ఓ రంగుల చిలక… చూడే నీ ఎనక
అలుపంటూ లేనీ… పిల్లడి నడక
ఓ బంగారు తళుక… చుట్టూ ఈ కలకా
ఎక్కడికే ఆ అడుగుల చప్పుడు వినకా
ఓ సారిటుచూడే… పాపం పసివాడే
నీ చూపుల కోసం వేచి ఉన్నాడే
అన్నీ వదిలేసి… నిన్నే వలచాడే
నీ తలపుల్లోనే నిదురే మరిచాడే
మోమాటలన్ని పక్కన వదిలాడే
మొండిగ నిను వీడక… ముందుకు కదిలాడే
ఎవరేమనుకున్న తానేమనుకోడే
అండగ నీ ప్రేమలో… మైమరపయ్యాడే
ఓ సారిటు చూడే పాపం పసివాడే
నువ్వంటూ లేని ధ్యాసే లేనోడే
బిడియం కలవాడే… తదయము అనలేడే
అయినా నిను గెలిచే… మనసే ఉన్నోడే
నిన్నందరికి కంటే… మిన్నగా చూస్తాడే
నిన్నెవరేమన్నా యుద్ధం చేస్తాడే
నీతో నడిచే… ఆ ఏడడుగుల కోసం
వే వేెలడుగులనైన… నడిచే ఘనుడే
ఓ సారిటు చూడే పాపం పసివాడే
నువు నడిచేదారిని… వదలని ప్రేమికుడే
గుండె తలుపుల్ని… తెరిచి ఉంచాడే
దేవత నువ్వంటూ… భక్తుడు అయ్యాడే
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.