ముందడుగేసే వీళ్ళేదెలా ??

బదులు తోచని ప్రశ్నల తాకిడి… ఏమిటో ఇల
అలలు ఆగని సంద్రములా… మది మారితే ఎలా

Movie: Mr.Perfect Released Date – 21 April 2011
Director: K. Dasaradh
Producer: Dil Raju
Singers: Karthik, Mallikarjun
Music: Devi Sri Prasad
Lyrics: Sirivennela Seetharama Sastry
Star Cast: Prabhas, Kajal Aggarwal, Taapsee Pannu
Music Label: Aditya Music

Eppatiki Thana Guppeta Lyrics in Telugu – ఎప్పటికీ తన గుప్పెట విప్పదు, badhulu thochani lyrics

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
బిగ్గ్ బాస్ 8 లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ?

Subscribe for latest updates

Loading