Menu Close

Mounama O Mounama Song Lyrics In Telugu – Naanna Nenu Naa Boyfriend

మౌనమా ఓ మౌనమా… మాట లేదుగా
పాదమా ఓ పాదమా… బాట లేదుగా
తొలి ప్రేమలో నీ ఆటలో… గెలిచావు నీవు హాయిగా
ఆ ప్రేమ లేని చోటులో… నిలిచావు నేడు రాయిగా

గుండె చప్పుడాగిపోతుందే… కంటి నీరు పొంగి పోతుందే
కాలమెంత మారిపోతుందే… పారిపోతుందే, చేజారి పోతుందే
ఆశ ఆవిరై పోతుందే… శ్వాస భారమై పోతుందే
ప్రేమ మాయమై పోతుందే… పారిపోతుందే, చేజారి పోతుందే

వెలుగులలో నువ్వు మునకేసి… చీకటి తీరం చేరావే
చిరునవ్వే నువ్వు ఉరి తీసి… బాధకు ఊపిరి పోసావే
సరదా సరదా స్వేచ్ఛను తెంచి… సంకెలలాగా మార్చావే
జతగా బతికే బదులే వెతికి… జవాబు లేనట్టి ప్రశ్నల్లె మిగిలావే

గుండె చప్పుడాగిపోతుందే… కంటి నీరు పొంగి పోతుందే
కాలమెంత మారిపోతుందే… పారిపోతుందే, చేజారి పోతుందే
తప్పు ఉప్పెనై పోతుందే… ప్రేమ కప్పుకేల్లి పోతుందే
తల్లకిందులై పోతుందే… ఆరిపోతుందే, తెల్లారి పోతుందే

నేరమనేది నీది కదా… శిక్ష పడేది అందరికా
తప్పు అనేది నీది కదా… నొప్పి అనేది అందరికా
మూడే ముళ్ళు ప్రేమే కోరగ… మూడు ముళ్ళులతో గుచ్చావే
ఏడడుగులుగా ప్రేమను మార్చగ… ప్రేమన్న పదానికి అర్ధాన్ని మార్చావే

గుండె చప్పుడాగిపోతుందే… కంటి నీరు పొంగి పోతుందే
కాలమెంత మారిపోతుందే… పారిపోతుందే, చేజారి పోతుందే
చిక్కు పెద్దదై పోతుందే… దిక్కు తోచకుండా పోతుందే
లెక్క నేడు మారిపోతుందే… తేరిపోతుందే చేజారి పోతుందే

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading